..................................... ********.....................................
701. స్నేహమై ఆహ్వానించా..
న మనసుతోటలో స్వేచ్ఛగా విహరిస్తావనే..
702. నన్ను నీకు విడిచిపెట్టేసా..
నీలో భద్రంగా ఉంటాననే..
703. మనసైన విహారమేగా నీకు..
మేఘుడివై మనసంతా విహరిస్తే..
704. నిశ్శబ్దమైపోతాలే..
నా అస్తిత్వం నిన్నల్లరి పెడుతుందని..
705. సరిఫోవడంలా అక్షరాలు..
రాసేకొద్దీ నువ్వింకా గుర్తుకొచ్చి మెలిపెడ్తుంటే..
706. కన్నీళ్ళను కట్టేసా..
ఆ వరదలో నువ్వు కొట్టుకుపోతావనే
707. ఘనీభవిస్తాలే..
నాకోసం వేసవై నువ్వు విచ్చేసినందుకైనా
708. హాసాల వెల్లువే..
నవవసంతమై నా పెదవిని అలంకరించాక..
709. మధురోహల దోసిళ్ళు చాపావుగా..
నా నవ్వులన్నీ కాజేస్తూ..
710. పరుగెడుతున్నాయి క్షణాలు..
నిన్ను నాకంటే ముందుగా చేరాలని.
711. ఎర్రబడ్డ నీ పెదవులు పట్టిస్తున్నాయిగా..
నా నుదుటికుంకుమ అలదుకుంది తామేనని.
712. మరింత ఘుమఘుమలాడుతోంది..
మంచితనం నిన్నలంకరించినందుకే..
713. పయనమైన కలలు..
కన్నీళ్ళలో ఈదలేమంటూ..
714. నిజమెప్పుడూ మంటే..
అబద్దానికి దాసోహమైనందుకు..
715. ఒకే ఒక్క పథకం..
తన జీవితాన్ని నిలబెట్టేట్లుగా
716. నా మనస్సుమానికెంత సంతోషమో..
తనను హృదయానికి అలంకరించుకున్నందుకు..
717. కడలి పొంగితే ఊరు మునిగే..
కన్నీరు పొంగితే కుటుంబమే మునిగే..
718. చీకటిలో సాంత్వన..
నా అన్వేషణలో నేనే తోడుగా..
719. పూమెత్తనిరెక్కలై వాలాయి..
నీ జ్ఞాపకాల సుగంధమని తెలిసిందిలే..
720. వేరే రాతిరెందుకు..
నా కురులే కారుచీకటై నిన్ను ప్రేమగా పెనవేస్తే
721. వాడ్ని కట్టుకున్నందుకే..
ఆమె అస్తిత్వం చీకటింటికే పరిమితమయ్యింది
722. గుభాళించింది చీకటి..
కోరికల మల్లెల ఘుమఘుమలతో రాతిరి.
723. ఎందుకన్ని బంధాల ప్రయాసలో మనిషికి..
చీకట్లోంచీ చీకట్లోకే పయనమని తెలిసినా..
724. కడిగేసాగా నీలో చీకటిని..
విషాదాశ్రువులని ఆనందభాష్పాలుగా మార్చేసి..
725. చిత్తరువే అయ్యాను..
చీకటిని చిత్రించిన విచిత్రకుంచెని చూసి..
726. వెలుగుతూనే ఉంటుంది అసూయ..
తానో ప్రత్యేకమనుకొని గర్విస్తూ..
727. చీకట్లోకే పయనమయ్యింది..
వెలుగుకి సాంత్వన అక్కడేనని గ్రహించి..
728. చిలిపికలలకు మెలకువొచ్చింది..
వెలుగిచ్చిన నీ ఆశాదీపాల రెపరెపలకే..
729. ముసుగేసా వెలుతురుకి..
చీకటిని నీకై ఎలాగోలా సృష్టిద్దామనే..
730. చీకటైతేనేమి..
కొన్ని ఆకలిజీవితాలకి వెలుతురుని పంచిందిగా
731. చిందులేస్తోంది చీకటి..
తారల తోడు తనకి దొరికిందని..
732. జాబిలమ్మ జోల పాడిందేమో చీకటయ్యిందని..
అడవికేమో మెలకువొచ్చింది వెన్నెల వెలుతురొచ్చిందని..
733. వ్యసనం కానీకు ఒంటరితనాన్ని..
ఏకాంతంగా మలచుకో చీకటిరేయిని..
734. నేనో చీకటినని ఆనాడే మరచా..
అగ్గిరవ్వతో నా స్నేహం మొదలైనప్పుడే..
735. వెన్నెలై నువు కురిసాకే తెలిసింది..
చీకటింటి వెలుతురులో అందం ద్విగిణీకృతమైందని..
736. అభిషేకించాలనేమో అశ్రువులు..
చీకటివానను తోడ్కొచ్చాయి
737. చినుకై కురిసింది వెలుగు..
చీకటిలో జ్యోతై వెలగాలనే..
738. రాతిరికి సిగ్గెందుకో..
చీకటిలో రహస్యపు రాగాలను పాడాలనేమో..
739. చీకటిరాతిరికెన్ని చింతలో..
ఏ అఘాయిత్యాన్ని కళ్ళతో చూడాలోనని..
740. గ్రీష్మానికెంత గర్వమో..
పొయ్యి లేకుండానే మనల్ని ఉడికిస్తుందని.
741. చీకటి గతానికి చరమగీతం..
వేకువ వర్తమానానికి సుప్రభాతం..
742. చీకటి రహస్యాలెన్నో..
జీవితాన్ని నరకపుటంచులపై నిర్దయగా నడిపిస్తూ..
743. ఎంత ఏకాకితనమో..
చుక్కల నడుమ ఒంటరైన ఆకాశానికి..
744. నీ మధువీక్షణం చాలేమో..
నా నిరీక్షణ సఫలమయ్యేందుకు
745. హృద్గుహలో తొక్కిసలాట..
నిరంతరాలోచనల సామూహిక దాడి ప్రభావమనుకుంట
746. మనసుకి చూపుందేమో..
నిన్నో దృశ్యమాలిక చేసి దాచుకుందిగా..
747. అక్కడేముందని..
శరీరపు సరిహద్దుల్లో సైతం క్రోధ భీభత్సం తప్ప..
748. ఉన్మత్తగానం ఆలపిస్తోంది కోయిల..
భయంకరమైన చీకట్లో ఉందేమో
749. ఆ క్షణాలెప్పుడూ అక్షయాలే..
మల్లెపూలై పరిమళించి మనవైనందుకు..
750. కిరణమై వస్తే చాలు హృదయంలోకి..
చీకటి తొలగి వేకువవుతుంది క్షణాలకి...
..................................... ********.....................................
701. స్నేహమై ఆహ్వానించా..
న మనసుతోటలో స్వేచ్ఛగా విహరిస్తావనే..
702. నన్ను నీకు విడిచిపెట్టేసా..
నీలో భద్రంగా ఉంటాననే..
703. మనసైన విహారమేగా నీకు..
మేఘుడివై మనసంతా విహరిస్తే..
704. నిశ్శబ్దమైపోతాలే..
నా అస్తిత్వం నిన్నల్లరి పెడుతుందని..
705. సరిఫోవడంలా అక్షరాలు..
రాసేకొద్దీ నువ్వింకా గుర్తుకొచ్చి మెలిపెడ్తుంటే..
706. కన్నీళ్ళను కట్టేసా..
ఆ వరదలో నువ్వు కొట్టుకుపోతావనే
707. ఘనీభవిస్తాలే..
నాకోసం వేసవై నువ్వు విచ్చేసినందుకైనా
708. హాసాల వెల్లువే..
నవవసంతమై నా పెదవిని అలంకరించాక..
709. మధురోహల దోసిళ్ళు చాపావుగా..
నా నవ్వులన్నీ కాజేస్తూ..
710. పరుగెడుతున్నాయి క్షణాలు..
నిన్ను నాకంటే ముందుగా చేరాలని.
711. ఎర్రబడ్డ నీ పెదవులు పట్టిస్తున్నాయిగా..
నా నుదుటికుంకుమ అలదుకుంది తామేనని.
712. మరింత ఘుమఘుమలాడుతోంది..
మంచితనం నిన్నలంకరించినందుకే..
713. పయనమైన కలలు..
కన్నీళ్ళలో ఈదలేమంటూ..
714. నిజమెప్పుడూ మంటే..
అబద్దానికి దాసోహమైనందుకు..
715. ఒకే ఒక్క పథకం..
తన జీవితాన్ని నిలబెట్టేట్లుగా
716. నా మనస్సుమానికెంత సంతోషమో..
తనను హృదయానికి అలంకరించుకున్నందుకు..
717. కడలి పొంగితే ఊరు మునిగే..
కన్నీరు పొంగితే కుటుంబమే మునిగే..
718. చీకటిలో సాంత్వన..
నా అన్వేషణలో నేనే తోడుగా..
719. పూమెత్తనిరెక్కలై వాలాయి..
నీ జ్ఞాపకాల సుగంధమని తెలిసిందిలే..
720. వేరే రాతిరెందుకు..
నా కురులే కారుచీకటై నిన్ను ప్రేమగా పెనవేస్తే
721. వాడ్ని కట్టుకున్నందుకే..
ఆమె అస్తిత్వం చీకటింటికే పరిమితమయ్యింది
722. గుభాళించింది చీకటి..
కోరికల మల్లెల ఘుమఘుమలతో రాతిరి.
723. ఎందుకన్ని బంధాల ప్రయాసలో మనిషికి..
చీకట్లోంచీ చీకట్లోకే పయనమని తెలిసినా..
724. కడిగేసాగా నీలో చీకటిని..
విషాదాశ్రువులని ఆనందభాష్పాలుగా మార్చేసి..
725. చిత్తరువే అయ్యాను..
చీకటిని చిత్రించిన విచిత్రకుంచెని చూసి..
726. వెలుగుతూనే ఉంటుంది అసూయ..
తానో ప్రత్యేకమనుకొని గర్విస్తూ..
727. చీకట్లోకే పయనమయ్యింది..
వెలుగుకి సాంత్వన అక్కడేనని గ్రహించి..
728. చిలిపికలలకు మెలకువొచ్చింది..
వెలుగిచ్చిన నీ ఆశాదీపాల రెపరెపలకే..
729. ముసుగేసా వెలుతురుకి..
చీకటిని నీకై ఎలాగోలా సృష్టిద్దామనే..
730. చీకటైతేనేమి..
కొన్ని ఆకలిజీవితాలకి వెలుతురుని పంచిందిగా
731. చిందులేస్తోంది చీకటి..
తారల తోడు తనకి దొరికిందని..
732. జాబిలమ్మ జోల పాడిందేమో చీకటయ్యిందని..
అడవికేమో మెలకువొచ్చింది వెన్నెల వెలుతురొచ్చిందని..
733. వ్యసనం కానీకు ఒంటరితనాన్ని..
ఏకాంతంగా మలచుకో చీకటిరేయిని..
734. నేనో చీకటినని ఆనాడే మరచా..
అగ్గిరవ్వతో నా స్నేహం మొదలైనప్పుడే..
735. వెన్నెలై నువు కురిసాకే తెలిసింది..
చీకటింటి వెలుతురులో అందం ద్విగిణీకృతమైందని..
736. అభిషేకించాలనేమో అశ్రువులు..
చీకటివానను తోడ్కొచ్చాయి
737. చినుకై కురిసింది వెలుగు..
చీకటిలో జ్యోతై వెలగాలనే..
738. రాతిరికి సిగ్గెందుకో..
చీకటిలో రహస్యపు రాగాలను పాడాలనేమో..
739. చీకటిరాతిరికెన్ని చింతలో..
ఏ అఘాయిత్యాన్ని కళ్ళతో చూడాలోనని..
740. గ్రీష్మానికెంత గర్వమో..
పొయ్యి లేకుండానే మనల్ని ఉడికిస్తుందని.
741. చీకటి గతానికి చరమగీతం..
వేకువ వర్తమానానికి సుప్రభాతం..
742. చీకటి రహస్యాలెన్నో..
జీవితాన్ని నరకపుటంచులపై నిర్దయగా నడిపిస్తూ..
743. ఎంత ఏకాకితనమో..
చుక్కల నడుమ ఒంటరైన ఆకాశానికి..
744. నీ మధువీక్షణం చాలేమో..
నా నిరీక్షణ సఫలమయ్యేందుకు
745. హృద్గుహలో తొక్కిసలాట..
నిరంతరాలోచనల సామూహిక దాడి ప్రభావమనుకుంట
746. మనసుకి చూపుందేమో..
నిన్నో దృశ్యమాలిక చేసి దాచుకుందిగా..
747. అక్కడేముందని..
శరీరపు సరిహద్దుల్లో సైతం క్రోధ భీభత్సం తప్ప..
748. ఉన్మత్తగానం ఆలపిస్తోంది కోయిల..
భయంకరమైన చీకట్లో ఉందేమో
749. ఆ క్షణాలెప్పుడూ అక్షయాలే..
మల్లెపూలై పరిమళించి మనవైనందుకు..
750. కిరణమై వస్తే చాలు హృదయంలోకి..
చీకటి తొలగి వేకువవుతుంది క్షణాలకి...
..................................... ********.....................................
No comments:
Post a Comment