Wednesday, 18 November 2015

ద్విపదాలు : 551 నుండి 600 వరకు

..................................... ********.....................................

551. అనుపల్లవిని తోడుంచా..
పల్లవి నాలా ఒంటరి కాకూడదనే..

552. బ్రతికున్నాననే నిజం..
నన్ను నీలో కనుగొన్న ప్రతీసారీ..

553. కలలన్నీ కలవరింతలే..
నాకై నీవు నిరీక్షించే సమయాన..

554. మెరుపుతీగనే నేను..
నీ మాటలతో విద్యుత్తుగా మారిపోతూ..

555. నీ నవ్వును దాచుకున్నా మువ్వల్లో..
అలిగిన పెదవిని సడిచేసి అలరిస్తుందనే..

556. నిత్యవిద్యార్థులేగా ప్రతిఒక్కరూ..
అక్షరాలనే మకుటాలుగా మార్చడం నేర్చుకుంటూ..

557. పుడమి గట్టిపడింది..
మృగమే మనిషి ముసుగులో సంచరిస్తున్నందుకు..

558. కురులు పరిమళిస్తున్నాయి..
నీ చేయి మల్లెలు అలంకరించినందుకే..

559. రాయబోయే అక్షరం..
ఏం రాస్తుందో నీ గురించి..

560. చీకటంటేనే ప్రియం వాడికి..
విశృంఖలాన్ని తనలో దాస్తుందని..

561. నీ రూపును దాచుకున్నా..
నా మనసును మురిపించేందుకే

562. ముసిరింది వైరాగ్యం..
గతం చీకటై నన్ను కమ్మినందుకే..

563. కురిసింది అమృతం..
వెన్నెల చినుకుల్ని నేను వీడనందుకే

564. నేనెప్పుడూ నిజమే..
నీ చూపులో చంద్రికనై చేరినప్పుడే..

565. కలిసింది ప్రియరాగం..
అపురూపమై నా చేయి నీవందుకోగానే..

566. విరహాలవంతెనలే దాటుతున్న..
వసంతమై నిన్ను చేరి చిగురించాలనే..

567. విరహాన్ని పిలుస్తావెందుకలా..
వేదనదిని దాటే ఓపిక నీకున్నందుకా.

568. దాసోహమైపోయా ఆనాడే..
సందేహం వీడిన దేహంలో సగమై..

569. నా కలలకు తెర నీవేగా..
నిన్ను నాలో చూసుకొనే సమయాన..

570. ఈ వైశాఖానికీ మరుపులే..
వానొచ్చే కాలం ముందున్నా నీ చూపుల వెలుగులతో..

571. ఎప్పుడూ నాన్న కూతుర్నే..
తన కంటివెలుగై నేనున్నంతవరకూ..

572. నమ్మలేకున్నా..
మహాదుఃఖానికి రూపమొస్తే నాలా ఉంటుందని..

573. కలుసుకోవాలనుంది నిన్ను..
ఎవ్వరూ తొంగిచూడలేని నీ హృదయంలోనే..

574. వెలిగిపోవాలనుంది..
వెలుగుకిరణమై నీవు నన్ను తడిమినందుకే

575. అనేకవర్ణాలు నింపుకుంది కన్ను..
నీ అపురూపాన్ని అలంకరించాలనే..

576. అల్లుకుపోయా నీ హృదయాన్ని..
రహస్యంగానైనా నన్ను దాచుకున్నావనే..

577. కురిసిపోవాలనుంది నాకు..
నిలువెల్లా తడిపేసి తరంగమై వణికించాలని..

578. కంటిపాపకి కలలెక్కడివి..
రెప్పలుమూయని వాకిళ్ళుగా కళ్ళు మారాక..

579. ప్రియమైన విహారమేగా నీ మది..
విచ్చేసిన ప్రతీసారీ సరికొత్తగా నన్నాహ్వానిస్తూ

580. కరిగిపోతున్నా నేను..
కావ్యమై నన్ను రాసి కలవరించినందుకే..

581. గిలిగింతలతో పెనవేసా..
నీ ఊహలరాగాలకు అనుపల్లవి నేనైనందుకే..

582. ఎదురే ఉందిగా లక్ష్యం..
వెనుకడుగేసే ఉద్దేశ్యమే లేదుగా..

583. వసంతాన్ని రాయమంటావే..
శిశిరమై నాకు దూరంగా ఉన్నందుకా..

589. నీ విరహంలో నేను..
నక్షత్రాలకై నిరీక్షిస్తున్న శూన్యాకాశాన్నేగా

590. నేనున్నదందుకేగా..
శూన్యాన్ని నీ దరిచేరనివ్వనుగా..

591. ప్రతీక్షణలో పుట్టిందనుకున్నా శూన్యం..
నాతోనే నిత్యముంటుందని గమనించనందుకే..

592. ఇరువురమొకటయ్యాం శూన్యంలోనే..
ఒకరినొకరు పరిచయించుకుంది అప్పుడే మరి..

593. శూన్యమే స్వగృహమైంది..
నన్ను నేను కనుగొన్నది తనలోనేనని...

594. అమాసంటని జాబిల్లినేగా..
నా శూన్యం నీతో పూరించినందుకు..

595. వెన్నెలకొమ్మ నేనేగా..
నీకై వెలుగు చినుకులు కురిపించేందుకు.

596. సృష్టి నర్తించింది..
శూన్యంలోంచి బయటపడి నిశ్శబ్దాన్ని గెలిచినందుకే..

597. రమణీయమేగా రామాయణం..
భావానికందని శూన్యాన్ని శ్లోకంగా రాసిందని..

598. గేయమై కొలువుంది నీవేగా..
నా అక్షరాలఅల్లికలో దారమైనట్లు..

599. దిక్కులేక కన్నీరు కార్చినప్పుడు తెలిసింది..
ఊపిరి సలపని శూన్యం ఆవరించిందని..

600. శూన్యం ఎగిరిపోయింది..
నువ్వు పరిచయించాకే

..................................... ********.....................................

No comments:

Post a Comment