..................................... ********.....................................
3001. పరిమళిస్తున్నా జీవిత పుటలు..
జ్ఞాపకాల అత్తర్లకు జోడవుతూ.
3002. అనుబంధానికి శ్రీకారం చుట్టేసా..
సొగసైన పదబంధంతోనే నిన్నల్లుకోవాలని.
3003. మధుపాత్రను మోసుకొచ్చా..
నీకైనా కవితా దాహం తీర్చుదామని
3004. కవితనై పొంగిపోయా..
కమలంలో తేనెలు సిరాగా మార్చి నన్ను రాసావని
3005. కెరటంలా పొంగింది కేరింత..
వలపుకు పచ్చదనాలు పూసేస్తూ
3006. ఆలకిస్తున్నా నీ ఆలాపన..
మదికి సల్లాపాలు పంచుతుంటే
3007. సముద్రమంతా తీపయ్యింది..
నీ మనసుమధురాలు తనలో కలుపుకున్నాక
3008. అనురాగమే ఆలంబన..
శృతి తప్పిన గానాన్ని సరిచేయాలంటే..
3009. అనురాగం అనుబంధమయ్యింది..
అభిమానం ఊయలూపాక.
3010. విల్లయ్యింది పెదవి..
వానవిల్లుగా నీ మదిలో మెరవాలనే
3011. అభావమై మౌనవించిన నా మోవి..
నీరెండ రహస్యాన్ని ముసుగేసుకున్న ఆకాశంలా
3012. ఎంతదృష్టమో హరివిల్లు..
నాతో పోల్చగలిగే అందం తనదైనందుకు.
3013. దారి తప్పిన మనసు..
నీ చిరునవ్వుల ఎదురుచూపులోనే
3014. ఎన్ని శిశిరాల నిశ్శబ్దమో..
మనసును స్తబ్దుగా మార్చేస్తూ..
3015. అనుబంధానికి శ్రీకారం చుట్టేసా..
సొగసైన పదబంధంతోనే నిన్నల్లుకోవాలని
3016. మధుపాత్రను మోసుకొచ్చా..
నీకైనా కవితా దాహం తీర్చుదామని
3017. చినుకై రాలిన విషాదం..
ఆదరణ కరువైన కన్నుల్లో
3018. నిశ్శబ్దక్షణంలో అడవిపూల పరిమళం..
ప్రేమలేఖను మోసుకొచ్చిన సమీరమేమో
3019. మూగసైగలే మోజయ్యాయి..
మౌనంపై మనసయ్యిందనే
3020. ఝల్లుమన్న ఊహలు..
నీ పెదవులకు కానుకైనందుకే మురిసిపోతూ.
3021. మందాకినిలో చందమామలా నేను..
నీ తలపుల తాకిడికి చెమరించిన గులాబీ రేకులా
3022. వసంతంలో అల్లరికోయిలలా నువ్వు..
వెన్నెలమైదానంలో ఒంటరికలువలా నేను
3023. మబ్బుల్లో దాగిన వానచినుకులా నువ్వు..
నీకై నిరీక్షిస్తూ నేలపై నేను
3024. కొమ్మచాటు అందాలకు కులుకెందుకో..
అందుకోమని ఆనందానికి కబురెట్టాక..
3025. మూగబోయిన నాలో కవితా సృజన..
నీవొచ్చి మేల్కొల్పే మహత్తరక్షణాలకై ఎదురుచూస్తూ.
3026. నీ ఎదుర్కోలు..
నాలో వేకువకి సన్నాయి ఆహ్వానాలు
3027. నీరవానికర్ధం తెలిసొచ్చింది..
నా మౌనానికి భాష్యం నువ్వయ్యాక..
3028. కాటుకలకే అందమొచ్చింది..
నీ చూపుతోనే కన్నులను అభినందించాక.
3029. పదునెక్కిన చూపులు..
నీగుండె మెత్తదనాన్ని అంచనా వేసినందుకేమో
3030. కవిత్వాన్ని హత్తుకుంటున్నా..
నిలకడలేని క్షణాలతో భారంగా సాగలేక..
3031. అరవిరి సొబగుల సవ్వడైతేనేమి..
మూగమనసుకు స్పందనలు నేర్పిందిగా..
3032. మహామౌనమేగా మనసుకి..
గుప్పెడంత గుండెసవ్వడి నీరవంలో ఒరిగాక.
3033. కాటుకరెప్పల సవ్వళ్ళు..
నీవల్లనే కన్నుల్లో కార్తీకం నవ్విందని..
3034. మనసంతా దీపావళి..
నీ ఒక్క పలకరింపు నా ఎదలో మరుదివ్వెలయినందుకే
3035. కోటికాంతులన్నీ నా కన్నుల్లోనే..
ఆనందాన్వేషణ సఫలమై నిలిచినందుకు
3036. పట్టపగలే దీపావళెందుకో నీ కన్నుల్లో..
చూపులకందని వెలుగు నాలో కనిపిస్తోందనా
3037. మేఘాంచలాల్లో దీపావళి సంబరాలు..
అరుణకాంతులు ఆకాశాన పురిటివెలుగులవుతుంటే.
3038. కన్నుల కులుకులు..
మనసంతా నువ్వని మౌనంగా నువ్వంటుంటే..T
3039. . చిగురుమెత్తనై కురిసింది ప్రేమ..
వలపుగంధంలో వెన్నెల మిళితమయ్యిందనేమో.
3040. కన్నుల్లో కాకరపువ్వొత్తులే..
నువ్వలా గంధర్వగానంతో నన్ను పొగుడుతుంటే.
3041. వినిపించని రాగాల మధురిమలు..
రెండు మౌనాలు ఒక్కటయినందుకేమో.
3042. అన్వేషిస్తున్నా ప్రేమఋతువుని..
ఆరారు కాలాలు గడిచినా రాలేదేమని
3043. పంచప్రాణాలనూ ఉరకలెత్తిస్తావు..
సప్తపదులకు తడబడే అడుగులకు తాళమేసినట్లు
3044. దీపాల వరుసలో చేరిపోయా..
నీకు దీపావళి నేనవ్వాలనే
3045. చూపుల్లో చేరిపోతానైతే..
నీ ఆశాజ్యోతినై నిత్యకొలువు చేయొచ్చని
3046. అల్లరిగాలినై అల్లుకున్నందుకేమో..
అడుగులేస్తున్న నీలో ఆనందం ఉరకలేస్తూ.
3047. రెల్లుపువ్వునై నవ్వుకుంటున్నా..
పిల్లగాలితో పోల్చి మనసు తేలికచేసినందుకు..
3048. ప్రేమాన్వేషణలో విసిగిపోయా..
అనంతమై ప్రవహిస్తున్న అశ్రువులను ఆపలేకనే..
3049. ప్రవహిస్తున్న పరిమళాలెన్నో నాలో..
నీ తలపులు గంధాలవుతుంటే.
3050. నీ పిలుపునాలకిస్తూ నేను..
అనుస్వరమై బదులివ్వాలని ఎదురుచూస్తూ..
..................................... ********.....................................
3001. పరిమళిస్తున్నా జీవిత పుటలు..
జ్ఞాపకాల అత్తర్లకు జోడవుతూ.
3002. అనుబంధానికి శ్రీకారం చుట్టేసా..
సొగసైన పదబంధంతోనే నిన్నల్లుకోవాలని.
3003. మధుపాత్రను మోసుకొచ్చా..
నీకైనా కవితా దాహం తీర్చుదామని
3004. కవితనై పొంగిపోయా..
కమలంలో తేనెలు సిరాగా మార్చి నన్ను రాసావని
3005. కెరటంలా పొంగింది కేరింత..
వలపుకు పచ్చదనాలు పూసేస్తూ
3006. ఆలకిస్తున్నా నీ ఆలాపన..
మదికి సల్లాపాలు పంచుతుంటే
3007. సముద్రమంతా తీపయ్యింది..
నీ మనసుమధురాలు తనలో కలుపుకున్నాక
3008. అనురాగమే ఆలంబన..
శృతి తప్పిన గానాన్ని సరిచేయాలంటే..
3009. అనురాగం అనుబంధమయ్యింది..
అభిమానం ఊయలూపాక.
3010. విల్లయ్యింది పెదవి..
వానవిల్లుగా నీ మదిలో మెరవాలనే
3011. అభావమై మౌనవించిన నా మోవి..
నీరెండ రహస్యాన్ని ముసుగేసుకున్న ఆకాశంలా
3012. ఎంతదృష్టమో హరివిల్లు..
నాతో పోల్చగలిగే అందం తనదైనందుకు.
3013. దారి తప్పిన మనసు..
నీ చిరునవ్వుల ఎదురుచూపులోనే
3014. ఎన్ని శిశిరాల నిశ్శబ్దమో..
మనసును స్తబ్దుగా మార్చేస్తూ..
3015. అనుబంధానికి శ్రీకారం చుట్టేసా..
సొగసైన పదబంధంతోనే నిన్నల్లుకోవాలని
3016. మధుపాత్రను మోసుకొచ్చా..
నీకైనా కవితా దాహం తీర్చుదామని
3017. చినుకై రాలిన విషాదం..
ఆదరణ కరువైన కన్నుల్లో
3018. నిశ్శబ్దక్షణంలో అడవిపూల పరిమళం..
ప్రేమలేఖను మోసుకొచ్చిన సమీరమేమో
3019. మూగసైగలే మోజయ్యాయి..
మౌనంపై మనసయ్యిందనే
3020. ఝల్లుమన్న ఊహలు..
నీ పెదవులకు కానుకైనందుకే మురిసిపోతూ.
3021. మందాకినిలో చందమామలా నేను..
నీ తలపుల తాకిడికి చెమరించిన గులాబీ రేకులా
3022. వసంతంలో అల్లరికోయిలలా నువ్వు..
వెన్నెలమైదానంలో ఒంటరికలువలా నేను
3023. మబ్బుల్లో దాగిన వానచినుకులా నువ్వు..
నీకై నిరీక్షిస్తూ నేలపై నేను
3024. కొమ్మచాటు అందాలకు కులుకెందుకో..
అందుకోమని ఆనందానికి కబురెట్టాక..
3025. మూగబోయిన నాలో కవితా సృజన..
నీవొచ్చి మేల్కొల్పే మహత్తరక్షణాలకై ఎదురుచూస్తూ.
3026. నీ ఎదుర్కోలు..
నాలో వేకువకి సన్నాయి ఆహ్వానాలు
3027. నీరవానికర్ధం తెలిసొచ్చింది..
నా మౌనానికి భాష్యం నువ్వయ్యాక..
3028. కాటుకలకే అందమొచ్చింది..
నీ చూపుతోనే కన్నులను అభినందించాక.
3029. పదునెక్కిన చూపులు..
నీగుండె మెత్తదనాన్ని అంచనా వేసినందుకేమో
3030. కవిత్వాన్ని హత్తుకుంటున్నా..
నిలకడలేని క్షణాలతో భారంగా సాగలేక..
3031. అరవిరి సొబగుల సవ్వడైతేనేమి..
మూగమనసుకు స్పందనలు నేర్పిందిగా..
3032. మహామౌనమేగా మనసుకి..
గుప్పెడంత గుండెసవ్వడి నీరవంలో ఒరిగాక.
3033. కాటుకరెప్పల సవ్వళ్ళు..
నీవల్లనే కన్నుల్లో కార్తీకం నవ్విందని..
3034. మనసంతా దీపావళి..
నీ ఒక్క పలకరింపు నా ఎదలో మరుదివ్వెలయినందుకే
3035. కోటికాంతులన్నీ నా కన్నుల్లోనే..
ఆనందాన్వేషణ సఫలమై నిలిచినందుకు
3036. పట్టపగలే దీపావళెందుకో నీ కన్నుల్లో..
చూపులకందని వెలుగు నాలో కనిపిస్తోందనా
3037. మేఘాంచలాల్లో దీపావళి సంబరాలు..
అరుణకాంతులు ఆకాశాన పురిటివెలుగులవుతుంటే.
3038. కన్నుల కులుకులు..
మనసంతా నువ్వని మౌనంగా నువ్వంటుంటే..T
3039. . చిగురుమెత్తనై కురిసింది ప్రేమ..
వలపుగంధంలో వెన్నెల మిళితమయ్యిందనేమో.
3040. కన్నుల్లో కాకరపువ్వొత్తులే..
నువ్వలా గంధర్వగానంతో నన్ను పొగుడుతుంటే.
3041. వినిపించని రాగాల మధురిమలు..
రెండు మౌనాలు ఒక్కటయినందుకేమో.
3042. అన్వేషిస్తున్నా ప్రేమఋతువుని..
ఆరారు కాలాలు గడిచినా రాలేదేమని
3043. పంచప్రాణాలనూ ఉరకలెత్తిస్తావు..
సప్తపదులకు తడబడే అడుగులకు తాళమేసినట్లు
3044. దీపాల వరుసలో చేరిపోయా..
నీకు దీపావళి నేనవ్వాలనే
3045. చూపుల్లో చేరిపోతానైతే..
నీ ఆశాజ్యోతినై నిత్యకొలువు చేయొచ్చని
3046. అల్లరిగాలినై అల్లుకున్నందుకేమో..
అడుగులేస్తున్న నీలో ఆనందం ఉరకలేస్తూ.
3047. రెల్లుపువ్వునై నవ్వుకుంటున్నా..
పిల్లగాలితో పోల్చి మనసు తేలికచేసినందుకు..
3048. ప్రేమాన్వేషణలో విసిగిపోయా..
అనంతమై ప్రవహిస్తున్న అశ్రువులను ఆపలేకనే..
3049. ప్రవహిస్తున్న పరిమళాలెన్నో నాలో..
నీ తలపులు గంధాలవుతుంటే.
3050. నీ పిలుపునాలకిస్తూ నేను..
అనుస్వరమై బదులివ్వాలని ఎదురుచూస్తూ..
..................................... ********.....................................
No comments:
Post a Comment