..................................... ********.....................................
151. తెలుసుకోలేకపోయా..
నీ తలపులే నాకొస్తున్న ఎక్కిళ్ళని..
152. జ్వలిస్తోంది హృదయం..
నీ అనుగ్రహవీచికలు వీచే తరుణమెన్నడని..
153. శ్వాస తేలికయ్యింది..
మనసు భారం తేలిగ్గా ఆవిరయ్యాక..
154. వెనుకెనుక తిరగడం తప్పట్లేదు..
ఏదీ గుర్తుపెట్టుకోనవసరం లేని మగమహారాజులు కదా మీరు..
155. చివరడుగు అటేగా..ఎన్ని తప్పటడుగులేసినా
లోకపు కొలతలకు అందని లోతుల్లోకి..
156. మధువనమే మనసు..
ఆనందమై నిత్యమూ నీవు కొలువుంటే..
157. విహంగమైంది మది..
నీ భావతరంగాలలో తేలి ఆడినందుకే..
158. విజయమేదైనా సరే..
మృత్యువుని జయించే ప్రత్యామ్నాయమే లేదుగా..
159. వెనుదిరగాల్సిందే విరహం..
నా మాటలు నీ మౌనాన్ని అలంకరించే ముహూర్తంలో..
160. వసంతమే ప్రతీక్షణం..
నిరాశను తోసుకు ఆశని నివేదిస్తుంటే..
161. పలకరింపుల పున్నాగులే..
పరిమళమై మనసు గంధపుగిన్నె నింపేందుకు..
162. మిసిమివయసు బంధమైతేనేమి..
పచ్చని పసిమితో నిత్యం అలలారుతోందిగా..
163. రంగురాళ్ళలో జీవితాన్ని వెతుకుతున్నాడు..
హరివిల్లంటి సంసారంలో మసిపూసేసుకొని..
164. ఆవిష్కారమైంది అద్భుతమప్పుడే..
నేలగర్భంలో దాచుకున్న విత్తుల ఉద్భవానికి..
165. అర్ధంకానిదేగా జీవితం..
చిక్కుముళ్ళయితేనేమి..పొడుపుకధగానైతేనేమి..
166. అనివార్యమేగా యుద్ధం..
మనిషిని ఓడించాలన్నా..మనసుని గెలవాలన్నా..
167. చిత్రమే చెలిమి..
పరిమళించిన పరిచయంతో ఆనందాల అల్లికలు..
168. సమయం వచ్చేదప్పుడే..
దుష్టశిక్షణకు అతివలంతా ఒకేసారి ఏకమయినప్పుడే..
169. రంగురంగుల గూళ్ళు..
జనారణ్యంలో వెలసిన సుందర నిర్మాణాలు..
170. కన్నీటి కోనేట్లో చెంగల్వల పంట..
పచ్చని చెక్కిళ్ళకు అరుణిమలు అద్దుతూ..
171. ఓదార్చుతూనే ఉన్నా మనసుని..
వసంతం తప్పక వస్తుందని..
172. ఏకాకితనం చిగురించింది..
తనలోని అద్భుతాన్ని మనసు తిలకించిందనేమో
173. ఒంటరితనం మరచిపోయా..
ఆత్మబంధువై నువ్వొచ్చాక..
174. ఏకాంతమే ఒంటరయ్యింది..
సాహిత్యంతో నాకు సాన్నిహిత్యం పెరిగాక..
175. నీ ఊహల మహిమే అంతా..
నా ఊసులకు ప్రాణం పోసేస్తూ..
176. పలకరింపుల పరిచయమే అనుకున్నా..
పులకరించాకే తెలిసింది బంధమెప్పటిదోనని..
177. అలుకలను ఎలానూ గెంటేసావు..
నవ్వును కూడా పంపేస్తావా..నిఘంటువులో అర్ధం దొరకలేదని..
178. ఎక్కడెక్కడో వెతికితే లాభమేమి..
చిరునవ్వింది నా పెదవులైతే..
179. నన్ను వెతుక్కోవాల్సొస్తుంది..
నీలో ఎక్కడ దాచావో తెలియక..
180. నాకెప్పుడూ సంజీవనే..
ఎదలో పదిలమైన నీ దివ్యరూపం..
181. పుట్టినప్పుడంతా నవ్వారు..
జీవితమంతా నిన్నేడిపిస్తూనే నవ్వించినట్లు నటిస్తున్నారు..
182. ప్రతీక్షణానికీ ఓ పువ్వు పూయించేస్తా..
వాడిపోయినా వీడని పరిమళాన్ని పంచేసేలా..
183. మాలికలకీ వెలుగొచ్చింది..
మణులకు తోడు తారలు దిగివచ్చాక..
184. ఏకరాగాన్నే..
నీతో కలిసి నవరాగమయ్యాను..
185. నాకు నేను కనపడటమే మానేసాను..
నా అద్దంలోకీ నువ్వే తొంగిచూస్తుంటే..
186. కురులు పరిమళిస్తూనే ఉన్నాయి..
తురిమిన మల్లికలు వాడినా జ్ఞాపకాన్ని గుర్తు చేయాలనే.
187. విరహమే మిగిలింది..
శిధిలమైనా శిశిరమైనా నీతోనేనంటూ చేయిచ్చినందుకు..
188. వెన్నలు పూసిన చూపులనేమో..
మాటలందుకే మత్తుగా జారుకున్నాయెటో.
189. అస్తిత్వం కోల్పోలేదుగా గడ్డిపువ్వు..
నీ పాదాలకింద నలిగినా తనని గుర్తించమని వేడుకుంటూ..
190. ఆకాశవీధిలో విహరిస్తోంది మది..
మధురమైన విషాదానికి తేలుతుందేమో..
191. నమ్మకాన్ని దిగదుడిచేవారెందరో..
అపనమ్మకపు మిరపకాయలు అగ్గిలో మండిస్తూ..
192. ఏకమయ్యాయిగా హృదయాలు..
కలిసి పయనమయ్యే అమృతఘడియల్ని వెతుకుతూ..
193.కలలన్నీ కావ్యంగా కూర్చొద్దన్నానందుకే..
చెలియలకట్టయిన కన్నీటిని ఆపడం నా తరం కాదనే..
194. నవ్వులకొమ్మను ఎన్నడూ వాడనివ్వను నా పెదవులపై..
నిత్యమూ నీ ప్రేమనే పన్నీరు నాకందిస్తే..
195. దేహానికెప్పుడూ సందేహమే..
నీ పలుకుల ఆంతర్యమేమో తెలియక..
196. ఋజువు చేసుకోవాల్సొస్తుందిగా నేడు..
బ్రతికేవున్నాననీ ధృవపత్రం చూపించాలట..
197. ఆనందంలో సుఖమేది..
సందేహంలో దేహమున్నా..
198. నీ కన్నుల జారిపడింది..
నా మనసులోని వెన్నెలేనేమో..
199. భావాల బంధవ్యాలే..
విడదీయలేని అల్లికలు జీవిత సుమాలకి..
200. మోదుగుపూల వసంతమైంది సీతమది..
రామడుగుల ఉనికిని కనిపెట్టినందుకేమో
..................................... ********.....................................
151. తెలుసుకోలేకపోయా..
నీ తలపులే నాకొస్తున్న ఎక్కిళ్ళని..
152. జ్వలిస్తోంది హృదయం..
నీ అనుగ్రహవీచికలు వీచే తరుణమెన్నడని..
153. శ్వాస తేలికయ్యింది..
మనసు భారం తేలిగ్గా ఆవిరయ్యాక..
154. వెనుకెనుక తిరగడం తప్పట్లేదు..
ఏదీ గుర్తుపెట్టుకోనవసరం లేని మగమహారాజులు కదా మీరు..
155. చివరడుగు అటేగా..ఎన్ని తప్పటడుగులేసినా
లోకపు కొలతలకు అందని లోతుల్లోకి..
156. మధువనమే మనసు..
ఆనందమై నిత్యమూ నీవు కొలువుంటే..
157. విహంగమైంది మది..
నీ భావతరంగాలలో తేలి ఆడినందుకే..
158. విజయమేదైనా సరే..
మృత్యువుని జయించే ప్రత్యామ్నాయమే లేదుగా..
159. వెనుదిరగాల్సిందే విరహం..
నా మాటలు నీ మౌనాన్ని అలంకరించే ముహూర్తంలో..
160. వసంతమే ప్రతీక్షణం..
నిరాశను తోసుకు ఆశని నివేదిస్తుంటే..
161. పలకరింపుల పున్నాగులే..
పరిమళమై మనసు గంధపుగిన్నె నింపేందుకు..
162. మిసిమివయసు బంధమైతేనేమి..
పచ్చని పసిమితో నిత్యం అలలారుతోందిగా..
163. రంగురాళ్ళలో జీవితాన్ని వెతుకుతున్నాడు..
హరివిల్లంటి సంసారంలో మసిపూసేసుకొని..
164. ఆవిష్కారమైంది అద్భుతమప్పుడే..
నేలగర్భంలో దాచుకున్న విత్తుల ఉద్భవానికి..
165. అర్ధంకానిదేగా జీవితం..
చిక్కుముళ్ళయితేనేమి..పొడుపుకధగానైతేనేమి..
166. అనివార్యమేగా యుద్ధం..
మనిషిని ఓడించాలన్నా..మనసుని గెలవాలన్నా..
167. చిత్రమే చెలిమి..
పరిమళించిన పరిచయంతో ఆనందాల అల్లికలు..
168. సమయం వచ్చేదప్పుడే..
దుష్టశిక్షణకు అతివలంతా ఒకేసారి ఏకమయినప్పుడే..
169. రంగురంగుల గూళ్ళు..
జనారణ్యంలో వెలసిన సుందర నిర్మాణాలు..
170. కన్నీటి కోనేట్లో చెంగల్వల పంట..
పచ్చని చెక్కిళ్ళకు అరుణిమలు అద్దుతూ..
171. ఓదార్చుతూనే ఉన్నా మనసుని..
వసంతం తప్పక వస్తుందని..
172. ఏకాకితనం చిగురించింది..
తనలోని అద్భుతాన్ని మనసు తిలకించిందనేమో
173. ఒంటరితనం మరచిపోయా..
ఆత్మబంధువై నువ్వొచ్చాక..
174. ఏకాంతమే ఒంటరయ్యింది..
సాహిత్యంతో నాకు సాన్నిహిత్యం పెరిగాక..
175. నీ ఊహల మహిమే అంతా..
నా ఊసులకు ప్రాణం పోసేస్తూ..
176. పలకరింపుల పరిచయమే అనుకున్నా..
పులకరించాకే తెలిసింది బంధమెప్పటిదోనని..
177. అలుకలను ఎలానూ గెంటేసావు..
నవ్వును కూడా పంపేస్తావా..నిఘంటువులో అర్ధం దొరకలేదని..
178. ఎక్కడెక్కడో వెతికితే లాభమేమి..
చిరునవ్వింది నా పెదవులైతే..
179. నన్ను వెతుక్కోవాల్సొస్తుంది..
నీలో ఎక్కడ దాచావో తెలియక..
180. నాకెప్పుడూ సంజీవనే..
ఎదలో పదిలమైన నీ దివ్యరూపం..
181. పుట్టినప్పుడంతా నవ్వారు..
జీవితమంతా నిన్నేడిపిస్తూనే నవ్వించినట్లు నటిస్తున్నారు..
182. ప్రతీక్షణానికీ ఓ పువ్వు పూయించేస్తా..
వాడిపోయినా వీడని పరిమళాన్ని పంచేసేలా..
183. మాలికలకీ వెలుగొచ్చింది..
మణులకు తోడు తారలు దిగివచ్చాక..
184. ఏకరాగాన్నే..
నీతో కలిసి నవరాగమయ్యాను..
185. నాకు నేను కనపడటమే మానేసాను..
నా అద్దంలోకీ నువ్వే తొంగిచూస్తుంటే..
186. కురులు పరిమళిస్తూనే ఉన్నాయి..
తురిమిన మల్లికలు వాడినా జ్ఞాపకాన్ని గుర్తు చేయాలనే.
187. విరహమే మిగిలింది..
శిధిలమైనా శిశిరమైనా నీతోనేనంటూ చేయిచ్చినందుకు..
188. వెన్నలు పూసిన చూపులనేమో..
మాటలందుకే మత్తుగా జారుకున్నాయెటో.
189. అస్తిత్వం కోల్పోలేదుగా గడ్డిపువ్వు..
నీ పాదాలకింద నలిగినా తనని గుర్తించమని వేడుకుంటూ..
190. ఆకాశవీధిలో విహరిస్తోంది మది..
మధురమైన విషాదానికి తేలుతుందేమో..
191. నమ్మకాన్ని దిగదుడిచేవారెందరో..
అపనమ్మకపు మిరపకాయలు అగ్గిలో మండిస్తూ..
192. ఏకమయ్యాయిగా హృదయాలు..
కలిసి పయనమయ్యే అమృతఘడియల్ని వెతుకుతూ..
193.కలలన్నీ కావ్యంగా కూర్చొద్దన్నానందుకే..
చెలియలకట్టయిన కన్నీటిని ఆపడం నా తరం కాదనే..
194. నవ్వులకొమ్మను ఎన్నడూ వాడనివ్వను నా పెదవులపై..
నిత్యమూ నీ ప్రేమనే పన్నీరు నాకందిస్తే..
195. దేహానికెప్పుడూ సందేహమే..
నీ పలుకుల ఆంతర్యమేమో తెలియక..
196. ఋజువు చేసుకోవాల్సొస్తుందిగా నేడు..
బ్రతికేవున్నాననీ ధృవపత్రం చూపించాలట..
197. ఆనందంలో సుఖమేది..
సందేహంలో దేహమున్నా..
198. నీ కన్నుల జారిపడింది..
నా మనసులోని వెన్నెలేనేమో..
199. భావాల బంధవ్యాలే..
విడదీయలేని అల్లికలు జీవిత సుమాలకి..
200. మోదుగుపూల వసంతమైంది సీతమది..
రామడుగుల ఉనికిని కనిపెట్టినందుకేమో
..................................... ********.....................................
No comments:
Post a Comment