..................................... ********.....................................
651. ఉలిక్కిపడుతున్న మనసు..
నీ కొంటెనవ్వుల ఆంతర్యం గ్రహించినందుకే
652. ఉలిక్కిపడుతున్న మనసు..
పీడకలలు మాత్రమే నిజమై ఎదురవుతున్నాయని
653. ఉలిక్కిపడుతున్న మనసు..
నా ఊహాసౌధానికీ భూకంపం తప్పలేదని
654. ఉలిక్కిపడు
తున్న మనసు..
ప్రతి పరకాయలోనూ కనిపించి నువ్వల్లరిపెడుతుంటే..!
655. మంచులో తడిచినందుకేమో..
మేలిమి ముత్యమై ప్రకాశిస్తోంది మనసు..
656. అమరం చేద్దామనే ప్రేమకావ్యం..
నాయకుడ్ని చేసి నీకంకితమిద్దామని..
657. వసంతంలో కొంటెపిల్లనే..
గండుకోయిలవై పంచమంలో నువ్వు పలకరిస్తే..
658. వెన్నెలగా మారిపోయాను..
వేసవిలో ఒక్కరోజైనా నిన్ను అలరిద్దామనే..
659. కీర్తికే దాసోహమంతా..
తనని నలుగురికీ అప్రయత్నంగానే పరిచయిస్తుందని..
660. వసంతానికి అలకొచ్చిందట..
తానుండగానే వరుణుడు నాతో మేళమాడుతున్నాడని
661. కోరికనై చేరానందుకే..
మక్కువగా ఆరాధించినందుకే..
662. ఒంటరి వెన్నెలెప్పుడూ తెల్లనేలే..
రంగం లేనప్పుడు రంగులేలనని..
663. స్మరణీయుడివేగా నీవు..
గీతాంజలిని అందించి భావుకత్వపు బావుటాని విశ్వమంతా ఎగరేసినందుకు..
664. కన్నీటివ్యథలేమో అవి..
చీకటికే అంకితమని..
665. నీ ఊసులకదేం పిచ్చో..
నీరవంలోనూ వినబడుతూ ఉంటాయట..
666. నా మనసు తడుస్తూనే ఉంది..
నీ కనులకు అనుసంధానం చేసావనేమో..
667. ఒంటరితనమంటే నీవేగా..
నన్నెప్పుడూ ఏకాకిని కానీయక తోడవుతూ..
668. నా ప్రాణం లేచొచ్చింది..
నువ్వొచ్చి ఊపిరి పోసినందుకే..
669. పులకరించే కలకోయిలనే..
ఆమనిరాగాన్ని నీకై అనుకరించే ప్రియవేళలో..
670. కరిగింది రాతిరి మౌనంగా..
వెన్నెలవానలోనే తడుస్తూ ముగ్ధంగా..
671. ఋతువులరాణి కోయిలనాహ్వానిస్తోంది..
నా గానానికి తాను రాగమందిస్తుందనే..
672. చెరిపేసా మరకలన్నీ..
స్వచ్ఛంగా మారాలనే నీ రాతల్లో..
673. నీరవాన్ని జయిస్తున్నా...
మౌనంలో నన్ను నేను కనుగొనాలనే..
674. నీ ఆనందం నా సొంతమేగా..
నన్ను కాగితం చేసి రాసావని..
675. అంకితం ఇవ్వడం మరువకు..
నన్నాస్వాదిస్తూ రాస్తున్న మధుకావ్యమేగా..
676. చకోరమయ్య నీ పిలుపులకై..
తియ్యదనాల పలుకులు వినాలనే
677. పగటికి సూర్యుడివి..రాతిరికి రేరాజువి..
నా ప్రకృతికి వసంతుడివే నీవుగా
678. తలపులతో అర్చనలెందుకో..
ఎదురైతే నిట్టూర్పుల నీరాజనాలతో నిలబడుతూ
679. ఇంకా శూన్యమెక్కడుంది..
ఆకాశరంగం చుక్కలతో అలరించేందుకు సిద్దమయ్యాక
680. చిలిపి చినుకుకీ ఆరాటమే..
నేనే నేలవ్వాలనే కోరికలో.
681. కనురెప్పల కౌగిలింతలే..
ఇరువురిని బంధించాలనే తన వెలుతురులో..
682. ఆశలహరివిల్లు విరిసింది ఆకాశంలో..
రంగులెందుకో సరిగా కనపడక..
683. బలహీనమవుతున్న బంధాలు..
ఆరాలూ హారాలే తప్ప మనసుకు గుప్పెడు విలువివ్వక
684. కన్నీళ్ళు ఉబుకుతున్నాయి..
మనసును అనుమానమనే కవ్వంతో మధిస్తున్నారనే..
685. మసకల్లో నీ మనసున మోహనరాగం..
వేకువకది నునుసిగ్గుల నా చెక్కిళ్ళరాగమేగా..
686. హరివిల్లే నా మనసు..
నిన్నంటాక ఏకవర్ణంగా మారిందేమో..
687. వేకువ నవ్వుతోంది..
నా నిజమై నువ్వు చేరావనే..
689. ఎన్నాళ్ళ విరహమో..
నిన్ను నాలోనే రహస్యంగా దాచుకొని
690. నా పూజని పూర్తిచేసా
నాది ఆరాధనని అర్థమయ్యాక..
691. అహమెందుకో అనుబంధాలకి..
ఆత్మీయంగా అల్లుకొనే మనసులకి అడ్డుపడుతూ..
692. విరహతాపం అతిశయించింది..
సుప్రభాతాన తొలకరి మేఘదర్శనానికి కరిగినందుకే..
693. నేనేగా వసంతాన్ని..
నువ్విష్టంగా విహరించే నీ సౌందర్యసీమని
694. నేనెప్పుడూ నేనే..
బహుముఖాలకు బహువిధాలుగా..
695. ఆలింగనానికెందుకో తొందర..
పిల్లతెమ్మెరై అల్లుకోలేదనా..
696. వసంతరాత్రులన్నీ తీయనికలలే..
విరహమైన నీవొచ్చి ప్రేమను పంచావనే..
697. అనంతమే నీ అనుగ్రహం..
నలువైపుల నుండీ నన్నల్లేస్తూ.
698. పువ్వులకెన్ని నాట్యాలో..
పూసంత నీ నవ్వులను తిలకించిందుకేమో..
699. సహజమేగా నా కేరింతలు..
సీతాకోకను నీలో చూసాననే..
700. నువ్వో పున్నమి..
నీ సద్విమర్శే నా వ్యక్తిత్వం..
..................................... ********.....................................
651. ఉలిక్కిపడుతున్న మనసు..
నీ కొంటెనవ్వుల ఆంతర్యం గ్రహించినందుకే
652. ఉలిక్కిపడుతున్న మనసు..
పీడకలలు మాత్రమే నిజమై ఎదురవుతున్నాయని
653. ఉలిక్కిపడుతున్న మనసు..
నా ఊహాసౌధానికీ భూకంపం తప్పలేదని
654. ఉలిక్కిపడు
తున్న మనసు..
ప్రతి పరకాయలోనూ కనిపించి నువ్వల్లరిపెడుతుంటే..!
655. మంచులో తడిచినందుకేమో..
మేలిమి ముత్యమై ప్రకాశిస్తోంది మనసు..
656. అమరం చేద్దామనే ప్రేమకావ్యం..
నాయకుడ్ని చేసి నీకంకితమిద్దామని..
657. వసంతంలో కొంటెపిల్లనే..
గండుకోయిలవై పంచమంలో నువ్వు పలకరిస్తే..
658. వెన్నెలగా మారిపోయాను..
వేసవిలో ఒక్కరోజైనా నిన్ను అలరిద్దామనే..
659. కీర్తికే దాసోహమంతా..
తనని నలుగురికీ అప్రయత్నంగానే పరిచయిస్తుందని..
660. వసంతానికి అలకొచ్చిందట..
తానుండగానే వరుణుడు నాతో మేళమాడుతున్నాడని
661. కోరికనై చేరానందుకే..
మక్కువగా ఆరాధించినందుకే..
662. ఒంటరి వెన్నెలెప్పుడూ తెల్లనేలే..
రంగం లేనప్పుడు రంగులేలనని..
663. స్మరణీయుడివేగా నీవు..
గీతాంజలిని అందించి భావుకత్వపు బావుటాని విశ్వమంతా ఎగరేసినందుకు..
664. కన్నీటివ్యథలేమో అవి..
చీకటికే అంకితమని..
665. నీ ఊసులకదేం పిచ్చో..
నీరవంలోనూ వినబడుతూ ఉంటాయట..
666. నా మనసు తడుస్తూనే ఉంది..
నీ కనులకు అనుసంధానం చేసావనేమో..
667. ఒంటరితనమంటే నీవేగా..
నన్నెప్పుడూ ఏకాకిని కానీయక తోడవుతూ..
668. నా ప్రాణం లేచొచ్చింది..
నువ్వొచ్చి ఊపిరి పోసినందుకే..
669. పులకరించే కలకోయిలనే..
ఆమనిరాగాన్ని నీకై అనుకరించే ప్రియవేళలో..
670. కరిగింది రాతిరి మౌనంగా..
వెన్నెలవానలోనే తడుస్తూ ముగ్ధంగా..
671. ఋతువులరాణి కోయిలనాహ్వానిస్తోంది..
నా గానానికి తాను రాగమందిస్తుందనే..
672. చెరిపేసా మరకలన్నీ..
స్వచ్ఛంగా మారాలనే నీ రాతల్లో..
673. నీరవాన్ని జయిస్తున్నా...
మౌనంలో నన్ను నేను కనుగొనాలనే..
674. నీ ఆనందం నా సొంతమేగా..
నన్ను కాగితం చేసి రాసావని..
675. అంకితం ఇవ్వడం మరువకు..
నన్నాస్వాదిస్తూ రాస్తున్న మధుకావ్యమేగా..
676. చకోరమయ్య నీ పిలుపులకై..
తియ్యదనాల పలుకులు వినాలనే
677. పగటికి సూర్యుడివి..రాతిరికి రేరాజువి..
నా ప్రకృతికి వసంతుడివే నీవుగా
678. తలపులతో అర్చనలెందుకో..
ఎదురైతే నిట్టూర్పుల నీరాజనాలతో నిలబడుతూ
679. ఇంకా శూన్యమెక్కడుంది..
ఆకాశరంగం చుక్కలతో అలరించేందుకు సిద్దమయ్యాక
680. చిలిపి చినుకుకీ ఆరాటమే..
నేనే నేలవ్వాలనే కోరికలో.
681. కనురెప్పల కౌగిలింతలే..
ఇరువురిని బంధించాలనే తన వెలుతురులో..
682. ఆశలహరివిల్లు విరిసింది ఆకాశంలో..
రంగులెందుకో సరిగా కనపడక..
683. బలహీనమవుతున్న బంధాలు..
ఆరాలూ హారాలే తప్ప మనసుకు గుప్పెడు విలువివ్వక
684. కన్నీళ్ళు ఉబుకుతున్నాయి..
మనసును అనుమానమనే కవ్వంతో మధిస్తున్నారనే..
685. మసకల్లో నీ మనసున మోహనరాగం..
వేకువకది నునుసిగ్గుల నా చెక్కిళ్ళరాగమేగా..
686. హరివిల్లే నా మనసు..
నిన్నంటాక ఏకవర్ణంగా మారిందేమో..
687. వేకువ నవ్వుతోంది..
నా నిజమై నువ్వు చేరావనే..
689. ఎన్నాళ్ళ విరహమో..
నిన్ను నాలోనే రహస్యంగా దాచుకొని
690. నా పూజని పూర్తిచేసా
నాది ఆరాధనని అర్థమయ్యాక..
691. అహమెందుకో అనుబంధాలకి..
ఆత్మీయంగా అల్లుకొనే మనసులకి అడ్డుపడుతూ..
692. విరహతాపం అతిశయించింది..
సుప్రభాతాన తొలకరి మేఘదర్శనానికి కరిగినందుకే..
693. నేనేగా వసంతాన్ని..
నువ్విష్టంగా విహరించే నీ సౌందర్యసీమని
694. నేనెప్పుడూ నేనే..
బహుముఖాలకు బహువిధాలుగా..
695. ఆలింగనానికెందుకో తొందర..
పిల్లతెమ్మెరై అల్లుకోలేదనా..
696. వసంతరాత్రులన్నీ తీయనికలలే..
విరహమైన నీవొచ్చి ప్రేమను పంచావనే..
697. అనంతమే నీ అనుగ్రహం..
నలువైపుల నుండీ నన్నల్లేస్తూ.
698. పువ్వులకెన్ని నాట్యాలో..
పూసంత నీ నవ్వులను తిలకించిందుకేమో..
699. సహజమేగా నా కేరింతలు..
సీతాకోకను నీలో చూసాననే..
700. నువ్వో పున్నమి..
నీ సద్విమర్శే నా వ్యక్తిత్వం..
..................................... ********.....................................
No comments:
Post a Comment