..................................... ********.....................................
2251. భగ్నప్రేమికుడి మనసుని గెలిపించాడుగా వరుణుడు..
మేఘాన్ని కదిలించి వలపుజల్లు కురిపించి..
2252. తపనతో కవ్వించినప్పుడే అనుకున్నా..
విడిచిపెట్టిపోయే ఉద్దేశ్యమే లేదని..
2253. ఉదయపు వెన్నెల్లోనూ చూస్తున్నా..
రాలిపడే తారేదైనా ఉంటుందేమోనని..
2254. అద్దంలోని ఇంద్రజాలమదే..
నిన్ను నిన్నుగానే నిజాయితీగా చూపిస్తూ..
2255. మోహంతో మనసును ముంచెత్తకలా..
సిగ్గులు సరిహద్దులు చెరిపేసేలా..
2256. నీ చూపులకే చెదిరింది మనసు..
దయని వర్షించే కన్నులు నీకున్నవని..
2257. నా చెక్కిలిపై చుక్క మెరుస్తోంది..
నీ కన్నుల్లోని ఆనందం ఒలికిందనే..
2258. అడ్డదారైతే ఏంటనుకున్నా..
గమ్యం చేరడమే ముఖ్యమని భావించి..
2259. కోరచూపులను తట్టుకోలేకున్నా..
చూపుతోనే రేబవలు నన్ను గిచ్చుతున్నందుకే..
2260. పన్నీరవుతున్న మనసు..
నీ పిలుపుకు ప్రవహించిన ప్రతిసారీ..
2261. నేనైతే ఆస్వాదిస్తున్నా..
నిన్ను కవ్వించీ ఏడిపించే నా మనసును చూసుకుంటూ
2262. వాడిపోయిన పువ్వూ పరిమళిస్తుంది..
దానికున్న అస్తిత్వాన్ని గమనించగలిగితే..
2263. సుకుమారుడివని తెలుసుకున్నాలే..
తలపుల సంకెళ్ళకీ ఉక్కిరిబిక్కిరయ్యే మగధీరవని..
2264. విసిరే చూపు వలలు వేస్తున్నది..
కొసరే నవ్వు అలలై చేరుతున్నది..
2265. మౌనముద్రను విడిచేసా..
నీ మాటలకు తుళ్ళిపడే మనసు కోరికను మన్నించినందుకే..
2266. మేరువన్నుకున్నా నా కోపం..
నీ చిరుపలకరింపుకే కరిగేంతవరకూ..
2267. మనోఫలకంపై ముద్రించుకున్నా..
నీ పెదవులు రాసిన ప్రేమలేఖలు..
2268. రక్తిముక్తావళి వల్లించడం మానేసా మేలుకోరి..
ఇరుసంధ్యలూ ఏకమై నిన్నిరుకున పెడుతున్నాయనే..
2269. చినుకు చేసిన చిత్తరమనుకుంటా..
హాస్యంలో రసికతను మేళవించమంటూ..
2270. స్వచ్ఛమైన చెలిమికి చిరునామా నువ్వేగా..
నవ్వులకిరణాలతో ప్రతివారినీ ఆత్మీయంగా పలకరిస్తూ..
2271. వెతలన్నీ మనసుకే..
కలలో నిన్ను రప్పించాలంటే కష్టపడి కునుకును ఆహ్వానించడం..
2272. మాలికను చూసి ఆగిందేమో అక్షరం..
ఏ అక్షరశిల్పి చేతిలోనైనా ప్రాణమోసుకోవాలని..
2273. ఊహలనుంచీ గెంటేయకు..
నీ ఊపిరినే పట్టుకు వేళ్ళాడుతున్నానని..
2274. నన్ను నేను కోల్పోయానన్న బాధలేదు..
నీ మనసులో భద్రమని తెలిసిపోయాక..
2275. పెనవేసుకున్న అనుబంధమెప్పటికీ శాశ్వతమేగా..
బంధం ఊపిరాగి చెదిరిపోయినా..
2276. సన్నజాజిరేకుదొప్పనీ వదలవెందుకో..
కన్నీటితో నింపి ప్రాణం పోసాననుకుంటూ..
2277. మరపురాని అనుభూతులుకొన్ని..
అక్షరమాల ఆసరాతో మాలికలుగా విరబూస్తూ..
2278. పగలే వెన్నెలవుతుంది..
వెలకట్టలేని నీ అనురాగపు వెలుతురుకి..
2279. అవ్యాజమై పొంగిపొరలుతోంది..
మనసులో దాగిన నా ప్రేమ కన్నులతోనైనా నిన్నభిషేకించాలంటూ..
2280. ఆవేశమెక్కువే నీకు..
అతిగా ఆశిస్తూ మాటలతో మురిపించేస్తూ..
2281. మాలికల మహాత్మ్యమదే..
తొలికోడికన్నా ముందే వేకువను ఆహ్వానించేస్తూ..
2282. వెన్నెల్లోనూ విరహమే...
ఊహకే పరిమితమైన ప్రేమను అనుభవించలేక..
2283. అనుభవైకవేద్యమే..
ఊహల్లోనూ నన్ను గెలిచే నీ తలపులు..
2284. చినుకుపూలు పరుచుకున్నాయి నేలంతా..
వానాకాలం విశ్రాంతినాపి కొలువుకొచ్చిందనేమో..
2285. మేఘాల్లా కదలాడుతున్నవి భావాలు..
నువ్వు కనిపించగానే కురవాలనే..
2286. ఎన్ని జలపాతాలైనా సాటిరావు..
ఉరకలేసే నీ ఉత్సాహానికి..
2287. వలపును కూస్తున్నవి..
వసంతం నిత్యమని భ్రమించిన మనోకోయిలలు..
2288. తొలివలపు చిగురింతలు మరి..
చెలిబుగ్గలపై చెరగని చెమరింతలుగా..
2289. మౌన రసాస్వాదనం..
చెక్కెరమోవి తీపిని మనసుకు పంచేస్తూ..
2290. అవడానికి మనిషే..
అప్పుడప్పుడూ ముసుగేసుకుంటూ..
2291. కన్నీటివాన వెలిసింది..
సంతోషతీరం చేరగానే..
2292. భాష్పమందుకే విలువైంది..
మనసు కరిగితే తప్ప ప్రవహించలేదనే..
2293. వానకోయిలతో కబురెట్టానందుకే..
నీ మనసులో కురుస్తాననే మాటిచ్చి..
2294.ఆకాశమంతా పుప్పొడివర్ణాలు..
నేనాలపించిన 'మేఘరంజని'కి వివశమై కాబోలు
2295. అన్వేషణ సాగిస్తున్నా..
మనసు దాహం తీర్చగలిగే మంత్రమున్నదేమోనని
2296. అన్వేషణ సాగిస్తున్నా..
నాతో నేను ఏకాంతంగా గడిపే క్షణాలకు అత్యాశపడుతూ
2297. తరంగమైంది ఆనందం..
చిరునామ తెలియని చెలిమి సొంతమయ్యిందని
2298. విస్మయమవుతున్నా..
ఏ రోజుకారోజు నువ్విలా విడ్డూరాలాడుతుంటే..
2299. నా తలపెంత తీయనిదో..
నీ నరనరాల్లో ప్రవహించే రుధిర జలపాతాన్నడుగు చెప్తుంది..
2300. కష్టాలూ ఇష్టాలవుతాయేమో..
భారాలన్నీ తేలికయిపోయి..
..................................... ********.....................................
2251. భగ్నప్రేమికుడి మనసుని గెలిపించాడుగా వరుణుడు..
మేఘాన్ని కదిలించి వలపుజల్లు కురిపించి..
2252. తపనతో కవ్వించినప్పుడే అనుకున్నా..
విడిచిపెట్టిపోయే ఉద్దేశ్యమే లేదని..
2253. ఉదయపు వెన్నెల్లోనూ చూస్తున్నా..
రాలిపడే తారేదైనా ఉంటుందేమోనని..
2254. అద్దంలోని ఇంద్రజాలమదే..
నిన్ను నిన్నుగానే నిజాయితీగా చూపిస్తూ..
2255. మోహంతో మనసును ముంచెత్తకలా..
సిగ్గులు సరిహద్దులు చెరిపేసేలా..
2256. నీ చూపులకే చెదిరింది మనసు..
దయని వర్షించే కన్నులు నీకున్నవని..
2257. నా చెక్కిలిపై చుక్క మెరుస్తోంది..
నీ కన్నుల్లోని ఆనందం ఒలికిందనే..
2258. అడ్డదారైతే ఏంటనుకున్నా..
గమ్యం చేరడమే ముఖ్యమని భావించి..
2259. కోరచూపులను తట్టుకోలేకున్నా..
చూపుతోనే రేబవలు నన్ను గిచ్చుతున్నందుకే..
2260. పన్నీరవుతున్న మనసు..
నీ పిలుపుకు ప్రవహించిన ప్రతిసారీ..
2261. నేనైతే ఆస్వాదిస్తున్నా..
నిన్ను కవ్వించీ ఏడిపించే నా మనసును చూసుకుంటూ
2262. వాడిపోయిన పువ్వూ పరిమళిస్తుంది..
దానికున్న అస్తిత్వాన్ని గమనించగలిగితే..
2263. సుకుమారుడివని తెలుసుకున్నాలే..
తలపుల సంకెళ్ళకీ ఉక్కిరిబిక్కిరయ్యే మగధీరవని..
2264. విసిరే చూపు వలలు వేస్తున్నది..
కొసరే నవ్వు అలలై చేరుతున్నది..
2265. మౌనముద్రను విడిచేసా..
నీ మాటలకు తుళ్ళిపడే మనసు కోరికను మన్నించినందుకే..
2266. మేరువన్నుకున్నా నా కోపం..
నీ చిరుపలకరింపుకే కరిగేంతవరకూ..
2267. మనోఫలకంపై ముద్రించుకున్నా..
నీ పెదవులు రాసిన ప్రేమలేఖలు..
2268. రక్తిముక్తావళి వల్లించడం మానేసా మేలుకోరి..
ఇరుసంధ్యలూ ఏకమై నిన్నిరుకున పెడుతున్నాయనే..
2269. చినుకు చేసిన చిత్తరమనుకుంటా..
హాస్యంలో రసికతను మేళవించమంటూ..
2270. స్వచ్ఛమైన చెలిమికి చిరునామా నువ్వేగా..
నవ్వులకిరణాలతో ప్రతివారినీ ఆత్మీయంగా పలకరిస్తూ..
2271. వెతలన్నీ మనసుకే..
కలలో నిన్ను రప్పించాలంటే కష్టపడి కునుకును ఆహ్వానించడం..
2272. మాలికను చూసి ఆగిందేమో అక్షరం..
ఏ అక్షరశిల్పి చేతిలోనైనా ప్రాణమోసుకోవాలని..
2273. ఊహలనుంచీ గెంటేయకు..
నీ ఊపిరినే పట్టుకు వేళ్ళాడుతున్నానని..
2274. నన్ను నేను కోల్పోయానన్న బాధలేదు..
నీ మనసులో భద్రమని తెలిసిపోయాక..
2275. పెనవేసుకున్న అనుబంధమెప్పటికీ శాశ్వతమేగా..
బంధం ఊపిరాగి చెదిరిపోయినా..
2276. సన్నజాజిరేకుదొప్పనీ వదలవెందుకో..
కన్నీటితో నింపి ప్రాణం పోసాననుకుంటూ..
2277. మరపురాని అనుభూతులుకొన్ని..
అక్షరమాల ఆసరాతో మాలికలుగా విరబూస్తూ..
2278. పగలే వెన్నెలవుతుంది..
వెలకట్టలేని నీ అనురాగపు వెలుతురుకి..
2279. అవ్యాజమై పొంగిపొరలుతోంది..
మనసులో దాగిన నా ప్రేమ కన్నులతోనైనా నిన్నభిషేకించాలంటూ..
2280. ఆవేశమెక్కువే నీకు..
అతిగా ఆశిస్తూ మాటలతో మురిపించేస్తూ..
2281. మాలికల మహాత్మ్యమదే..
తొలికోడికన్నా ముందే వేకువను ఆహ్వానించేస్తూ..
2282. వెన్నెల్లోనూ విరహమే...
ఊహకే పరిమితమైన ప్రేమను అనుభవించలేక..
2283. అనుభవైకవేద్యమే..
ఊహల్లోనూ నన్ను గెలిచే నీ తలపులు..
2284. చినుకుపూలు పరుచుకున్నాయి నేలంతా..
వానాకాలం విశ్రాంతినాపి కొలువుకొచ్చిందనేమో..
2285. మేఘాల్లా కదలాడుతున్నవి భావాలు..
నువ్వు కనిపించగానే కురవాలనే..
2286. ఎన్ని జలపాతాలైనా సాటిరావు..
ఉరకలేసే నీ ఉత్సాహానికి..
2287. వలపును కూస్తున్నవి..
వసంతం నిత్యమని భ్రమించిన మనోకోయిలలు..
2288. తొలివలపు చిగురింతలు మరి..
చెలిబుగ్గలపై చెరగని చెమరింతలుగా..
2289. మౌన రసాస్వాదనం..
చెక్కెరమోవి తీపిని మనసుకు పంచేస్తూ..
2290. అవడానికి మనిషే..
అప్పుడప్పుడూ ముసుగేసుకుంటూ..
2291. కన్నీటివాన వెలిసింది..
సంతోషతీరం చేరగానే..
2292. భాష్పమందుకే విలువైంది..
మనసు కరిగితే తప్ప ప్రవహించలేదనే..
2293. వానకోయిలతో కబురెట్టానందుకే..
నీ మనసులో కురుస్తాననే మాటిచ్చి..
2294.ఆకాశమంతా పుప్పొడివర్ణాలు..
నేనాలపించిన 'మేఘరంజని'కి వివశమై కాబోలు
2295. అన్వేషణ సాగిస్తున్నా..
మనసు దాహం తీర్చగలిగే మంత్రమున్నదేమోనని
2296. అన్వేషణ సాగిస్తున్నా..
నాతో నేను ఏకాంతంగా గడిపే క్షణాలకు అత్యాశపడుతూ
2297. తరంగమైంది ఆనందం..
చిరునామ తెలియని చెలిమి సొంతమయ్యిందని
2298. విస్మయమవుతున్నా..
ఏ రోజుకారోజు నువ్విలా విడ్డూరాలాడుతుంటే..
2299. నా తలపెంత తీయనిదో..
నీ నరనరాల్లో ప్రవహించే రుధిర జలపాతాన్నడుగు చెప్తుంది..
2300. కష్టాలూ ఇష్టాలవుతాయేమో..
భారాలన్నీ తేలికయిపోయి..
..................................... ********.....................................
No comments:
Post a Comment