..................................... ********.....................................
351. ఎన్నిమౌనాలు కరిగాయో..
నీ ఊసుల సంగీతానికి మైమరచి..
352. స్వప్నమూ సుదూరమయ్యింది..
నీ విరహంలో నిదుర మరచిన నా మనసుకు..
353. మనోహరుడు తలపుకొస్తే చాలదా..
ఎడదంతా మధూవనముగా మారదా..
354. నిదురలేక ఛస్తున్నా..
రేయనకా పగలనకా నీ పూజల ధూపానికి మసకేసి..
355. శిశిరంలో తిరిగొచ్చిందేమో విరహించింది కోయిల..
ఏ వియోగరాత్రి పరిమళం అంటించుకొచ్చిందో..
356. నీ మనసు నా మనసుతో ఏకమయ్యింది..
ఏ చరిత్రను తిరిగి రాయాలని తలచిందో..
357. మరోచరిత్ర అవుతుందేమో..
నువ్వక్కడున్నా నేనిక్కడున్నా మనసులు ఏకమవుతుంటే..
358. చరితను చెక్కితేనేమి..
అక్షరశిల్పివైతే అయ్యావుగా..నన్ను మెప్పించేందుకు..
359. చిన్మయమయ్యింది రూపం..
చిదిమి నువ్వలా అపురూపం చేస్తున్నందుకే..
360. కరిగిస్తున్నావెందుకలా రూపాన్ని..
పరీక్షిస్తున్నావా పసిడో..పచ్చనో నేనని..
361. నా మనసేనాడో గాల్లో తేలింది..
నీ మనసు నాదని తేలికయ్యింది..
362. మారాకు వేస్తోంది ఆనందం..
కోయిలే అభిసారికకి కబురంపిందనే..
363. మారాకు వేస్తోంది మదిలో ఆనందం..
కిన్నెరవీణ తానై వసంతరాగం ఆలపిస్తుంటే..
364. అభయమెవరికుందని..
చట్టాన్ని చుట్టంగా చేసుకు తిరిగేవారని..
365. గాలిపటమూ ఎగరలేదని తెలుసుకున్నా..
తేలికైన మనసంత ఎత్తుకని
366. ఆకాశం సరిపోనంది నీకు..
దిగంతాల శూన్యంలోకి పయనమనేమో.. .
367. కన్నీటిప్రవాహం నాది..
వేదనదుల సంగమానికి..
368. ప్రేమయుద్దం కదా..
అందుకే ఎదురు పడలేక సిగ్గుతో ఊహల పోరాటం..
369. కోరికలన్నీ కలతలుగా మారాయి..
నువ్వెక్కడ నిలువరిస్తావోననే కాబోలు..
370. నీతో ఉండే నిజమెప్పుడూ తేలికే..
ఊరూరా తిరిగే అబద్దానికి అలుపెక్కువే..
371. చూపించావుగా త్రిశంకుస్వర్గాన్నీ..
నీ తొలివలపు శీర్షాసనం నాతో వేయించి మరీ..
372. క్షణాలకీ కంగారవుతోంది..
నన్ను దాటి నిన్ను చేరాలనే ఆశ కాబోలు..
373. కవ్వించడమెందుకో కోమలిని..
కోయిల పలుకును మాత్రమే చూసి ముచ్చటపడ్డాననే మాటదాచేసి..
374. ఎన్ని పులకలు చేరాయో..
నీ తలపులు అంకురించి..
375. కొత్తకథను రాస్తున్నా..
వలపుల వ్యథను ముగించే తొందరలోనే..
376. కొత్తపూలు చల్లా వాకిట్లో..
ఏ క్షణమైనా నువ్వొస్తావనే
377. కోకచుట్టి అలంకరించు అక్షరానికి..
అలకందుకోకుంటే అప్పుడొచ్చి చెప్పు..
378. స్మృతులెన్ని జారాయో..
నేత్రాంచలాల నీరు తనతో తోడుకుపోతుంటే..
379. ఆనందాన్నే ఊపిరి చేసుకో..
నిత్యసంజీవనై నిన్ను రక్షించేందుకు..
380. బ్రతుకులెక్క తేలేదెన్నడులే..
జననమరణాల చక్రం ఆగకుండా తిరుగాడుతుంటే..
381. అక్షరాలకీ గాయమయ్యింది..
నీ వలపుగేయానికి తాను సరిపోదన్నావనేమో..
382. పక్షవాతం తప్పదు కొన్నిటికి..
పరిమితవాలందుకే కేవలం రసాస్వాదనకి
383. అపజయం వెనుదిరగాల్సిందే..
నీ ప్రయత్నలోపం లేకుండా తననధిగమిస్తే
384. మూగదేగా పెదవి..
నీ మాటలతో నోరు నొక్కేస్తుంటే..
385. తీయగానే ఉన్నాయి చూపులు..
ఏ ముంత ఖజూరపు తేనెలోంచీ తొంగి చూసావో..
386. ఎన్ని కథలు రాయాలో..
నీ కలలను అక్షరబద్దం చేసి పదిలం చేయాలంటే..
387. ఆశెక్కువే..
గోరంత నవ్వులకి ఆకాశం పరిచావంటే..
388. అరకొర నవ్వులైతేనేంటి..
దోసిలితో పాటూ మనసూ నింపానుగా..
389.అడవి కాచిన పరిమళాన్నేగా..
ఒంటరని కూడా చూడక వెన్నెలలా నాపై కురుస్తుంటే..
390. మనసూ కరిగి జారింది..
వెన్నలకి తెలియకుండా వివశమైనందుకేమో..
391. పద్మరాగం నేర్పాను నా మనసుకి..
పద్మమంటి నీ మోము వికసించాలనే..
392. కలనైనా దక్కించానని తెలుసుకోవేం..
కలవరమొచ్చే కబుర్లతో బాధపెడ్తూ..
393. నీ మనసు నా జతయ్యిందిగా..
నీకు నువ్వు దొరకడం కష్టమే..
394. ఎదుగుతున్నావేమో..
విమర్శా సమీక్షల్లో ముందున్నావంటే..
395. నా ఊపిరాపేసారు..
నా పరిమళం నిన్ను తాకలేదేమోనని
396.వసంత వియోగమే మదికి..
చైత్రకోయిల సాంత్వనకై ఎదురుచూస్తూ
397. అబద్దానికి రంగులెక్కువ..
నిజాయితీకి వేద్దామన్నా తీసుకోని స్వచ్ఛత
398. ఆమనిరాగాన్నే..
ఉషోదయానికే ఆనందం పరిచయిస్తూ..
399. పువ్వుల చినుకులు..
నిన్ను తలచినందుకే
400. నీ ఉదయం..
నా పరిచయమేగా
..................................... ********.....................................
351. ఎన్నిమౌనాలు కరిగాయో..
నీ ఊసుల సంగీతానికి మైమరచి..
352. స్వప్నమూ సుదూరమయ్యింది..
నీ విరహంలో నిదుర మరచిన నా మనసుకు..
353. మనోహరుడు తలపుకొస్తే చాలదా..
ఎడదంతా మధూవనముగా మారదా..
354. నిదురలేక ఛస్తున్నా..
రేయనకా పగలనకా నీ పూజల ధూపానికి మసకేసి..
355. శిశిరంలో తిరిగొచ్చిందేమో విరహించింది కోయిల..
ఏ వియోగరాత్రి పరిమళం అంటించుకొచ్చిందో..
356. నీ మనసు నా మనసుతో ఏకమయ్యింది..
ఏ చరిత్రను తిరిగి రాయాలని తలచిందో..
357. మరోచరిత్ర అవుతుందేమో..
నువ్వక్కడున్నా నేనిక్కడున్నా మనసులు ఏకమవుతుంటే..
358. చరితను చెక్కితేనేమి..
అక్షరశిల్పివైతే అయ్యావుగా..నన్ను మెప్పించేందుకు..
359. చిన్మయమయ్యింది రూపం..
చిదిమి నువ్వలా అపురూపం చేస్తున్నందుకే..
360. కరిగిస్తున్నావెందుకలా రూపాన్ని..
పరీక్షిస్తున్నావా పసిడో..పచ్చనో నేనని..
361. నా మనసేనాడో గాల్లో తేలింది..
నీ మనసు నాదని తేలికయ్యింది..
362. మారాకు వేస్తోంది ఆనందం..
కోయిలే అభిసారికకి కబురంపిందనే..
363. మారాకు వేస్తోంది మదిలో ఆనందం..
కిన్నెరవీణ తానై వసంతరాగం ఆలపిస్తుంటే..
364. అభయమెవరికుందని..
చట్టాన్ని చుట్టంగా చేసుకు తిరిగేవారని..
365. గాలిపటమూ ఎగరలేదని తెలుసుకున్నా..
తేలికైన మనసంత ఎత్తుకని
366. ఆకాశం సరిపోనంది నీకు..
దిగంతాల శూన్యంలోకి పయనమనేమో.. .
367. కన్నీటిప్రవాహం నాది..
వేదనదుల సంగమానికి..
368. ప్రేమయుద్దం కదా..
అందుకే ఎదురు పడలేక సిగ్గుతో ఊహల పోరాటం..
369. కోరికలన్నీ కలతలుగా మారాయి..
నువ్వెక్కడ నిలువరిస్తావోననే కాబోలు..
370. నీతో ఉండే నిజమెప్పుడూ తేలికే..
ఊరూరా తిరిగే అబద్దానికి అలుపెక్కువే..
371. చూపించావుగా త్రిశంకుస్వర్గాన్నీ..
నీ తొలివలపు శీర్షాసనం నాతో వేయించి మరీ..
372. క్షణాలకీ కంగారవుతోంది..
నన్ను దాటి నిన్ను చేరాలనే ఆశ కాబోలు..
373. కవ్వించడమెందుకో కోమలిని..
కోయిల పలుకును మాత్రమే చూసి ముచ్చటపడ్డాననే మాటదాచేసి..
374. ఎన్ని పులకలు చేరాయో..
నీ తలపులు అంకురించి..
375. కొత్తకథను రాస్తున్నా..
వలపుల వ్యథను ముగించే తొందరలోనే..
376. కొత్తపూలు చల్లా వాకిట్లో..
ఏ క్షణమైనా నువ్వొస్తావనే
377. కోకచుట్టి అలంకరించు అక్షరానికి..
అలకందుకోకుంటే అప్పుడొచ్చి చెప్పు..
378. స్మృతులెన్ని జారాయో..
నేత్రాంచలాల నీరు తనతో తోడుకుపోతుంటే..
379. ఆనందాన్నే ఊపిరి చేసుకో..
నిత్యసంజీవనై నిన్ను రక్షించేందుకు..
380. బ్రతుకులెక్క తేలేదెన్నడులే..
జననమరణాల చక్రం ఆగకుండా తిరుగాడుతుంటే..
381. అక్షరాలకీ గాయమయ్యింది..
నీ వలపుగేయానికి తాను సరిపోదన్నావనేమో..
382. పక్షవాతం తప్పదు కొన్నిటికి..
పరిమితవాలందుకే కేవలం రసాస్వాదనకి
383. అపజయం వెనుదిరగాల్సిందే..
నీ ప్రయత్నలోపం లేకుండా తననధిగమిస్తే
384. మూగదేగా పెదవి..
నీ మాటలతో నోరు నొక్కేస్తుంటే..
385. తీయగానే ఉన్నాయి చూపులు..
ఏ ముంత ఖజూరపు తేనెలోంచీ తొంగి చూసావో..
386. ఎన్ని కథలు రాయాలో..
నీ కలలను అక్షరబద్దం చేసి పదిలం చేయాలంటే..
387. ఆశెక్కువే..
గోరంత నవ్వులకి ఆకాశం పరిచావంటే..
388. అరకొర నవ్వులైతేనేంటి..
దోసిలితో పాటూ మనసూ నింపానుగా..
389.అడవి కాచిన పరిమళాన్నేగా..
ఒంటరని కూడా చూడక వెన్నెలలా నాపై కురుస్తుంటే..
390. మనసూ కరిగి జారింది..
వెన్నలకి తెలియకుండా వివశమైనందుకేమో..
391. పద్మరాగం నేర్పాను నా మనసుకి..
పద్మమంటి నీ మోము వికసించాలనే..
392. కలనైనా దక్కించానని తెలుసుకోవేం..
కలవరమొచ్చే కబుర్లతో బాధపెడ్తూ..
393. నీ మనసు నా జతయ్యిందిగా..
నీకు నువ్వు దొరకడం కష్టమే..
394. ఎదుగుతున్నావేమో..
విమర్శా సమీక్షల్లో ముందున్నావంటే..
395. నా ఊపిరాపేసారు..
నా పరిమళం నిన్ను తాకలేదేమోనని
396.వసంత వియోగమే మదికి..
చైత్రకోయిల సాంత్వనకై ఎదురుచూస్తూ
397. అబద్దానికి రంగులెక్కువ..
నిజాయితీకి వేద్దామన్నా తీసుకోని స్వచ్ఛత
398. ఆమనిరాగాన్నే..
ఉషోదయానికే ఆనందం పరిచయిస్తూ..
399. పువ్వుల చినుకులు..
నిన్ను తలచినందుకే
400. నీ ఉదయం..
నా పరిచయమేగా
..................................... ********.....................................
No comments:
Post a Comment