..................................... ********.....................................
801. సెలయేరయ్యింది మౌనం..
నీ లాలనకు నిలువెల్లా కరిగిందనే..
802. నేనే ప్రకృతినైపోయా..
నీ కృతిలో నన్ను పాడుతావనే..
803. ఒకటే స్వప్నం..
నీవుంటే స్వర్గంలా...లేకుంటే నరకంలా..
804. అవనికెప్పుడూ ఆనందమే..
మరోసారి మట్టిలో విత్తనమై మొలకెత్తితే..
805. వెతుకుతున్నా నిన్నల్లో..
నా నీడై వెంటే ఉన్నావనుకోలా..
806. కబురులన్నీ కలబోసా..
కలినప్పుడు ఆడుకోవచ్చని..
807. దాక్కునే ఉన్నా...
అలవాటైన మనసేగానని..
808. కొరుకుడుపడని నేస్తానివే..
ముందరి కాళ్ళకు బంధాలు వేసేస్తూ..
809. వరమాలలేస్తూనే ఉన్నావుగా...
నువ్వంటే ఇష్టమన్నానని..
810. తలపులు పండాయి గోరింటలతో..
కన్నులు నిండాలి నీ చిలిపి నవ్వుల రూపాలతో..
811. అక్షరాలు శిల్పాలవుతున్నాయి..
చేయితిరిగిన అక్షరశిల్పి చేతికి చిక్కాయనే..
812. జ్ఞాపకాలు తడారట్లేదు..
నీ ప్రేమవర్షం అకాలంలో కురుస్తోందనే..
813. నీ మనసు నిండుకున్నట్లేగా..
అనుమానానికి చోటిచ్చి నన్నెళ్ళగొట్టాక..
814. నవరత్నాలనూ రాల్చేసా...
నా నవ్వుల్లో ఏరుకుంటావనే నమ్మకంతోనే..
815. ఋతువులనే మరుస్తున్నా..
నీ తలపుల నిత్యవసంతానికి అలవాటుపడి..
816. అనుమానం తరలిపోయింది మబ్బులా..
నిన్ను నాకొదిలేసి ఆనందంగా...
817. ఒక మౌనరహస్యమనుకుంటా..
నిశ్శబ్దం ఎక్కువై నిండిన మనసులా...
818.తెలియని ఆనందమేమో..
ప్రతీ కదలికలోనూ నృత్యం చేస్తున్నట్లు.
819. గగనమెక్కింది మది..
మేఘాలచాటు మనసును ఆరా తీద్దామనే..
820. మనసుకి నిచ్చనేసా..
హరివింటిలో విశ్రాంతి తీసుకోడానికి నువ్వొస్తావనే..
821. నీ మనసుకి నూనె రాసినట్టున్నావు..
నిలబడనివ్వకా కూర్చోనివ్వకా నన్ను జార్చేస్తూ..
822. నా అడుగుల హొయలను వెక్కిరిస్తావెందుకలా...
నీ అడుగుల జతకోసం ఆశపడ్డందుకేనా
823. వేరే తీరాలెందుకులే..
నా మనసు గమ్యం తెలిసిపోయాక..
824. విరహిస్తున్న మల్లెనేగా..
నీవులేక పరిమళాన్ని కోల్పోయిన నేను..
825. గుప్పెడంత ఆశతోనే వచ్చా..
గంపెడంత సంతోషంతో వెళ్తున్నా..
826. అలసిన మల్లెల పరితాపమట..
వేసవిని ఓర్చుకొని శ్రమపడుతున్నందుకు..!
827. తోడేలై సంచరిస్తున్న మృగాడు..
కసరత్తులకు ఎత్తులేసే పగవాడు..
828. గ్రీష్మానికెంత గర్వమో..
మల్లెలతో నా విరహాన్ని గెలిచిందని..
829. . నయనాలెప్పుడూ చంచలమే..
నిన్నెతుకు దారుల్లో చూపులు తడబడుతూ
830. ఎదలో ఒక ఒరవడి..
సెలయేరై నువు ప్రవహిస్తుంటే..
831. మనసుకన్నీ తప్పటడుగులే..
చేయి నడిపించే నువ్వు దూరమయ్యాక..
832. కలవరింతలు మామూలేగా..
నిదురైతే కలలో..పగలైతే పెదవుల్లో..
833. వెల్లివిరిసిన ఆనందం..
నీ హృదయంలో నే పదిలమనే..
834. క్షణాలన్నీ రాలిపోయేవే..
వసంతమొకటుందని తెలియని రేపటి ఆశల్లో..
835. మదిలో నీ ఊసుల హోరు..
గాలివానను తలపించి నన్ను భయపెడుతూ
836. ముత్యమై వేచున్నావనే..
నీలో రంగులు తిలకించాలని తొలి కిరణమై నేనొచ్చా..
837. అతని మనసులోనూ తడే..
ఆమె చూపులకర్థం తెలియక
838.ఒక్క కిరణమై వెలుతురు చూపిస్తావనుకున్నా..
మండే సూరీడువై మసి చేస్తావనుకోలా...
839. ఎంతపురూపమో నీ అభిషేకం..
అందెలకే పరితాపం తీరేట్టు..
840. చంద్రకిరణాలు తాగుతూనే ఉన్నా...
నాలోని విరహతాపం తీరుతుందేమోనని..
841. నీలో కొలువయ్యాకే తెలిసింది..
నీ ప్రాణదీపానికి కిరణమయ్యానని..
842. ఎంత చదివినా మిగిలే ఉంది..
అంతమవని అతివ మనసు చందం
843. విశాలమైన హృదయమామెది..
అంధకారంలోనూ మధురసంగీతాన్నే ఆవాహన చేస్తుంది..
844. కాలం మనసుకి తోడయ్యింది..
గాయాల్ని తాను పూసుకుంది..
845. దిగనంటూ మనోరథం..
నీ తలపుల పల్లకిలోనే బాగుందంటూ..
846. జవాబులేని ప్రశ్నలనేమో...
ప్రవహించే అశ్రువులు సైతం మౌనం...
847. ఎదలో స్వరాలాపనలు..
నీ కిరణాలతో నను మీటినందుకే..
848. చీకటని చింతిస్తావెందుకలా..
వెలుగుకిరణాలకి నువ్వే చేయి అడ్డుపెట్టి
849. వెలిగిపోతూనే ఉన్నా..
నీ వెన్నెలకిరణాలను చల్లగా పూసుకొని.
.
850. చరణాలు ఆపనంటూ నా పెదవులు..
నీ అల్లరిచూపులు పాడే పల్లవులకే..
..................................... ********.....................................
801. సెలయేరయ్యింది మౌనం..
నీ లాలనకు నిలువెల్లా కరిగిందనే..
802. నేనే ప్రకృతినైపోయా..
నీ కృతిలో నన్ను పాడుతావనే..
803. ఒకటే స్వప్నం..
నీవుంటే స్వర్గంలా...లేకుంటే నరకంలా..
804. అవనికెప్పుడూ ఆనందమే..
మరోసారి మట్టిలో విత్తనమై మొలకెత్తితే..
805. వెతుకుతున్నా నిన్నల్లో..
నా నీడై వెంటే ఉన్నావనుకోలా..
806. కబురులన్నీ కలబోసా..
కలినప్పుడు ఆడుకోవచ్చని..
807. దాక్కునే ఉన్నా...
అలవాటైన మనసేగానని..
808. కొరుకుడుపడని నేస్తానివే..
ముందరి కాళ్ళకు బంధాలు వేసేస్తూ..
809. వరమాలలేస్తూనే ఉన్నావుగా...
నువ్వంటే ఇష్టమన్నానని..
810. తలపులు పండాయి గోరింటలతో..
కన్నులు నిండాలి నీ చిలిపి నవ్వుల రూపాలతో..
811. అక్షరాలు శిల్పాలవుతున్నాయి..
చేయితిరిగిన అక్షరశిల్పి చేతికి చిక్కాయనే..
812. జ్ఞాపకాలు తడారట్లేదు..
నీ ప్రేమవర్షం అకాలంలో కురుస్తోందనే..
813. నీ మనసు నిండుకున్నట్లేగా..
అనుమానానికి చోటిచ్చి నన్నెళ్ళగొట్టాక..
814. నవరత్నాలనూ రాల్చేసా...
నా నవ్వుల్లో ఏరుకుంటావనే నమ్మకంతోనే..
815. ఋతువులనే మరుస్తున్నా..
నీ తలపుల నిత్యవసంతానికి అలవాటుపడి..
816. అనుమానం తరలిపోయింది మబ్బులా..
నిన్ను నాకొదిలేసి ఆనందంగా...
817. ఒక మౌనరహస్యమనుకుంటా..
నిశ్శబ్దం ఎక్కువై నిండిన మనసులా...
818.తెలియని ఆనందమేమో..
ప్రతీ కదలికలోనూ నృత్యం చేస్తున్నట్లు.
819. గగనమెక్కింది మది..
మేఘాలచాటు మనసును ఆరా తీద్దామనే..
820. మనసుకి నిచ్చనేసా..
హరివింటిలో విశ్రాంతి తీసుకోడానికి నువ్వొస్తావనే..
821. నీ మనసుకి నూనె రాసినట్టున్నావు..
నిలబడనివ్వకా కూర్చోనివ్వకా నన్ను జార్చేస్తూ..
822. నా అడుగుల హొయలను వెక్కిరిస్తావెందుకలా...
నీ అడుగుల జతకోసం ఆశపడ్డందుకేనా
823. వేరే తీరాలెందుకులే..
నా మనసు గమ్యం తెలిసిపోయాక..
824. విరహిస్తున్న మల్లెనేగా..
నీవులేక పరిమళాన్ని కోల్పోయిన నేను..
825. గుప్పెడంత ఆశతోనే వచ్చా..
గంపెడంత సంతోషంతో వెళ్తున్నా..
826. అలసిన మల్లెల పరితాపమట..
వేసవిని ఓర్చుకొని శ్రమపడుతున్నందుకు..!
827. తోడేలై సంచరిస్తున్న మృగాడు..
కసరత్తులకు ఎత్తులేసే పగవాడు..
828. గ్రీష్మానికెంత గర్వమో..
మల్లెలతో నా విరహాన్ని గెలిచిందని..
829. . నయనాలెప్పుడూ చంచలమే..
నిన్నెతుకు దారుల్లో చూపులు తడబడుతూ
830. ఎదలో ఒక ఒరవడి..
సెలయేరై నువు ప్రవహిస్తుంటే..
831. మనసుకన్నీ తప్పటడుగులే..
చేయి నడిపించే నువ్వు దూరమయ్యాక..
832. కలవరింతలు మామూలేగా..
నిదురైతే కలలో..పగలైతే పెదవుల్లో..
833. వెల్లివిరిసిన ఆనందం..
నీ హృదయంలో నే పదిలమనే..
834. క్షణాలన్నీ రాలిపోయేవే..
వసంతమొకటుందని తెలియని రేపటి ఆశల్లో..
835. మదిలో నీ ఊసుల హోరు..
గాలివానను తలపించి నన్ను భయపెడుతూ
836. ముత్యమై వేచున్నావనే..
నీలో రంగులు తిలకించాలని తొలి కిరణమై నేనొచ్చా..
837. అతని మనసులోనూ తడే..
ఆమె చూపులకర్థం తెలియక
838.ఒక్క కిరణమై వెలుతురు చూపిస్తావనుకున్నా..
మండే సూరీడువై మసి చేస్తావనుకోలా...
839. ఎంతపురూపమో నీ అభిషేకం..
అందెలకే పరితాపం తీరేట్టు..
840. చంద్రకిరణాలు తాగుతూనే ఉన్నా...
నాలోని విరహతాపం తీరుతుందేమోనని..
841. నీలో కొలువయ్యాకే తెలిసింది..
నీ ప్రాణదీపానికి కిరణమయ్యానని..
842. ఎంత చదివినా మిగిలే ఉంది..
అంతమవని అతివ మనసు చందం
843. విశాలమైన హృదయమామెది..
అంధకారంలోనూ మధురసంగీతాన్నే ఆవాహన చేస్తుంది..
844. కాలం మనసుకి తోడయ్యింది..
గాయాల్ని తాను పూసుకుంది..
845. దిగనంటూ మనోరథం..
నీ తలపుల పల్లకిలోనే బాగుందంటూ..
846. జవాబులేని ప్రశ్నలనేమో...
ప్రవహించే అశ్రువులు సైతం మౌనం...
847. ఎదలో స్వరాలాపనలు..
నీ కిరణాలతో నను మీటినందుకే..
848. చీకటని చింతిస్తావెందుకలా..
వెలుగుకిరణాలకి నువ్వే చేయి అడ్డుపెట్టి
849. వెలిగిపోతూనే ఉన్నా..
నీ వెన్నెలకిరణాలను చల్లగా పూసుకొని.
.
850. చరణాలు ఆపనంటూ నా పెదవులు..
నీ అల్లరిచూపులు పాడే పల్లవులకే..
No comments:
Post a Comment