..................................... ********.....................................
1651. ప్రేమకి కరువొచ్చింది..
మనసున్న ఏ గుండెలోనో కొలువుండుంటుంది..:(
1652. ఆలోచిస్తున్నా మౌనమై...
కన్నులు మూసినా మెలకువనున్న మరో ప్రపంచం వీక్షిస్తూ..
1653. ఎదురుచూస్తున్నా ఆ గంధపుసువాసనకు..
ఆకస్మిక వసంతవాయువు ఏ వైపు నుండి వీస్తుందోనని..
1654. విరహమై నిలిచా..
వలపు వాకిట్లో..
1655. అనుభవాలే జీవితపాఠాలు..
కష్టాలు కన్నీళ్ళు.. చరిత్రలో ఇమిడిపోతూ..!
1656. ఆలోచనాలోచనాలనుకుంటా అవి..
అంతర్నేత్రం తెరిచిచూస్తే జీవితం సాక్షాత్కరిస్తుంది
1657. నిషేదించా నిముషాలను..
నీవు లేనప్పుడు నెమ్మదిగా నడుస్తున్నాయని..
1658. దుఃఖమొచ్చి చేరేదందుకే..
తనగురించి కాక ఎదుటివారిని ఆలోచించినందుకు..
1659. ఊహల ప్రపంచాన్ని సృష్టించుకున్నా..
సజీవమైనదేదీ లేదనే లోకంలో..
1660. ఊహలకెంత ఉలికిపాటో..
గీసుకున్న లక్ష్మణరేఖ దాటి నువ్వొచ్చావని..
1661. ఇలాగే బ్రతకాలనుంది..
అర్ధంకాని చిక్కుప్రశ్నలా నే మిగలకుండా..
1662. గాలితో ఎగిరొచ్చిన ఊసులు..
నమ్మకంతో నువ్వు పంపావనే..
1663. వలపు బంధమేసావుగా..
విడిచిపోనంటూ మనసుబాసలు..
1664. మునివేళ్ళకెంత మురిపమో..
అల్లిబిల్లి అల్లికలు అరచేతనే వేసావని..
1665. ముళ్ళన్నీ పువ్వులుగా మారాయి..
జ్ఞాపకాల్లో నువ్వు మిళితమయ్యావనే
1666. శివరంజనిరాగం వినిపిస్తున్నా...
నీ కర్ణాలకు ప్రేమను పరిచయిద్దామనే..
1667. గాయాన్ని పరిచయించావెందుకో..
రేపటికి గేయంగా మారుతుందనే నమ్మకంలో..
1668. నా మాటలెప్పుడూ మకరందాలే..
మధుమేహం అవుతుందని దూరమవుతావే..
1669. ఊహలకెన్ని నాట్యాలో..
నీతో అడుగు కలిపి ఆడుతున్నట్లు..
1670. కవితల పందిరిని నేస్తున్నా..
భావవల్లరిని నీకు పరిచయిద్దామని..
1671. అదెంత గర్వమో నా కన్నులకు..
ఆరడుగుల తనను అలవోకగా బంధించినందుకు..
1672. వెన్నెల్లోనూ దీపం పెడుతున్నా...
నీవో నల్లపూసగా మారావనే..!
1673. వెలుతురు కిరణాల్లో నిన్నెతుకుతున్నా..
గుండెకు స్పందన కరువయ్యిందనే..
1674. కాటుకే హద్దులు గీసేస్తుంది..
కన్నులతో ఊసులు చాలించమంటూ..
1675. లక్ష్యం నెరవేరిందిగా..
నీ స్వప్నాన్ని నాకు చేరవేస్తూ..
1676. మనసు పుటలన్నీ చదివేసా..
మొత్తం నన్నే రాశావని..
1677. నిశ్శబ్దమూ సవ్వడి చేసింది..
మనసులోకి నువ్వొచ్చి చేరావని..
1678. కధగానే మిగిలిపోయా..
వాస్తవంగా స్వీకరించలేని నీ జీవితంలో..
1679. నీరెండల్లోనూ నిశ్చింత..
నీడ కనిపించకున్నా వెంటున్నావని గమనించి..
1680. మలచుకుంటే హరివిల్లులే మన జీవితాలు.
అస్తిత్వమో వర్షపుచినుకు చివర మొదలైనా..
1681. హృదయం లయమై కరిగింది..
అంకురించిన మేఘానికి పరవశిస్తూ..
1682. ఎన్నిచూపుల బాణాలు వేసావనో..
నీ కోర్కెను తీర్చేందుకు ఇలకు పయనమైన తారకలు..
1683. వెన్నెలమైదానాలు నవ్వుకున్నాయి..
ఆమె కుంకుమ బుగ్గలను స్పృసించిందనే..
1684. ఆహ్వానించా జీవితంలోకి..
ఆమడ దూరమంటూనే నాకు దగ్గరయ్యావని..
1685. జీవితానికో అర్థం తెలిసొచ్చింది..
నీ సందర్శనంతో పునర్జీవినయ్యాక..
1686. వర్తమానం వసంతమే..
నిజాన్ని గ్రహించి నన్నాదరించి దరిచేర్చాక..
1687. మనసుకు మాయలు నేర్పకలా..
నన్ను వినడం మానేయగలదు..
1688. అతిశయమే నీ అక్షరాలకు..
అభిషేకిస్తూ నన్ను మెప్పించాలని..
1689. వెన్నెలే విస్తుపోయింది..
దీపం మరోదీపాన్ని వెతుక్కోవడం చూసి..
1690. నవ్వులకు నోచుకోలేదట..
శూన్యం కాకేం మిగిలిందా జీవితంలో..
1691. రెప్పవిడిన కన్నులు..
తెరచినా ముందుకింకా రావేమని ప్రశ్నిస్తూ..
1692. కలలనిండా కిరణాలే..
నిద్దురలో మరోలోకాపు విహారానికి పిలుస్తూ..
1693. వియోగమే విసుక్కుంటోంది..
విశ్రాంతి ఇవ్వని నా తలపులకి..
1694. రెప్పలకి అలకయ్యిందట..
ఒళ్ళంతా కళ్ళుచేసుకొని ఇంద్రుడిలా భావించుకున్నావని..
1695. అందించడానికి చేయుందిగా..
చీకటినైనా చేధించి గమ్యం చేర్చేందుకు..
1696. మనసుకోరికే కన్నులకీ..
చీల్చుకునైనా నిన్నదేపనిగా అనిమేషమై తిలకించాలని
1697. నవ్వులకే దిగివచ్చాయెందుకో నక్షత్రాలు..
ఆకాశానికి అతిశయం తగ్గిద్దామనేమో..
1698. కన్నుల్లోనే కొలువుండమన్నానందుకే..
మనసులోకి తొంగిచూస్తే మాడిపోతావని చెప్పలేకనే..
1699. శూన్యాన్ని ధిక్కరించింది మనసు..
అరవిందుడివై నువ్వోరగా చూసావనే..
1700. అంబరమంటిందిగా మనసు..
మేఘరాగంతో ఒక్కమారు హృది మీటినందుకే..
1651. ప్రేమకి కరువొచ్చింది..
మనసున్న ఏ గుండెలోనో కొలువుండుంటుంది..:(
1652. ఆలోచిస్తున్నా మౌనమై...
కన్నులు మూసినా మెలకువనున్న మరో ప్రపంచం వీక్షిస్తూ..
1653. ఎదురుచూస్తున్నా ఆ గంధపుసువాసనకు..
ఆకస్మిక వసంతవాయువు ఏ వైపు నుండి వీస్తుందోనని..
1654. విరహమై నిలిచా..
వలపు వాకిట్లో..
1655. అనుభవాలే జీవితపాఠాలు..
కష్టాలు కన్నీళ్ళు.. చరిత్రలో ఇమిడిపోతూ..!
1656. ఆలోచనాలోచనాలనుకుంటా అవి..
అంతర్నేత్రం తెరిచిచూస్తే జీవితం సాక్షాత్కరిస్తుంది
1657. నిషేదించా నిముషాలను..
నీవు లేనప్పుడు నెమ్మదిగా నడుస్తున్నాయని..
1658. దుఃఖమొచ్చి చేరేదందుకే..
తనగురించి కాక ఎదుటివారిని ఆలోచించినందుకు..
1659. ఊహల ప్రపంచాన్ని సృష్టించుకున్నా..
సజీవమైనదేదీ లేదనే లోకంలో..
1660. ఊహలకెంత ఉలికిపాటో..
గీసుకున్న లక్ష్మణరేఖ దాటి నువ్వొచ్చావని..
1661. ఇలాగే బ్రతకాలనుంది..
అర్ధంకాని చిక్కుప్రశ్నలా నే మిగలకుండా..
1662. గాలితో ఎగిరొచ్చిన ఊసులు..
నమ్మకంతో నువ్వు పంపావనే..
1663. వలపు బంధమేసావుగా..
విడిచిపోనంటూ మనసుబాసలు..
1664. మునివేళ్ళకెంత మురిపమో..
అల్లిబిల్లి అల్లికలు అరచేతనే వేసావని..
1665. ముళ్ళన్నీ పువ్వులుగా మారాయి..
జ్ఞాపకాల్లో నువ్వు మిళితమయ్యావనే
1666. శివరంజనిరాగం వినిపిస్తున్నా...
నీ కర్ణాలకు ప్రేమను పరిచయిద్దామనే..
1667. గాయాన్ని పరిచయించావెందుకో..
రేపటికి గేయంగా మారుతుందనే నమ్మకంలో..
1668. నా మాటలెప్పుడూ మకరందాలే..
మధుమేహం అవుతుందని దూరమవుతావే..
1669. ఊహలకెన్ని నాట్యాలో..
నీతో అడుగు కలిపి ఆడుతున్నట్లు..
1670. కవితల పందిరిని నేస్తున్నా..
భావవల్లరిని నీకు పరిచయిద్దామని..
1671. అదెంత గర్వమో నా కన్నులకు..
ఆరడుగుల తనను అలవోకగా బంధించినందుకు..
1672. వెన్నెల్లోనూ దీపం పెడుతున్నా...
నీవో నల్లపూసగా మారావనే..!
1673. వెలుతురు కిరణాల్లో నిన్నెతుకుతున్నా..
గుండెకు స్పందన కరువయ్యిందనే..
1674. కాటుకే హద్దులు గీసేస్తుంది..
కన్నులతో ఊసులు చాలించమంటూ..
1675. లక్ష్యం నెరవేరిందిగా..
నీ స్వప్నాన్ని నాకు చేరవేస్తూ..
1676. మనసు పుటలన్నీ చదివేసా..
మొత్తం నన్నే రాశావని..
1677. నిశ్శబ్దమూ సవ్వడి చేసింది..
మనసులోకి నువ్వొచ్చి చేరావని..
1678. కధగానే మిగిలిపోయా..
వాస్తవంగా స్వీకరించలేని నీ జీవితంలో..
1679. నీరెండల్లోనూ నిశ్చింత..
నీడ కనిపించకున్నా వెంటున్నావని గమనించి..
1680. మలచుకుంటే హరివిల్లులే మన జీవితాలు.
అస్తిత్వమో వర్షపుచినుకు చివర మొదలైనా..
1681. హృదయం లయమై కరిగింది..
అంకురించిన మేఘానికి పరవశిస్తూ..
1682. ఎన్నిచూపుల బాణాలు వేసావనో..
నీ కోర్కెను తీర్చేందుకు ఇలకు పయనమైన తారకలు..
1683. వెన్నెలమైదానాలు నవ్వుకున్నాయి..
ఆమె కుంకుమ బుగ్గలను స్పృసించిందనే..
1684. ఆహ్వానించా జీవితంలోకి..
ఆమడ దూరమంటూనే నాకు దగ్గరయ్యావని..
1685. జీవితానికో అర్థం తెలిసొచ్చింది..
నీ సందర్శనంతో పునర్జీవినయ్యాక..
1686. వర్తమానం వసంతమే..
నిజాన్ని గ్రహించి నన్నాదరించి దరిచేర్చాక..
1687. మనసుకు మాయలు నేర్పకలా..
నన్ను వినడం మానేయగలదు..
1688. అతిశయమే నీ అక్షరాలకు..
అభిషేకిస్తూ నన్ను మెప్పించాలని..
1689. వెన్నెలే విస్తుపోయింది..
దీపం మరోదీపాన్ని వెతుక్కోవడం చూసి..
1690. నవ్వులకు నోచుకోలేదట..
శూన్యం కాకేం మిగిలిందా జీవితంలో..
1691. రెప్పవిడిన కన్నులు..
తెరచినా ముందుకింకా రావేమని ప్రశ్నిస్తూ..
1692. కలలనిండా కిరణాలే..
నిద్దురలో మరోలోకాపు విహారానికి పిలుస్తూ..
1693. వియోగమే విసుక్కుంటోంది..
విశ్రాంతి ఇవ్వని నా తలపులకి..
1694. రెప్పలకి అలకయ్యిందట..
ఒళ్ళంతా కళ్ళుచేసుకొని ఇంద్రుడిలా భావించుకున్నావని..
1695. అందించడానికి చేయుందిగా..
చీకటినైనా చేధించి గమ్యం చేర్చేందుకు..
1696. మనసుకోరికే కన్నులకీ..
చీల్చుకునైనా నిన్నదేపనిగా అనిమేషమై తిలకించాలని
1697. నవ్వులకే దిగివచ్చాయెందుకో నక్షత్రాలు..
ఆకాశానికి అతిశయం తగ్గిద్దామనేమో..
1698. కన్నుల్లోనే కొలువుండమన్నానందుకే..
మనసులోకి తొంగిచూస్తే మాడిపోతావని చెప్పలేకనే..
1699. శూన్యాన్ని ధిక్కరించింది మనసు..
అరవిందుడివై నువ్వోరగా చూసావనే..
1700. అంబరమంటిందిగా మనసు..
మేఘరాగంతో ఒక్కమారు హృది మీటినందుకే..
..................................... ********.....................................
No comments:
Post a Comment