Thursday, 19 November 2015

ద్విపదాలు : 2201 నుండి 2250 వరకు

..................................... ********.....................................

2201. ఊగిసలాడుతూ ఊపిరి..
నిన్ను చూసేదాక లోలోపలే కొట్టుమిట్టాడుతూ..
2201.నిన్ను శ్వాసించిన ఊపిరులే..
నాకు ప్రాణదానం చేసినవి..
2202. మనసులో అనుగ్రహవీచికలు వీచేదెన్నడో..
మానవత్వపు కొనవూపిరికి తర్పణాలెన్నడో..
2203. గమనం మరచిన ఊపిరి..
నా కలంలోకి చేరినందుకేమో..
2204. కవిత్వాన్ని ఊపిరిగా రాసినందుకేమో..
రసహృదయాలను మీటుతూ గుబాళిస్తోంది..
2205. ప్రేమఖైదీలా నువ్వు..
నీ ఊపిరిని నాకు ధారపోసేస్తూ..
2206. అడుగులను లెక్కిస్తున్నా..
నిన్ను చేరే దూరం తరిగిపోవాలనే..
2207. ఊపిరినాపమంటావే..
నీ విరహాన్ని ప్రవహించేలా కీర్తిస్తుంటే..
2208. నీ ఊసును గమనిస్తున్నా..
నా ఊపిరి బరువులలో..
2209. మరణసదృశమేగా...
ఆ ఊపిరులలో ద్వేషమే నిండితే..
2210. భావాలకు ఊపిరందిస్తున్నా..
నీ కలంలో జాలువారే అక్షరాలసాక్షిగా..
2211. నా అశ్రువులు వెచ్చనివే..
నీ ఊపిరిదాటే ప్రవహిస్తున్నవిగా..
2212. దుఃఖాశ్రువులు కురుస్తున్నవి..
వైరాగ్యాన్ని కానుక చేసిన నీ ఊపిరిని తలచేకొద్దీ..
2213. సంతోషాన్ని నే శాశ్వతం చేసుకున్నా..
నీ ఊపిరిలో నన్ను దాచుకొని..
2214. నీ వలపుకోరికలు తెలుస్తున్నవి..
ఊపిరి తొలకరిలో తడిపేస్తుంటే..
2215. తడబడుతున్న మనసు..
ఊపిరి పొలిమేరదాటి అడుగులు వేయాలంటే..
2216. డొంకను కదల్చాలని లేదులే..
నీ ఊపిరితీగను లాగిమరీ..
2217. యవ్వనం నిర్లక్ష్యమేగా..
ఊపిరంతా వలపుకే అంకితమిచ్చే యువతచేతల్లో..
2218. మాటల లాలసలెందుకులే..
మనసులు మమేకమయ్యాక..
2219. నిన్నటి ప్రణయమే..
నేటికి శూన్యంగా మిగిలి వెక్కిరిస్తూ..
2220. నీ కన్నుల తళతళ..
నా నవ్వులో చిందులేస్తూ..
2221. నీవుంటే అరుణకమలం..
లేకుంటే విషణ్ణవదనం..
2222. శ్వాసతో శ్వాసను శృతి చేస్తుంటే..
ఊపిరి గిలిగింత గమకమై సాగాలిక..
2223. నీ ఊపిరి ఉరకలేస్తున్నందుకేమో..
ఉసురు చూపుని తాకలేదు..
2224. నిష్కారణపు నవ్వేమో..
గమ్యంలేని ఆకాశంలో అనంతమై విస్తరిస్తూ..
2225. నీ కళ్ళతో వేసావుగా వల..
శ్వాసిస్తే తీరే ఆకలి కాదంటూ..
2226. జ్ఞాపకం తడుముతూనే ఉంది..
 ఊపిరంత వెచ్చగా తడిపినందుకే..
2227. మునకేసిన నీ ఆలోచనలు..
మనసు ఊబిలో కూరుకుపోయినట్లుంది..
2228. నులివెచ్చగా ఉంది మనసు..
ఏకాంతామనే దుప్పటి కప్పినందుకేమో..
2229. మౌనం కాసేపేననుకుంటా..
మాట కలిసాక తీగై అల్లుకుపోయేందుకేమో..
2230. నీవుంటే..వడ్డించిన విస్తరే..
కాకుంటే..వడ్డించవు పిసినారి..
2231. సరసం సంపెంగవుతోంది..
నీ అనురాగం సన్నయిరాగమై నన్నల్లుకుపోతుంటే..
2232. కుంచెగా మారుతూ నా కలం..
నీ కవితను చిత్రించాలనే ఆరాటంలో..
2233. జాఢ్యమెందుకులే..
జాగు చేయక రమ్మన్నందుకు..
2234. నీకోసమే కందామనుకున్నా కల..
నువ్వు రానన్నావనే  విలవిల..
2235. నందనవనమే మది..
అల్లన వేణునాదమేదో నువ్వు వినిపిస్తుంటే..
2236. గులాబీనని ఇప్పటికి గుర్తుకొచ్చింది..
ముళ్ళని నీవిప్పుడు ప్రస్తావించినందుకే..
2237. అమాస చీకటైతేనేమి..
దాచుకున్న తారలెన్నో మబ్బులమాటునే కనుమరుగవ్వగా..
2238. నీ సమక్షంలో నేను..
ఆకాశంలో విచ్చుకున్న మల్లెకొమ్మలా..
2239. నేను ఆనందమై నర్తిస్తున్నాను..
నువ్వొచ్చే దారిదేనని గుర్తించినందుకే..
2240. అక్షరశిల్పివయ్యావుగా..
శిలను శిల్పముగా మారుస్తానంటూ..
2241. సద్విమర్శ స్వీకరించేందుకే..
ముఖస్తుతి..కేవలం నిన్ను నొప్పించేందుకే..
2242. ఆశువులను వర్షిస్తోంది..
నీవు నాకొదిలిన శూన్యమొకటి శోకిస్తూ..
2243. పరిచయమక్కర్లేదు ప్రపంచానికి..
విజయం వైపు పయనించే అడుగులు విలువలతోనే మొదలైతే..
2244. వసంతమై వలచి వద్దామనుకున్నా..
కోయిల ఒక్కమారైనా సహకరిస్తే..
2245. తాకేందుకే ఆలోచిస్తున్నా..
నీవో తాపంతో రగిలే విరహాగ్నివనే..
2246. మట్టివాసనేసినప్పుడే అనుకున్నా..
మానవత్వపు మేఘమేదో కురిసే సమయమయ్యిందని..
2247. నింగికెగిసిన నిర్లిప్తత..
హృదయాంచలాల విషాదం వాస్తవమై వెక్కిరిస్తుంటే
2248.  బ్రహ్మానందమవుతోంది..
నువ్వలా అనునయిస్తుంటే నేనలిగిన ప్రతిసారీ
2249. మనసు పగిలిన శబ్దమేననుకున్నా..
నిశ్శబ్దం మాటను గెలిచినప్పుడు..
2250. మౌనంలోనే మురుస్తున్న మాట..
మనసులో భద్రంగా ఉన్నాననుకుంటూ..
..................................... ********.....................................

No comments:

Post a Comment