Wednesday, 18 November 2015

ద్విపదాలు : 501 నుండి 550 వరకు

..................................... ********.....................................

501. ఎండిన చివరిచుక్కనే..
చెక్కిలి చేరదీసిన భావాల మరకని..

502. సముద్రాలన్నీ ఏకంచేసే అవసరమే లేదుగా..
నా లోకమే నువ్వని నిర్ణయించుకున్నాక..

503. కల నిజమయ్యింది..
నా ఊహలో నువ్వొచ్చి చేరావనే..

504. కళ్యాణమేగా  కావ్యానికీ..
కమనీయమై నీ రాతలో ఒదిగిపోతే

505. ఆనందమేగా మనసుకి..
నీ తలపులను గెలిచింది నేనంటే..

506. స్త్రీ సర్వస్వాతంత్రురాలే..
పురుషుల అదుపాజ్ఞలకు లొంగుండేప్పుడు తప్ప..

507. మండే గుండెకే తెలుస్తుంది..
మనసు పడే వేదనెంతో..

508. బాధడొద్దంటావే..
వచనం అడిగితే ప్రవచనం చెప్పి..

509. ఆనందించింది మనసు..
పదింతలై వెలుగుతున్న నీ సంతోషానికే..

510. నవ్వులకూ దోబూచులట..
అగాగి మోముపై నాట్యం చేస్తూ..

511. నవ్వులతో పండించా పున్నమిని..
కెంపులవెన్నెలను నీకు పరిచయించాలని

512. ఆత్మసౌందర్యం ఇనుమడించింది..
పంచకర్మలతో మనసుని శుద్ధి చేసినందుకే..

513. తాగి చూడు అమృతాన్ని..
సాంగత్యపు కమ్మదనం రుచించేదప్పుడే..

514. నా ఊహకెప్పుడూ ముందడుగే..
రేపటిని నేడే చిత్రించుకుంటూ..

515. అతిశీతలం భరించలేని నయనం..
వెచ్చగా తనకుతానే ఓదార్చుకుంటూ..

516. నా విరహానికీ వసంతమే..
నీ ఊహలో విహరిస్తూ..

517. ఆకాశమైంది అందుకే..
నా హృదయం నిన్ను వలచిందనే..

518. అంతరిస్తున్నాయి పిచ్చుకలు..
పోషణలేని ప్రకృతి అంతరాల్లో జీవించలేక..

519. అభిమానమే గెలిచింది..
సంతృప్తిని కాదనుకున్నందుకే

520. తరుగుతున్న ఆయువుకి లెక్కలెందుకు..
భవిష్యత్తును ఆనందమయం చేసుకొనే దిశగా కృషి చేయక

521. నిత్యకళ్యాణివే నీవు..
కావ్యమై నాతో రాయించుకొనే వరకూ..

522. నాకెప్పుడూ ఇష్టమే..
రాధామనోహరపూలలో మన ప్రతిబింబాల్ని తిలకించడం

523. జీవితానికర్ధం తెలిసిందప్పుడే..
నా అస్తిత్వం కేవలం ఊహలకే పరిమితమని గ్రహించినప్పుడే..

524. చేరువయ్యింది చేతులే..
చప్పట్లు కొట్టేది ఎన్నడో మరి.

525. జీవితాన్ని అందుకుందప్పుడే..
నీ చెలిమి చేయందించి చేరదీసినప్పుడే

526. ఊసులు చేరిందప్పుడే..
నీ ఊహలు ఎదలో ఝుమ్మన్నప్పుడే

527. నాకు నేను చేరువయ్యా..
నీ ఎదలో చేరినప్పుడే..

528. చెదిరిన శరీరాలు..
జీవితాన్ని అమ్ముకొనే వెతల చితుల్లో..

529. నీ తలపు నిత్యవసంతాలేమో..
వైశాఖవీణలు తీయనై మోగుతూ..

530. జీవించకపోవడమంటూ ఉంటుందా..
మానవత్వానికి కనీస చేయూతనంటూ ఇవ్వగలిగితే

531. నా పేరుకే నీరాజనం..
నీవొక్కసారి పిలిస్తే చాలు..

532. కన్నీటికీ కమ్మదనం తెలిసింది..
తడిచిన నా చెక్కిలిని నీ చేయి తడిమాక..

533. అపురూపమే చెలికాని ప్రజ్ఞ..
చెలిమోము చంద్రకాంతలతో నింపుతూ..

534. నీకంకింతమయ్యాను అప్పుడే..
నీ కమ్మని కాటుకకలలు నాతో నింపిన క్షణాన

535. మంకెనలే చెక్కిళ్ళు..
సాయం సంధ్యకీ ఎర్రనై మెరుస్తూ..

536. నెలవంకనేనయ్యా..
అమాసైనా నీ పెదవులపై చేరినందుకే

537. కలహంసనైపోయాగా..
నీ చూపులు పెదవులై తడుముతుంటే..

538. దీర్ఘనిద్ర సైతం సుఖమే..
నా కలలో నిత్యముంటానంటే..

539. చిత్రాలు గీస్తున్న చూపులతోనే..
నీ ప్రేమనంచనా వేసేందుకే

540. భావచిత్రాలనే ఊహిస్తోంది మది..
సారసపుకన్నులే అందుకు సాక్షి..

541. కలలోనైనా చిక్కానుగా..
అలనై అల్లంత దూరాన ఎగిసిపడుతున్నా

542. నిలబడలేని నిస్సహాయత..
నిర్వీర్యమైన ఆశతో..

543. అశ్రువులు వెచ్చబడ్డాయి..
హేమంతానికి పయనమయ్యి నిన్ను గ్రీష్మానికి చేరానని కాబోలు

544. రేయంతా పొలమారితే నన్ను క్షమించవూ..
నీ తలపులతో నాకూ జాగారమయ్యిందిగా.

545. అదే అర్థం..
వాక్యాలే అనేకం..

546. ప్రణయం పరిమళించిందేమో..
పగటికి మత్తెక్కి హృదయంలోకి జారిపోతూ..

547. పున్నమంటే ఇష్టమేమో..
నువ్వొస్తే వెలుగొస్తుందని..

548. కలువలనేనాడో కాదన్నడుగా..
నా నవ్వుకు దాసోహమైనప్పుడే చందురుడు

549. కలువలతో తుమ్మెదలగోల నాకెందుకు..
నెలరాజే నావంక తిరిగినప్పుడు..

550. అన్నీ అలతిపదాలే..
నిన్ను చేరే తొందరలో చరణాలైపోతూ..

..................................... ********.....................................

No comments:

Post a Comment