..................................... ********.....................................
751. హృదయం ఆలకిస్తే చాలదా..
నీ నవ్వుల్లో కనపడనా..
752. మౌనానికి భంగపాటు తప్పదులే..
ఒక్కమారు వసంతమై నేనల్లుకుంటే..
753. మదిగదిలో నిత్యచీకటే..
రసవాటిక కన్నీటిప్రవాహమయ్యాక..
754. మనసు పొలిమేర దాటిందేమో..
మిణుగురు వెలుతురుకే భయపడుతూ..
755. చిలుకమోవి కెంపయ్యిందానాడే.
వెన్నెల్లో నా పెదవి తాగినప్పుడే
756. తొలివెలుగు నీవేగా..
నా ఆత్మకు తొలిదర్శన భాగ్యమవుతూ
757. చీకటి చిగురించింది..
వెన్నెలకొమ్మ పరిమళం మౌనానికి పూసినందుకు..
758. రసప్రవాహమైంది కధ..
ఒయారాల మలుపుల్లో ఒడుపుగా ఒదిగినందుకే..
759. గట్టిదే గుండే..
బరువైన బాధను కన్నీటితో మోసేస్తూ
760. కాలే విరహం కరుగుతుందిలే కౌగిళ్ళలో..
నిదురరాని తీయని రాత్రుల సాక్షిగా..
761. చింతనంపేసా గ్రీష్మానికి..
వసంతాన్ని ఆహ్వానించాననే.
762. వసంతకుసుమాలు విచ్చుకున్నాయి..
విరహంలో ఆవేదనా మధురాల్ని పులుముకొని
763. చైతన్యం ఒక్కటేగా అంతరంగ బహిరంగాల్లో...
వ్యక్తిత్వాన్ని బట్టీ రెండుగా కనపడుతూ..
764. పూలరెక్కలకే పులకరిస్తున్నా...
మన్మధుని మాయను ఆసాంతం ఆస్వాదిస్తున్నా..
765. నీ తలపులను పెనవేసా...
కన్నీరు ఆనందభాష్పాలై కురిసేలా..
766. వేసవి విరహంలో మల్లెలజల్లులు..
వెన్నెల్లో పులకరింతల వెల్లువలు..
767. ఎన్నెన్ని చూపులకర్ధాలు వెతికితేనేమి..
అభిసారికనేగా నీ ఎదురుచూపులో..
768. మాటలు నచ్చకుంటే చెప్పొచ్చుగా..
గుణపాలతో అనవసరంగా గుచ్చుతావెందుకలా
769. పూలగాలొచ్చి నిద్దురలేపాలేమో..
మాలికలకి అలవాటుపడ్డ మనసు కదా
770. .ఊసులతోనే లేపుతాలే..
కబుర్లకి అలవాటుపడ్డ మనసు కదా..
771. లేవలేకున్నా ప్రతిసారీ..
నీ చిరునవ్వుల చెకిళ్ళగుంతలు లోతెక్కువని
772. నెలవంకైంది పెదవి..
నీ వంకలకు కిలకిలలు కురిపిస్తూ..
773. కొత్తలిపిని నేర్వాలేమో నా కనులు..
ప్రతీచూపునీ నువ్వు అలవోకగా పట్టేస్తుంటే..
774. సందెల్లో కుంకుమ నీవేనేమో..
హృదయంలో సరిగమలను చిలకరిస్తూ..
775.గుడిగంటలు సరిగమలై వినిపించాయి..
నీ తలపులే మోగాయేమో
776. పరుగాపని పయనమయ్యింది..
లక్ష్యాలనే మైలురాళ్ళను దాటడమే జీవితగమ్యంగా ..
777. పువ్వుల గుసగుసలు వింటున్నా..
నీ కవితల్లా అనిపిస్తుంటేనూ..
778. సంకీర్తనాసుమాలెన్ని పూయవచ్చో..
ఇరువురం కలిసి సాధన చేస్తే..
779. చిటపటవానలు కురిసాయి..
తొలకరి మబ్బుల ఉరుముల సవ్వడికి..
780. చెట్టుదో ఉన్నతస్వభావమేమో..
గొడ్డలి అహంకారానికి కర్రిచ్చి సాయపడుతూ..
781. మౌనవించేసా..
నీ మూగబాధ వింటుంటేనూ..
782. రుసరుసలాడకు..
నే పిలిచింది నిన్ను కాదు..
783. కలలంటే నాకెంతో ఇష్టం..
నిదురలోనైనా నన్ను నవ్విస్తాయని
784.గర్వపడుతున్న గుండె..
మకుటం పెట్టకున్నా అంకితమిచ్చిన ఆనందానికి...
785. గర్వపడుతున్న గుండె..
కన్నీటి సంద్రాలను కన్నుల్లో బంధించగలిగానని
786. గర్వపడుతున్న గుండె..
ఏకమైన రెండుగుండెల చప్పుడు వినగలిగిందని.
787. గర్వపడుతున్న గుండె..
నన్నుగా స్వీకరించిన చెలిమి తోడయ్యిందని.
788. వసంతమంతా వెన్నెలై వెలిగింది..
ఆశలకు కొత్తచివురులు తొడిగావనే..
789. కన్నీళ్ళు నిండుకున్నాయి..
రేయంతా కలవరంతో చెక్కిళ్ళను అభిషేకించి..
790. హృదయం కరిగిపోతోంది..
వెన్నెలపాళీతో లిఖించిన కవిత్వం చదివినందుకే
791. అత్యధిక సంపన్నురాలినే..
నాతో నువ్వున్నప్పుడు..
792. ఎంతదృష్టమో సుమాలకి..
వనమాలే అతిధిగా విహరిస్తూ ఓలలాడిస్తే..
793. ఆదమరుపే మరి..
నీ తలపులు వట్టివేళ్ళై పెనవేస్తుంటే
794. నా చూపుల తడబాటు చెప్పలేదు..
రెప్పలమాటున నిన్ను దాచిన నిజాన్ని..
795.కన్నీరు పొంగని కన్నులేమో అవి..
కరిమబ్బునే కాటుకగా దిద్దుకొన్న సోయగాలతో.
796. వేదనాభాష్పాలెన్నో..
నిదురలేని కన్నుల్లోనే ఆవిరైపోతూ
797. ఏ కొలువుకైనా సిద్ధమే కనులు..
నా కటుకలో నువ్వు కొలువుంటానంటే..
798. కాస్త వలపిస్తావా..
నీ ఊహల్లో వెచ్చగా ఒదిగుంటా..
799. నీ పిలుపు చాలదూ..
నే నిద్దురలోనూ ఉలిక్కిపడేందుకు..
800. నా కన్నులెంత గడుసరివో..
నీ కలాన్ని పసిగట్టి తానే ముందుగా రాసేస్తూ
..................................... ********.....................................
751. హృదయం ఆలకిస్తే చాలదా..
నీ నవ్వుల్లో కనపడనా..
752. మౌనానికి భంగపాటు తప్పదులే..
ఒక్కమారు వసంతమై నేనల్లుకుంటే..
753. మదిగదిలో నిత్యచీకటే..
రసవాటిక కన్నీటిప్రవాహమయ్యాక..
754. మనసు పొలిమేర దాటిందేమో..
మిణుగురు వెలుతురుకే భయపడుతూ..
755. చిలుకమోవి కెంపయ్యిందానాడే.
వెన్నెల్లో నా పెదవి తాగినప్పుడే
756. తొలివెలుగు నీవేగా..
నా ఆత్మకు తొలిదర్శన భాగ్యమవుతూ
757. చీకటి చిగురించింది..
వెన్నెలకొమ్మ పరిమళం మౌనానికి పూసినందుకు..
758. రసప్రవాహమైంది కధ..
ఒయారాల మలుపుల్లో ఒడుపుగా ఒదిగినందుకే..
759. గట్టిదే గుండే..
బరువైన బాధను కన్నీటితో మోసేస్తూ
760. కాలే విరహం కరుగుతుందిలే కౌగిళ్ళలో..
నిదురరాని తీయని రాత్రుల సాక్షిగా..
761. చింతనంపేసా గ్రీష్మానికి..
వసంతాన్ని ఆహ్వానించాననే.
762. వసంతకుసుమాలు విచ్చుకున్నాయి..
విరహంలో ఆవేదనా మధురాల్ని పులుముకొని
763. చైతన్యం ఒక్కటేగా అంతరంగ బహిరంగాల్లో...
వ్యక్తిత్వాన్ని బట్టీ రెండుగా కనపడుతూ..
764. పూలరెక్కలకే పులకరిస్తున్నా...
మన్మధుని మాయను ఆసాంతం ఆస్వాదిస్తున్నా..
765. నీ తలపులను పెనవేసా...
కన్నీరు ఆనందభాష్పాలై కురిసేలా..
766. వేసవి విరహంలో మల్లెలజల్లులు..
వెన్నెల్లో పులకరింతల వెల్లువలు..
767. ఎన్నెన్ని చూపులకర్ధాలు వెతికితేనేమి..
అభిసారికనేగా నీ ఎదురుచూపులో..
768. మాటలు నచ్చకుంటే చెప్పొచ్చుగా..
గుణపాలతో అనవసరంగా గుచ్చుతావెందుకలా
769. పూలగాలొచ్చి నిద్దురలేపాలేమో..
మాలికలకి అలవాటుపడ్డ మనసు కదా
770. .ఊసులతోనే లేపుతాలే..
కబుర్లకి అలవాటుపడ్డ మనసు కదా..
771. లేవలేకున్నా ప్రతిసారీ..
నీ చిరునవ్వుల చెకిళ్ళగుంతలు లోతెక్కువని
772. నెలవంకైంది పెదవి..
నీ వంకలకు కిలకిలలు కురిపిస్తూ..
773. కొత్తలిపిని నేర్వాలేమో నా కనులు..
ప్రతీచూపునీ నువ్వు అలవోకగా పట్టేస్తుంటే..
774. సందెల్లో కుంకుమ నీవేనేమో..
హృదయంలో సరిగమలను చిలకరిస్తూ..
775.గుడిగంటలు సరిగమలై వినిపించాయి..
నీ తలపులే మోగాయేమో
776. పరుగాపని పయనమయ్యింది..
లక్ష్యాలనే మైలురాళ్ళను దాటడమే జీవితగమ్యంగా ..
777. పువ్వుల గుసగుసలు వింటున్నా..
నీ కవితల్లా అనిపిస్తుంటేనూ..
778. సంకీర్తనాసుమాలెన్ని పూయవచ్చో..
ఇరువురం కలిసి సాధన చేస్తే..
779. చిటపటవానలు కురిసాయి..
తొలకరి మబ్బుల ఉరుముల సవ్వడికి..
780. చెట్టుదో ఉన్నతస్వభావమేమో..
గొడ్డలి అహంకారానికి కర్రిచ్చి సాయపడుతూ..
781. మౌనవించేసా..
నీ మూగబాధ వింటుంటేనూ..
782. రుసరుసలాడకు..
నే పిలిచింది నిన్ను కాదు..
783. కలలంటే నాకెంతో ఇష్టం..
నిదురలోనైనా నన్ను నవ్విస్తాయని
784.గర్వపడుతున్న గుండె..
మకుటం పెట్టకున్నా అంకితమిచ్చిన ఆనందానికి...
785. గర్వపడుతున్న గుండె..
కన్నీటి సంద్రాలను కన్నుల్లో బంధించగలిగానని
786. గర్వపడుతున్న గుండె..
ఏకమైన రెండుగుండెల చప్పుడు వినగలిగిందని.
787. గర్వపడుతున్న గుండె..
నన్నుగా స్వీకరించిన చెలిమి తోడయ్యిందని.
788. వసంతమంతా వెన్నెలై వెలిగింది..
ఆశలకు కొత్తచివురులు తొడిగావనే..
789. కన్నీళ్ళు నిండుకున్నాయి..
రేయంతా కలవరంతో చెక్కిళ్ళను అభిషేకించి..
790. హృదయం కరిగిపోతోంది..
వెన్నెలపాళీతో లిఖించిన కవిత్వం చదివినందుకే
791. అత్యధిక సంపన్నురాలినే..
నాతో నువ్వున్నప్పుడు..
792. ఎంతదృష్టమో సుమాలకి..
వనమాలే అతిధిగా విహరిస్తూ ఓలలాడిస్తే..
793. ఆదమరుపే మరి..
నీ తలపులు వట్టివేళ్ళై పెనవేస్తుంటే
794. నా చూపుల తడబాటు చెప్పలేదు..
రెప్పలమాటున నిన్ను దాచిన నిజాన్ని..
795.కన్నీరు పొంగని కన్నులేమో అవి..
కరిమబ్బునే కాటుకగా దిద్దుకొన్న సోయగాలతో.
796. వేదనాభాష్పాలెన్నో..
నిదురలేని కన్నుల్లోనే ఆవిరైపోతూ
797. ఏ కొలువుకైనా సిద్ధమే కనులు..
నా కటుకలో నువ్వు కొలువుంటానంటే..
798. కాస్త వలపిస్తావా..
నీ ఊహల్లో వెచ్చగా ఒదిగుంటా..
799. నీ పిలుపు చాలదూ..
నే నిద్దురలోనూ ఉలిక్కిపడేందుకు..
800. నా కన్నులెంత గడుసరివో..
నీ కలాన్ని పసిగట్టి తానే ముందుగా రాసేస్తూ
..................................... ********.....................................
No comments:
Post a Comment