..................................... ********.....................................
1451. భూదేవి కొత్తపెళ్ళికూతురైనట్లుంది..
వీధంతా ముచ్చటైన ముగ్గులతో అలంకృతమైనందుకే
1452. మనసు తడి ఇప్పుడే తెలిసింది..
నీ ఊపిరి ఆవిరై తాకిందేమో.
1453. వర్తమానానికి వగలెక్కువయ్యింది..
నా నువ్వు నిత్యమూ నాతోనేనని..
1454. గతానికెంత గర్వమో..
గడుసరి కావ్యానికి నాయికను ఇచ్చినందుకు..
1455. అమరమేగా గతం నీ జ్ఞాపకాలతో..
నీవు పంచిన అమృతం తాగినందుకు..
1456. పరిమళిస్తున్నా ఇంకా
నీ గత సౌరభం అంటిందనేమో
1457. స్వగతంలో ఆశ
గతంలోనే ఉండాలనుందంటూ
1458. గమనం మందగిస్తుంది..
గతాన్ని మరిస్తే..
1459. గమనించా గతాన్ని..
ముందుకే పయనిస్తున్నానందుకే.
1460. రెప్పలమాటున దోబూచులాడుతోంది గతం..
కనుమూస్తే కలలోజారి మురిపిద్దామనే..:)
1461. జీవితం వ్యర్ధమేగా
గతం నేర్పే గుణపాఠాలు నేర్వకుంటే..
1462. నీపై అనురక్తే..విరక్తిగా మారింది..
నువ్వుదాచిన నీ గతం..అవగతమయ్యా
1463. భవిష్యత్తు బెంగలేదులే..
గతం గుచ్చకుంటే..
1464. ఆస్వాదిస్తున్నా...
గతజన్మ జ్ఞాపకామై పరిమళిస్తున్న నిన్ను..
1465. గతాన్ని అనుభూతిస్తున్నా..
జ్ఞాపకంగా నిన్నిచ్చిందని.
1466. గతం గతుక్కుమంది..
నీ భవిషత్తు ప్రణాళికలు చూసి
1467. వర్తమానాన్నే వరించా
గాయం చేసిన గతాన్ని వీడి..
1468. గతాన్ని భోగిమంటల్లో మండించేసా
జీవితపు సంక్రాంతికి అడ్డొస్తుందని..!
1469. గతం అయితేనేముంది..
కమ్మని జ్ఞాపకాన్ని కానుకచేసి దాచుకొనే హృదయం నాకుందిగా...
1470. .నీ నవ్వులే నా కన్నులపండుగలు..
వేరే సంక్రాంతులెందుకు నాకు నువ్వుండగా
1471. ఇష్టపదులే చెలి చిలిపినవ్వులు..
మదిలో గిలిగింతలరాగానికి తాళమేస్తూ
1472. గొంతు తడారిపోతోంది..
నీ అబద్దపు మాటలను జీర్ణించుకోలేక..
1473. ఆపదలు అర్ధమే కావు..
స్వీయానుభవం అయ్యేవరకూ కొందరికి
1474. గురువుకి అర్ధం మారుస్తున్నారు..
గురివిందలనీ గురువని పిలుస్తూ
1475. ఉలిపచ్చి నవ్వులతో నీ కవ్వింతలేమిటో..
పుష్యమాసపు చిమచిమలకి నే మెలికలుతిరుగుతుంటే.
1476. మౌనభావాలే ఇంత ముగ్దంగా ఉన్నాయి.
మాటల్లో జాలువారితే ఇంకెంత మధురమో..
1477. అభిమానమున్న చోటే అసూయుంటుంది..
ప్రేమని అర్ధంచేసుకునే మనసు ఉందని చెప్పకనే చెప్తూ
1478. హిమాన్నే కరిగించగలిగిన మాటలు..
ముత్యాలుగా చేసి దాచుకున్నా
1479. అతీతురాల్ని కావాలిగా..
అవకాశావాదపు ముళ్ళను తట్టుకోవాలంటే ఒడుపుగా
1480. పరవళ్ళు తొక్కిన గోదారినే నిన్నటిదాకా నేను..
నీ మౌనాన్ని ఆస్వాదిస్తూ నిలబడిపోయా నేడు
1481. అనుభూతిని అనుభవించాలంటే..
కళ్ళున్న మనసుకి మాత్రమే సాధ్యమేమో
1482. చూపులవలయంలో చుట్టేసావుగా..
నిన్ను వీడి ఎటూ పోలేక..
1483. మేఘన్నే అర్ధిస్తున్నా..
కంటినీరుని కనపడనివ్వక తనలో కలిపేసుకోమంటూ.
1484. ఏ రాగమూ సరి తూగట్లేదు..
నీ అనురాగానికి బాణీ కడదామంటే
1485. ప్రేమామృతపు రుచికదా
షడ్రుచులను మించిందేమో
1486. రుచి చూపావుగా
కన్నీటిని మాత్రమే అరాయించుకుంటోంది మనసు..
1487. గేయం నేనయ్యా...
నీ గాయానికి మందు పూయాలనే
1488. నీ హృదయం ఒక కృష్ణచంద్రోదయమే
మొదటిసారి సవ్వడిచేసిన నా రెప్పలసాక్షి..
1489. భరించేవాడే భర్త
ఎన్నిరాగాలు తీసినా అనురాగమే పంచుతూ.
1490. బారెడు పొద్దెక్కినా తూర్పున కానరాలేదు వజీరుడు
హేమంతపుచలికి ఏ గుర్రం కదలనని మొరాయించిందో.
1491. మౌనమే మర్యాదలే..
ఓదార్పు మృగ్యమైనప్పుడు.
1492. నా జీవనదికే పొంగొచ్చింది..
మేఘమై నువ్వు వర్షించినందుకే..!
1493. మనసుతోవ తెరుస్తున్నా..
మీ భావకన్యకు స్వాగతం ఇచ్చేందుకే
1494. ప్రశ్నాక్షరాలే మిగిలాయి..
జవాబులు కరువయ్యి..:(
1495. కునుకమ్మకి అలుకలు..
నీ ఊసులతో తనను రానివ్వట్లేదని..
1496. భావాల వేగిరపాటు..
తలపులవలయంలోంచి బయటపడేందుకేమో..!
1497. చూపులతో గుచ్చావనే..
తలపులు తడుముకుంటున్నాయ్.
1498. ప్రేమనిండిన మనసే...
మరొకరికి ప్రేమను విస్తారంగా పంచగలదు
1499. చిన్నచిన్న చిట్కాలు పాటిస్తే సరి..
వేదనను వేడుకగా మారాలంటే మరి..
1500. నాకెప్పుడూ స్వార్ధమే
నీ స్వార్ధమే నేను కావాలని...!
..................................... ********.....................................
1451. భూదేవి కొత్తపెళ్ళికూతురైనట్లుంది..
వీధంతా ముచ్చటైన ముగ్గులతో అలంకృతమైనందుకే
1452. మనసు తడి ఇప్పుడే తెలిసింది..
నీ ఊపిరి ఆవిరై తాకిందేమో.
1453. వర్తమానానికి వగలెక్కువయ్యింది..
నా నువ్వు నిత్యమూ నాతోనేనని..
1454. గతానికెంత గర్వమో..
గడుసరి కావ్యానికి నాయికను ఇచ్చినందుకు..
1455. అమరమేగా గతం నీ జ్ఞాపకాలతో..
నీవు పంచిన అమృతం తాగినందుకు..
1456. పరిమళిస్తున్నా ఇంకా
నీ గత సౌరభం అంటిందనేమో
1457. స్వగతంలో ఆశ
గతంలోనే ఉండాలనుందంటూ
1458. గమనం మందగిస్తుంది..
గతాన్ని మరిస్తే..
1459. గమనించా గతాన్ని..
ముందుకే పయనిస్తున్నానందుకే.
1460. రెప్పలమాటున దోబూచులాడుతోంది గతం..
కనుమూస్తే కలలోజారి మురిపిద్దామనే..:)
1461. జీవితం వ్యర్ధమేగా
గతం నేర్పే గుణపాఠాలు నేర్వకుంటే..
1462. నీపై అనురక్తే..విరక్తిగా మారింది..
నువ్వుదాచిన నీ గతం..అవగతమయ్యా
1463. భవిష్యత్తు బెంగలేదులే..
గతం గుచ్చకుంటే..
1464. ఆస్వాదిస్తున్నా...
గతజన్మ జ్ఞాపకామై పరిమళిస్తున్న నిన్ను..
1465. గతాన్ని అనుభూతిస్తున్నా..
జ్ఞాపకంగా నిన్నిచ్చిందని.
1466. గతం గతుక్కుమంది..
నీ భవిషత్తు ప్రణాళికలు చూసి
1467. వర్తమానాన్నే వరించా
గాయం చేసిన గతాన్ని వీడి..
1468. గతాన్ని భోగిమంటల్లో మండించేసా
జీవితపు సంక్రాంతికి అడ్డొస్తుందని..!
1469. గతం అయితేనేముంది..
కమ్మని జ్ఞాపకాన్ని కానుకచేసి దాచుకొనే హృదయం నాకుందిగా...
1470. .నీ నవ్వులే నా కన్నులపండుగలు..
వేరే సంక్రాంతులెందుకు నాకు నువ్వుండగా
1471. ఇష్టపదులే చెలి చిలిపినవ్వులు..
మదిలో గిలిగింతలరాగానికి తాళమేస్తూ
1472. గొంతు తడారిపోతోంది..
నీ అబద్దపు మాటలను జీర్ణించుకోలేక..
1473. ఆపదలు అర్ధమే కావు..
స్వీయానుభవం అయ్యేవరకూ కొందరికి
1474. గురువుకి అర్ధం మారుస్తున్నారు..
గురివిందలనీ గురువని పిలుస్తూ
1475. ఉలిపచ్చి నవ్వులతో నీ కవ్వింతలేమిటో..
పుష్యమాసపు చిమచిమలకి నే మెలికలుతిరుగుతుంటే.
1476. మౌనభావాలే ఇంత ముగ్దంగా ఉన్నాయి.
మాటల్లో జాలువారితే ఇంకెంత మధురమో..
1477. అభిమానమున్న చోటే అసూయుంటుంది..
ప్రేమని అర్ధంచేసుకునే మనసు ఉందని చెప్పకనే చెప్తూ
1478. హిమాన్నే కరిగించగలిగిన మాటలు..
ముత్యాలుగా చేసి దాచుకున్నా
1479. అతీతురాల్ని కావాలిగా..
అవకాశావాదపు ముళ్ళను తట్టుకోవాలంటే ఒడుపుగా
1480. పరవళ్ళు తొక్కిన గోదారినే నిన్నటిదాకా నేను..
నీ మౌనాన్ని ఆస్వాదిస్తూ నిలబడిపోయా నేడు
1481. అనుభూతిని అనుభవించాలంటే..
కళ్ళున్న మనసుకి మాత్రమే సాధ్యమేమో
1482. చూపులవలయంలో చుట్టేసావుగా..
నిన్ను వీడి ఎటూ పోలేక..
1483. మేఘన్నే అర్ధిస్తున్నా..
కంటినీరుని కనపడనివ్వక తనలో కలిపేసుకోమంటూ.
1484. ఏ రాగమూ సరి తూగట్లేదు..
నీ అనురాగానికి బాణీ కడదామంటే
1485. ప్రేమామృతపు రుచికదా
షడ్రుచులను మించిందేమో
1486. రుచి చూపావుగా
కన్నీటిని మాత్రమే అరాయించుకుంటోంది మనసు..
1487. గేయం నేనయ్యా...
నీ గాయానికి మందు పూయాలనే
1488. నీ హృదయం ఒక కృష్ణచంద్రోదయమే
మొదటిసారి సవ్వడిచేసిన నా రెప్పలసాక్షి..
1489. భరించేవాడే భర్త
ఎన్నిరాగాలు తీసినా అనురాగమే పంచుతూ.
1490. బారెడు పొద్దెక్కినా తూర్పున కానరాలేదు వజీరుడు
హేమంతపుచలికి ఏ గుర్రం కదలనని మొరాయించిందో.
1491. మౌనమే మర్యాదలే..
ఓదార్పు మృగ్యమైనప్పుడు.
1492. నా జీవనదికే పొంగొచ్చింది..
మేఘమై నువ్వు వర్షించినందుకే..!
1493. మనసుతోవ తెరుస్తున్నా..
మీ భావకన్యకు స్వాగతం ఇచ్చేందుకే
1494. ప్రశ్నాక్షరాలే మిగిలాయి..
జవాబులు కరువయ్యి..:(
1495. కునుకమ్మకి అలుకలు..
నీ ఊసులతో తనను రానివ్వట్లేదని..
1496. భావాల వేగిరపాటు..
తలపులవలయంలోంచి బయటపడేందుకేమో..!
1497. చూపులతో గుచ్చావనే..
తలపులు తడుముకుంటున్నాయ్.
1498. ప్రేమనిండిన మనసే...
మరొకరికి ప్రేమను విస్తారంగా పంచగలదు
1499. చిన్నచిన్న చిట్కాలు పాటిస్తే సరి..
వేదనను వేడుకగా మారాలంటే మరి..
1500. నాకెప్పుడూ స్వార్ధమే
నీ స్వార్ధమే నేను కావాలని...!
..................................... ********.....................................
No comments:
Post a Comment