..................................... ********.....................................
1751. అరవిందునికీ ఆనందమేగా..
అరవిరిసిన మోములో చిత్రాలను చూసేందుకు..
1752. వసంతం వెల్లువై అల్లుకుంది..
ఆనందాన్ని మారాకు వేయించాలనే..
1753. చెదిరిన కాటుకకే తెలుసు..
నీ చూపు కలిసిన వేళ చంద్రశీతల స్పర్శానుభవం..
1754. ఆ మాలికదెంత అదృష్టమో..
నీచూపుల నవనీతాలు పూసుకున్నందుకు
1755. సంతోషానికి సంతకం చేసేసా..
నీ ఆచూకీ తెలిసిందనే..
1756. సంతోషానికి చిరునామా నువ్వేగా..
ఏ దేశం తిరిగినా నా మనసునైతే పదిలమేగా..
1757. ఏకాంతాన్ని అనుభవిస్తున్నా..
మనసు మరోలోకంలో జంటగా విహరిస్తున్నందుకే..
1758. ఆర్ద్రతకు అర్ధం చెప్పావు..
కంటిబొట్టుకీ అస్తిత్వం ఆపాదించి..
1759. ఆలోచన అప్పుడే సఫలము..
అపోహలు లేని ఆచరణయోగ్యమైతే..
1760. సవతిప్రేమ మిగిలింది తల్లిబాషకు..
పరాయిభాష కొంగునే పట్టుకుంటే..
1761. ఆకళ్ళ ఆకలి తీర్చలేము..
మనసు దాటి ముందుకెళ్తుంటే..
1762. జ్ఞాపకాలు పరిహసిస్తున్నాయి..
నీ సంతోషానికి సుప్రభాతమే కరువయ్యిందని..
1763. అరచేతి రేఖలనే ముద్దాడుకున్నా..
నీ భాగ్యమంటూ పరిచయించాయనే..
1764. నీ మనసు స్పష్టమే..
ప్రియమంటూ చేరదీసే కొద్దీ..
1765. నన్ను నేనే మరచిపోయా..
నీ సంతోషం నేనయ్యాక..
1766. నీ గానానికి పరవశించా..
వేణువులో దూరిన వెర్రిగాలినీ వెంటేసుకు నాకై పాడావనే..
1767. నాకు మాత్రమే తెలిసిన నిజం..
మన లోకమో అందాల బృందావనమని..
1768. కలలన్నీ కానుకలే..
స్వీకరించే మనసుంటే ఇలలోనూ స్వర్గాలే..
1769. గుండె కుండపోతయ్యింది..
కన్నీటి మబ్బులను మోయలేక వర్షించినందుకే..
1770. పలకరించేలోపే పరుగెత్తిపోయింది..
ఇందాకే ఇటొచ్చిన నీ మనసు..
1771. నిదానించి గమ్యం చేరాలంటే..
జారకుండా పైపైకి దృష్టినిలుపుతూ..
1772. మనసు నా మాటే విననంటోంది..
మనోచోరిడితో రహస్యాలను పంచుకొనే వేళయ్యిందంటూ..
1773. అక్షరాలని అలంకరించా..
నీ గీతానికి అనుపల్లవిగా అందొస్తాయనే..
1774. మనసు ఒంటరే..
నీవున్నప్పుడు ఆదమరచి లేనప్పుడు నిట్టూర్చుతూ..
1775. నవ్వులన్నీ ఏం చేయమంటావ్..
సాయంత్రానికి వడిలిపోయాయని విసిరేయలేనుగా..
1776. ఆ మాత్రం గాయాలు కావాలేమో..
జీవితాంతం గేయలు రాస్తూ గడపాలంటే..
1777. ఉత్త్తుంగతరంగాలే జ్ఞాపకాలు..
కంటిచివరే సాగరసంగమాలు గావించాలని భావిస్తూ..
1778. కనకమెన్నడూ కనుమరుగవ్వదు..
ప్రేమను అక్షయమై వెల్లడిస్తున్నంత కాలము..
1779. మసకేసి మునిగిపోయా..
ఎడారిలో ఉన్నానంటూ ఇసకలా కురిసినందుకే..
1780. ఎడారిలోనూ చలేస్తోంది..
నీ మనసొలికించే ఆర్ద్రతని తాగి..!
1781. ఇసుకపూలు పూసాక నమ్ముతున్నా..
ఎడారంటి మనసూ చిగురిస్తుందని..
1782. నీ మనసు స్పష్టమే..
ప్రియమంటూ చేరదీసే కొద్దీ
1783. నన్ను నేనే మరచిపోయా..
నీ సంతోషం నేనయ్యాక
1784. మరోలోకముందని తెలియనేలేదు..
అనుమతిలేక నువ్వు మదిని ఆక్రమించేవరకూ..
1785. అంతులేని తాపత్రయమే నీది..
ఒక మనుసుని ఎడారిచేసి మరోచోట కడలిని చేస్తానంటూ..
1786. శ్యామలమైన నేత్రాలేగా..
ఎడారివంటి మనసుకి సజలాలను పంచకపోయుంటే..
1787. ఎడారిపువ్వును మరపించాయి..
సూటిగా మనసును గుచ్చేస్తూ నీ పెదవంచు నవ్వులు..
1788. ఎడారిలో చిక్కుకుపోయినట్లున్నా..
నీ తలపుల దారుల్లో నన్నెతుక్కుంటూ..
1789. శూన్యాకాశం సమమయ్యింది..
ఎడారంటి నా మనసుతో పోల్చుకుంటే..
1790. ఎడారిలో ఉన్నానని మరచిపోయా..
నీ పిలుపులు నాలో అంతర్లీనమై అదేపనిగా ప్రతిధ్వనిస్తుంటే..
1791. మహార్ణవమంటి శూన్యమేమో నీది..
మదిని ఎడారిలోకి పిలుచుకెళ్ళిందంటే..
1792. కన్నీరెందుకో ఆరిపోయింది..
ఎడారితో నువ్వొక్కసారి పోల్చగానే తడబడిపోయి..
1793. ఎడారిలోనూ బ్రతకగలిగేది ఒంటొక్కటే..
నిర్లిప్తతను తన అడుగుల్లో దాచేస్తూ ముందుకే పరుగేస్తూ..
1794. ఎడారి ఇసుక నునుపే మరి..
సైకతశిల్పం చేసే పట్టుదలే నీకుంటే..
1795. నిన్నటిదాకా ఎడారికోయిలనే..
నీ వలపు మేఘమై కురిసి వానకోయిలగా మార్చేసిందిగా..
1796. జాబిలి సంతకం మెరుస్తోంది..
పెదవులపై ప్రేమగా ముద్రించావనే..
1797. సహనం చేదవుతోంది..
నీ నిరీక్షణలో క్షణాలు యుగాలవుతుంటే..
1798. మనసు బరువయ్యింది..
విషాదమైన రాలినరెక్కల వీడ్కోలు చూసి..
1799. ప్రకృతిని ఆస్వాదించే మనసేమో నీది..
ఎడారిలో లేని పచ్చదనాన్ని ఊహిస్తూ..
1800. మరలా జీవిస్తున్నా..
మౌనమైన నీ నిశ్వాస పలకరింపుల్లో..
..................................... ********.....................................
1751. అరవిందునికీ ఆనందమేగా..
అరవిరిసిన మోములో చిత్రాలను చూసేందుకు..
1752. వసంతం వెల్లువై అల్లుకుంది..
ఆనందాన్ని మారాకు వేయించాలనే..
1753. చెదిరిన కాటుకకే తెలుసు..
నీ చూపు కలిసిన వేళ చంద్రశీతల స్పర్శానుభవం..
1754. ఆ మాలికదెంత అదృష్టమో..
నీచూపుల నవనీతాలు పూసుకున్నందుకు
1755. సంతోషానికి సంతకం చేసేసా..
నీ ఆచూకీ తెలిసిందనే..
1756. సంతోషానికి చిరునామా నువ్వేగా..
ఏ దేశం తిరిగినా నా మనసునైతే పదిలమేగా..
1757. ఏకాంతాన్ని అనుభవిస్తున్నా..
మనసు మరోలోకంలో జంటగా విహరిస్తున్నందుకే..
1758. ఆర్ద్రతకు అర్ధం చెప్పావు..
కంటిబొట్టుకీ అస్తిత్వం ఆపాదించి..
1759. ఆలోచన అప్పుడే సఫలము..
అపోహలు లేని ఆచరణయోగ్యమైతే..
1760. సవతిప్రేమ మిగిలింది తల్లిబాషకు..
పరాయిభాష కొంగునే పట్టుకుంటే..
1761. ఆకళ్ళ ఆకలి తీర్చలేము..
మనసు దాటి ముందుకెళ్తుంటే..
1762. జ్ఞాపకాలు పరిహసిస్తున్నాయి..
నీ సంతోషానికి సుప్రభాతమే కరువయ్యిందని..
1763. అరచేతి రేఖలనే ముద్దాడుకున్నా..
నీ భాగ్యమంటూ పరిచయించాయనే..
1764. నీ మనసు స్పష్టమే..
ప్రియమంటూ చేరదీసే కొద్దీ..
1765. నన్ను నేనే మరచిపోయా..
నీ సంతోషం నేనయ్యాక..
1766. నీ గానానికి పరవశించా..
వేణువులో దూరిన వెర్రిగాలినీ వెంటేసుకు నాకై పాడావనే..
1767. నాకు మాత్రమే తెలిసిన నిజం..
మన లోకమో అందాల బృందావనమని..
1768. కలలన్నీ కానుకలే..
స్వీకరించే మనసుంటే ఇలలోనూ స్వర్గాలే..
1769. గుండె కుండపోతయ్యింది..
కన్నీటి మబ్బులను మోయలేక వర్షించినందుకే..
1770. పలకరించేలోపే పరుగెత్తిపోయింది..
ఇందాకే ఇటొచ్చిన నీ మనసు..
1771. నిదానించి గమ్యం చేరాలంటే..
జారకుండా పైపైకి దృష్టినిలుపుతూ..
1772. మనసు నా మాటే విననంటోంది..
మనోచోరిడితో రహస్యాలను పంచుకొనే వేళయ్యిందంటూ..
1773. అక్షరాలని అలంకరించా..
నీ గీతానికి అనుపల్లవిగా అందొస్తాయనే..
1774. మనసు ఒంటరే..
నీవున్నప్పుడు ఆదమరచి లేనప్పుడు నిట్టూర్చుతూ..
1775. నవ్వులన్నీ ఏం చేయమంటావ్..
సాయంత్రానికి వడిలిపోయాయని విసిరేయలేనుగా..
1776. ఆ మాత్రం గాయాలు కావాలేమో..
జీవితాంతం గేయలు రాస్తూ గడపాలంటే..
1777. ఉత్త్తుంగతరంగాలే జ్ఞాపకాలు..
కంటిచివరే సాగరసంగమాలు గావించాలని భావిస్తూ..
1778. కనకమెన్నడూ కనుమరుగవ్వదు..
ప్రేమను అక్షయమై వెల్లడిస్తున్నంత కాలము..
1779. మసకేసి మునిగిపోయా..
ఎడారిలో ఉన్నానంటూ ఇసకలా కురిసినందుకే..
1780. ఎడారిలోనూ చలేస్తోంది..
నీ మనసొలికించే ఆర్ద్రతని తాగి..!
1781. ఇసుకపూలు పూసాక నమ్ముతున్నా..
ఎడారంటి మనసూ చిగురిస్తుందని..
1782. నీ మనసు స్పష్టమే..
ప్రియమంటూ చేరదీసే కొద్దీ
1783. నన్ను నేనే మరచిపోయా..
నీ సంతోషం నేనయ్యాక
1784. మరోలోకముందని తెలియనేలేదు..
అనుమతిలేక నువ్వు మదిని ఆక్రమించేవరకూ..
1785. అంతులేని తాపత్రయమే నీది..
ఒక మనుసుని ఎడారిచేసి మరోచోట కడలిని చేస్తానంటూ..
1786. శ్యామలమైన నేత్రాలేగా..
ఎడారివంటి మనసుకి సజలాలను పంచకపోయుంటే..
1787. ఎడారిపువ్వును మరపించాయి..
సూటిగా మనసును గుచ్చేస్తూ నీ పెదవంచు నవ్వులు..
1788. ఎడారిలో చిక్కుకుపోయినట్లున్నా..
నీ తలపుల దారుల్లో నన్నెతుక్కుంటూ..
1789. శూన్యాకాశం సమమయ్యింది..
ఎడారంటి నా మనసుతో పోల్చుకుంటే..
1790. ఎడారిలో ఉన్నానని మరచిపోయా..
నీ పిలుపులు నాలో అంతర్లీనమై అదేపనిగా ప్రతిధ్వనిస్తుంటే..
1791. మహార్ణవమంటి శూన్యమేమో నీది..
మదిని ఎడారిలోకి పిలుచుకెళ్ళిందంటే..
1792. కన్నీరెందుకో ఆరిపోయింది..
ఎడారితో నువ్వొక్కసారి పోల్చగానే తడబడిపోయి..
1793. ఎడారిలోనూ బ్రతకగలిగేది ఒంటొక్కటే..
నిర్లిప్తతను తన అడుగుల్లో దాచేస్తూ ముందుకే పరుగేస్తూ..
1794. ఎడారి ఇసుక నునుపే మరి..
సైకతశిల్పం చేసే పట్టుదలే నీకుంటే..
1795. నిన్నటిదాకా ఎడారికోయిలనే..
నీ వలపు మేఘమై కురిసి వానకోయిలగా మార్చేసిందిగా..
1796. జాబిలి సంతకం మెరుస్తోంది..
పెదవులపై ప్రేమగా ముద్రించావనే..
1797. సహనం చేదవుతోంది..
నీ నిరీక్షణలో క్షణాలు యుగాలవుతుంటే..
1798. మనసు బరువయ్యింది..
విషాదమైన రాలినరెక్కల వీడ్కోలు చూసి..
1799. ప్రకృతిని ఆస్వాదించే మనసేమో నీది..
ఎడారిలో లేని పచ్చదనాన్ని ఊహిస్తూ..
1800. మరలా జీవిస్తున్నా..
మౌనమైన నీ నిశ్వాస పలకరింపుల్లో..
..................................... ********.....................................
No comments:
Post a Comment