..................................... ********.....................................
2051. నీ పిలుపు స్పందిస్తూ నేను..
మకరందపు తీయదనాన్ని మదిలో చవిచూస్తూ..
2052. మాట జారే కాలం పోయింది..
మాట మార్చే కాలానికి చోటిచ్చి..
2053. ఆకాశం పరిమళిస్తోంది..
వేకువ మల్లెపువ్వుతో నన్ను పోల్చినందుకే.
2054. నిద్దురపొద్దులు మేలుకొనే ఉన్నా..
నీ అనుభూతులు ఆవహించినందుకేనేమో..
2055. కోయిలకు కబురెట్టానందుకే..
శిశిరంలోనూ వసంతాన్ని నీకు వినిపిస్తుందని..
2056. తన పరిచయమొక హేమంతం..
సిగ్గుతో తనువును తొణికిస్తూ..
2057. మృగతృష్ణే మిగులుతోంది విద్యావంతులకు..
ప్రతిభను ప్రోత్సహించలేని నేటిసమాజంలో..
2058. అక్షరంతో పడేసానందుకే..
అందానికి నువ్వు లొంగేరకం కాదని..
2059. శిశిరంలో మునిగిపోయావు..
తుదికైనా వాసంతాన్ని గమనించిన నువ్వు..
2060. నిన్నునువ్వు మెచ్చుకుంటే వింతేముంది..
ఎదుటివారు నచ్చుకుంటే కిక్కుగాని..
2061. అక్షరానికి అభిషేకం..
మాలికలలో అరుదైన సువర్ణ పట్టాభిషేకం..
2062. గంజాయివనంలో తులసివని గ్రహించి ఉంటాడు..
విలువైన అక్షరాలను మాకు కానుకివ్వలని..
2063. నవ్విన నాపచేను ఎదుగుతుందిలే..
ఇసుకపూల సువాసన మనసునంటేలా..
2064. జీవించే ఉంటానుగా..
నే మరణించినా నీ జ్ఞాపకాలో మరపురాని అక్షరసజీవమై..
2065. వెలిగితే బాగుండు..
పేదవాడు కోరుకున్న తిందిగింజల అక్షయపాత్ర..
2066. చదివే మనసుకూ తీపంటింది..
పూతరేకులుగా పుస్తకపుటలను మలచావనే..
2067. పాదరసాన్ని పట్టించావేమో అందాల జాబిల్లికి..
నాలా మారి నీలో దాగాలని..
2068. అపరాజితయ్యింది ఆమె..
మరో కడుపుకోత చూడలేక చేయూతనిస్తూ..
2069. నీ ఊసూలలోనూ నేనేగా..
రేపొద్దులు ఊయలూగిస్తూ నిన్ను..
2070. కన్నులతో నవ్వుతావెందుకలా..
పెదవులు అలకపూని నీకు సహకరించనందుకా..
2071. నీ కన్నుల్లో నేను..
కొనఊపిరి మిగిలున్న జీవంలా..
2072. రాలిపోయే వసంతాలెన్నో..
శిశిరానికి మోజుపడి..
2073. నీ చూపుల చంద్రహారం మెరుస్తోందిగా..
నా కంఠసీమను సౌందర్యవనముగా మారుస్తూ..
2074. తీగ తెగిన వీణలా నేను..
రాగాలు మరచి రాలుగాయిలా మిగిలిపోతూ..
2075. అనుభూతివై మిగిలావెందుకో నాలో..
ప్రేమను చూపమని అడిగినందుకేనా..
2076. పోట్లాడి ఓడిపోయాయిగా..
నిన్ను మించలేని నా చూపులు..
2077. మాటలతో గాయాలెందుకులే..
మదిలోని అశ్రువులు అనంతమై ప్రవహించేలా..
2078. మృత్యుకిరీటం సంగతి మరచినందుకేమో..
సింహాసనం అలంకరించినందుకు అబ్బురపడుతూ..
2079. ఎగిసిపడుతున్న మనసు..
దారితప్పిన వసంతాన్ని అన్వేషించి అలసినందుకే..
2080. ఉన్నంతసేపూ నేనంటే అలుసేగా..
కనీసం లేనప్పుడు గుర్తుచేసుకుంటావని..
2081. గాయపడిన కలలకే తెలుసు..
కన్నుల్లోకురిసిన రుధిరస్రావాల భాష్యాలు..
2082. కలలు నిద్దుర లేస్తున్నాయి..
కునుకుపట్టినా మనసుకు కుదురివ్వకుండా..
2083. మన్ను తిన్న పాముగా మారిపోతున్నా..
నీ మాయదారి కబుర్లు వినలేక..
2084. నీరవంలోని నవ్వులు నావే..
నీ మౌనాన్ని చెదరగొట్టాలని..
2085. పడిలేచే కరటం కావాలి..
ఉదుకునెత్తురు ఉరకలు తెలియాలంటే,..
2086. మనసు మాత్రం విడిచిపెట్టకు..
ఆ నలుగురికీ దగ్గరవుతూ..
2087. బొట్టుబొట్టులో నా రూపమే..
నీ ఆనందభాష్పాలకి భాష్యమవుతూ..
2088. గడ్డిపువ్వు అస్తిత్వం తెలియని కొందరు..
కాలికింద నలిగినా చూసుకోని అల్పులు..
2089. ఎటుపోతోందో కౄరత్వం..
ఆధునిక సమాజానికి సవాలు విసురుతూ..
2090. అంతర్జాలమొక అందమైనలోకమే..
కోరినంతనే కన్నులకు విశ్వవీక్షణం చేయిస్తూ..
2091. కలతలకు కొదవేముందిలే..
కాటుకకన్నులకు నువ్వు కన్నీటి కానుకలిచ్చాక
2092. వలపుగాయాల వాసంతికనే..
శిశిరంలో నన్నిడిచిపోయాక..
2093. ఋతువుల రుచులకై వేచుండు..
శిశిరం శాశ్వతం కాదులే..
2094. వెన్నెలతునకలే..
నీ తీపిగుర్తులు మనసుకు మరకలైనా..
2095. మీ మనసెంత గొప్పదో..
మాలికలు రాలినా దారమవుతానంటూ..
2096. అనుమానం ఎక్కువవుతోంది..
ప్రేమనే మొదటిమెట్టు ఎక్కే తాపత్రయంలో..
2097. అమృతపుజల్లే అది..
తలపులనే పన్నీటిగా మార్చి కురుస్తూ..
2098. అక్షరాలూ కుసుమించునులే..
మనసనే సిరాతో రాయగా పూయగలిగితే..
2099. పసిడిపాలవెల్లిగా ఎదురొచ్చావుగా..
వేరేతలపులతో పనేముందని..
2100. అలసిపోయేలా చేస్తావెందుకలా..
అతివ అలుకను అలవోకగా తీర్చేయక..
..................................... ********.....................................
2051. నీ పిలుపు స్పందిస్తూ నేను..
మకరందపు తీయదనాన్ని మదిలో చవిచూస్తూ..
2052. మాట జారే కాలం పోయింది..
మాట మార్చే కాలానికి చోటిచ్చి..
2053. ఆకాశం పరిమళిస్తోంది..
వేకువ మల్లెపువ్వుతో నన్ను పోల్చినందుకే.
2054. నిద్దురపొద్దులు మేలుకొనే ఉన్నా..
నీ అనుభూతులు ఆవహించినందుకేనేమో..
2055. కోయిలకు కబురెట్టానందుకే..
శిశిరంలోనూ వసంతాన్ని నీకు వినిపిస్తుందని..
2056. తన పరిచయమొక హేమంతం..
సిగ్గుతో తనువును తొణికిస్తూ..
2057. మృగతృష్ణే మిగులుతోంది విద్యావంతులకు..
ప్రతిభను ప్రోత్సహించలేని నేటిసమాజంలో..
2058. అక్షరంతో పడేసానందుకే..
అందానికి నువ్వు లొంగేరకం కాదని..
2059. శిశిరంలో మునిగిపోయావు..
తుదికైనా వాసంతాన్ని గమనించిన నువ్వు..
2060. నిన్నునువ్వు మెచ్చుకుంటే వింతేముంది..
ఎదుటివారు నచ్చుకుంటే కిక్కుగాని..
2061. అక్షరానికి అభిషేకం..
మాలికలలో అరుదైన సువర్ణ పట్టాభిషేకం..
2062. గంజాయివనంలో తులసివని గ్రహించి ఉంటాడు..
విలువైన అక్షరాలను మాకు కానుకివ్వలని..
2063. నవ్విన నాపచేను ఎదుగుతుందిలే..
ఇసుకపూల సువాసన మనసునంటేలా..
2064. జీవించే ఉంటానుగా..
నే మరణించినా నీ జ్ఞాపకాలో మరపురాని అక్షరసజీవమై..
2065. వెలిగితే బాగుండు..
పేదవాడు కోరుకున్న తిందిగింజల అక్షయపాత్ర..
2066. చదివే మనసుకూ తీపంటింది..
పూతరేకులుగా పుస్తకపుటలను మలచావనే..
2067. పాదరసాన్ని పట్టించావేమో అందాల జాబిల్లికి..
నాలా మారి నీలో దాగాలని..
2068. అపరాజితయ్యింది ఆమె..
మరో కడుపుకోత చూడలేక చేయూతనిస్తూ..
2069. నీ ఊసూలలోనూ నేనేగా..
రేపొద్దులు ఊయలూగిస్తూ నిన్ను..
2070. కన్నులతో నవ్వుతావెందుకలా..
పెదవులు అలకపూని నీకు సహకరించనందుకా..
2071. నీ కన్నుల్లో నేను..
కొనఊపిరి మిగిలున్న జీవంలా..
2072. రాలిపోయే వసంతాలెన్నో..
శిశిరానికి మోజుపడి..
2073. నీ చూపుల చంద్రహారం మెరుస్తోందిగా..
నా కంఠసీమను సౌందర్యవనముగా మారుస్తూ..
2074. తీగ తెగిన వీణలా నేను..
రాగాలు మరచి రాలుగాయిలా మిగిలిపోతూ..
2075. అనుభూతివై మిగిలావెందుకో నాలో..
ప్రేమను చూపమని అడిగినందుకేనా..
2076. పోట్లాడి ఓడిపోయాయిగా..
నిన్ను మించలేని నా చూపులు..
2077. మాటలతో గాయాలెందుకులే..
మదిలోని అశ్రువులు అనంతమై ప్రవహించేలా..
2078. మృత్యుకిరీటం సంగతి మరచినందుకేమో..
సింహాసనం అలంకరించినందుకు అబ్బురపడుతూ..
2079. ఎగిసిపడుతున్న మనసు..
దారితప్పిన వసంతాన్ని అన్వేషించి అలసినందుకే..
2080. ఉన్నంతసేపూ నేనంటే అలుసేగా..
కనీసం లేనప్పుడు గుర్తుచేసుకుంటావని..
2081. గాయపడిన కలలకే తెలుసు..
కన్నుల్లోకురిసిన రుధిరస్రావాల భాష్యాలు..
2082. కలలు నిద్దుర లేస్తున్నాయి..
కునుకుపట్టినా మనసుకు కుదురివ్వకుండా..
2083. మన్ను తిన్న పాముగా మారిపోతున్నా..
నీ మాయదారి కబుర్లు వినలేక..
2084. నీరవంలోని నవ్వులు నావే..
నీ మౌనాన్ని చెదరగొట్టాలని..
2085. పడిలేచే కరటం కావాలి..
ఉదుకునెత్తురు ఉరకలు తెలియాలంటే,..
2086. మనసు మాత్రం విడిచిపెట్టకు..
ఆ నలుగురికీ దగ్గరవుతూ..
2087. బొట్టుబొట్టులో నా రూపమే..
నీ ఆనందభాష్పాలకి భాష్యమవుతూ..
2088. గడ్డిపువ్వు అస్తిత్వం తెలియని కొందరు..
కాలికింద నలిగినా చూసుకోని అల్పులు..
2089. ఎటుపోతోందో కౄరత్వం..
ఆధునిక సమాజానికి సవాలు విసురుతూ..
2090. అంతర్జాలమొక అందమైనలోకమే..
కోరినంతనే కన్నులకు విశ్వవీక్షణం చేయిస్తూ..
2091. కలతలకు కొదవేముందిలే..
కాటుకకన్నులకు నువ్వు కన్నీటి కానుకలిచ్చాక
2092. వలపుగాయాల వాసంతికనే..
శిశిరంలో నన్నిడిచిపోయాక..
2093. ఋతువుల రుచులకై వేచుండు..
శిశిరం శాశ్వతం కాదులే..
2094. వెన్నెలతునకలే..
నీ తీపిగుర్తులు మనసుకు మరకలైనా..
2095. మీ మనసెంత గొప్పదో..
మాలికలు రాలినా దారమవుతానంటూ..
2096. అనుమానం ఎక్కువవుతోంది..
ప్రేమనే మొదటిమెట్టు ఎక్కే తాపత్రయంలో..
2097. అమృతపుజల్లే అది..
తలపులనే పన్నీటిగా మార్చి కురుస్తూ..
2098. అక్షరాలూ కుసుమించునులే..
మనసనే సిరాతో రాయగా పూయగలిగితే..
2099. పసిడిపాలవెల్లిగా ఎదురొచ్చావుగా..
వేరేతలపులతో పనేముందని..
2100. అలసిపోయేలా చేస్తావెందుకలా..
అతివ అలుకను అలవోకగా తీర్చేయక..
..................................... ********.....................................
No comments:
Post a Comment