..................................... ********.....................................
2751. నీ చూపొక్కటీ చెప్పేసిందిలే..
నా క్షేమాన్ని కాంక్షిస్తున్నావని..
2752. నిన్నటికి నువ్వో అతిథివే..
నేటికి నాకు ఆధారమైపోతూ..
2753. నాలో నేను..
అనురాగంలో మమేకమైపోతూ..
2754. ఆనందభాష్పానివే..
సంతోషానికి పుట్టి సమ్యోగంలోనే ఆవిరైపోతూ..
2755. మౌనాన్ని సాగనంపమంటున్నా..
రసమయ సరసాక్షరాలతో సావాసం చేయిద్దామని..
2756. నీ కన్నుల్లోనే దాగాలనుంది నాకు..
భాష్పమై రాల్చినా ముత్యమై మెరుస్తాననే..
2757. విసిరేసా విరహాన్ని..
శూన్యాన్ని పరిచయించి మౌనాన్ని మోహిస్తోందని
2758. లక్ష్యం మరచిన ఆశ..
నిలకడలేని నిర్ణయంలో కొట్టుమిట్టాడుతూ..
2759. ధవళ మందహాసం..
వెన్నెల నీ పెదవులను అలంకరించినందుకే..
2760. మనోదర్పణం మెరిసేదప్పుడే..
నిజమైన నేస్తాన్ని మనసు గుర్తించినప్పుడు..
2761. నీ గుండెచప్పుళ్ళే..
నా పెదవులపై నర్తించే స్వరాలవెల్లువలు
2762. ఎదురుచూపుల తొందరలు..
నీ రాకకై నన్ను గిలిగింతలుపెడ్తూ
2763. చూపులన్నీ చిత్రాలయ్యాయి...
నీ కనుల్లోని కిరణాలు సోకినందుకే..
2764. సంపెంగ సువాసనతోనే తెలిసింది..
నీ పరిమళాన్ని వియోగంతో మిళితం చేసి వెళ్ళావని...
2765. శిల్పముగా మారిపోవాలనుకున్నా..
అక్షరమవసరం లేకనే గుర్తించేవారు కొందరుంటారని..
2766. కవిత్వమంటేనే కోయిల కూజితం..
వసంతానికై వేచి చూసే అరమోడ్పుల ఆమని ఆరాటం..
2767. మూర్తీభవించిన వాస్తవమే నీవు..
మౌనరాగపు సమ్యోగంలోని శూన్యంలా..
2768. ఎన్ని వర్తమానాలు ఉరకలెత్తాలో..
రేపటి దీపావళి వెలగాలంటే..
2769. పువ్వువని గుర్తించానది చాలదా...
అక్కర్లేని అసంతృప్తిని మోయడమెందుకు..
2770. పెదవులు పలుకలేని బాసలే కొన్ని..
నా చూపులతోనే కబురంపా నిన్నందుకోమని..
2771. మనసు ఆదేశించినందుకేమో..
మౌనం కరిగి కన్నీరై ప్రవహిస్తూ..
2772. మందారాలు గుర్తుకొచ్చాయి..
సిగ్గుపడ్డ బుగ్గలు సొట్టలు పడ్డప్పుడల్లా..
2773. మరుమల్లె నవ్వుకే మైమరచిపోతున్నా..
నిన్ను జ్ఞప్తికి తెచ్చిందనే
2774. మనసుకదేగా మైమరపు..
అనుభూతిని ఊహాల్లో నింపుకొని ఆనందించడం..
2775. చినుకై కురిసింది వెన్నెల..
నిశీధిని నిలువెల్లా తడపాలనే..
2776. నిజం ఇజంలో మగ్గుతోంది..
అబద్దం ప్రవచనం చేసొస్తుంటే..
2777. పున్నమి వెన్నెలైనా వేడెక్కాల్సిందే..
నీ మాటల ఇంద్రజాలానికి..
2778. తీరమెరుగని పయనమే..
నిండుగా ప్రవహిస్తున్న నదిలో కొట్టుకుపోతూ..
2779. విషాదమైన నా వియోగమే..
వసంతంలోనూ గ్రీష్మాన్నే స్మరిస్తూ..
2780. వెన్నెలతునకనై నీదరి చేరానందుకే..
మదిలోని నిశీధిని తరిమేయాలనే..
2781. నీ హృదయం ఆల్చిప్పై ఆదుకుంది..
నీటిబొట్టును ముత్యంగా మార్చి మెరిపిస్తూ..
2782. చంద్రోదయాన్ని మరచినట్లున్నావు..
నా కన్నుల్లోకి తొంగి చూడలేదని..
2783. రాయినైన నన్ను జవరాలిగా చేసావుగా..
నీ ఊపిరితో నాలో ప్రాణంపోసి..
2784. ఓడిద్దామని వచ్చానంటావే..
మాలికలతో మురిపిద్దామని నిద్దుర మానుకున్నందుకేనా...
2785. ఒక్కక్షణమే..
కూడుకున్న వాటిని తీసివేతలుగా మార్చగలదు..
2786. సందేహమవసరమే లేదు..
వీడలేని చిక్కుముళ్ళై సమస్య చుట్టుముడుతుంటే..
2787. తరలిపోయే ఆనందాలెన్నో..
మధురక్షణాలను వేళ్ళపై లెక్కిస్తూ కూర్చుంటుంటే
2788. వక్రభాష్యాలెన్నో..
అర్ధాలకే నానార్ధాలను వెతికేస్తూ..
2789. కలభాషిణిగా మార్చేసావు..
నీ ప్రతికధలో నాయికగా మార్చేస్తూ..
2790. శృతి చేసిన రసధునివయ్యావుగా..
నే రాసిన ప్రతిపాటలో నువ్వే పల్లవిగా మారి..
2791. వెన్నెలకే గుబులు పుట్టిస్తావు..
అమాసలన్నీ పున్నములుగా మార్చేస్తూ..
2792. కావ్యాలంకారమైపోయా..
నీ ప్రతిస్పందనలో నే నిండిపోయినందుకేమో..
2793. నిన్నల్లో ఆగిన కల..
రేపటిని ఊహించనివ్వని వర్తమానంలో..
2794. పూటకో వేషం తప్పదేమో..
ఆనందాన్ని అనుక్షణం తూచాలనుకుంటే..
2795. మౌనపంజరంలో ఎన్నాళ్ళుంటావో..
శిశిరమెళ్ళి శరత్తును నీకు విడిచిపెట్టినా
2796. మణిమాలికతోనే ఆపేసావెందుకో..
నవలగా నన్ను రాస్తావని ఎదురుచూస్తుంటే.
2797. సందడి చేస్తున్న కలలు..
రాతిరైతే నీలో నర్తించాలని..
2798. ప్రేమ గుడ్డిదంటూ నా వెంటపడ్డావుగా..
ఇప్పుడు మూగగా మారానని వేదనెందుకు..
2799. నా బుగ్గలకి సొట్టలెందుకో..
నవ్వింది నీ పెదవులైతే..
2800. సాయంత్రపు సూర్యుడిలా సంకటమెందుకు..
తిరిగి రేపు ఉదయిస్తావుగా..
..................................... ********.....................................
2751. నీ చూపొక్కటీ చెప్పేసిందిలే..
నా క్షేమాన్ని కాంక్షిస్తున్నావని..
2752. నిన్నటికి నువ్వో అతిథివే..
నేటికి నాకు ఆధారమైపోతూ..
2753. నాలో నేను..
అనురాగంలో మమేకమైపోతూ..
2754. ఆనందభాష్పానివే..
సంతోషానికి పుట్టి సమ్యోగంలోనే ఆవిరైపోతూ..
2755. మౌనాన్ని సాగనంపమంటున్నా..
రసమయ సరసాక్షరాలతో సావాసం చేయిద్దామని..
2756. నీ కన్నుల్లోనే దాగాలనుంది నాకు..
భాష్పమై రాల్చినా ముత్యమై మెరుస్తాననే..
2757. విసిరేసా విరహాన్ని..
శూన్యాన్ని పరిచయించి మౌనాన్ని మోహిస్తోందని
2758. లక్ష్యం మరచిన ఆశ..
నిలకడలేని నిర్ణయంలో కొట్టుమిట్టాడుతూ..
2759. ధవళ మందహాసం..
వెన్నెల నీ పెదవులను అలంకరించినందుకే..
2760. మనోదర్పణం మెరిసేదప్పుడే..
నిజమైన నేస్తాన్ని మనసు గుర్తించినప్పుడు..
2761. నీ గుండెచప్పుళ్ళే..
నా పెదవులపై నర్తించే స్వరాలవెల్లువలు
2762. ఎదురుచూపుల తొందరలు..
నీ రాకకై నన్ను గిలిగింతలుపెడ్తూ
2763. చూపులన్నీ చిత్రాలయ్యాయి...
నీ కనుల్లోని కిరణాలు సోకినందుకే..
2764. సంపెంగ సువాసనతోనే తెలిసింది..
నీ పరిమళాన్ని వియోగంతో మిళితం చేసి వెళ్ళావని...
2765. శిల్పముగా మారిపోవాలనుకున్నా..
అక్షరమవసరం లేకనే గుర్తించేవారు కొందరుంటారని..
2766. కవిత్వమంటేనే కోయిల కూజితం..
వసంతానికై వేచి చూసే అరమోడ్పుల ఆమని ఆరాటం..
2767. మూర్తీభవించిన వాస్తవమే నీవు..
మౌనరాగపు సమ్యోగంలోని శూన్యంలా..
2768. ఎన్ని వర్తమానాలు ఉరకలెత్తాలో..
రేపటి దీపావళి వెలగాలంటే..
2769. పువ్వువని గుర్తించానది చాలదా...
అక్కర్లేని అసంతృప్తిని మోయడమెందుకు..
2770. పెదవులు పలుకలేని బాసలే కొన్ని..
నా చూపులతోనే కబురంపా నిన్నందుకోమని..
2771. మనసు ఆదేశించినందుకేమో..
మౌనం కరిగి కన్నీరై ప్రవహిస్తూ..
2772. మందారాలు గుర్తుకొచ్చాయి..
సిగ్గుపడ్డ బుగ్గలు సొట్టలు పడ్డప్పుడల్లా..
2773. మరుమల్లె నవ్వుకే మైమరచిపోతున్నా..
నిన్ను జ్ఞప్తికి తెచ్చిందనే
2774. మనసుకదేగా మైమరపు..
అనుభూతిని ఊహాల్లో నింపుకొని ఆనందించడం..
2775. చినుకై కురిసింది వెన్నెల..
నిశీధిని నిలువెల్లా తడపాలనే..
2776. నిజం ఇజంలో మగ్గుతోంది..
అబద్దం ప్రవచనం చేసొస్తుంటే..
2777. పున్నమి వెన్నెలైనా వేడెక్కాల్సిందే..
నీ మాటల ఇంద్రజాలానికి..
2778. తీరమెరుగని పయనమే..
నిండుగా ప్రవహిస్తున్న నదిలో కొట్టుకుపోతూ..
2779. విషాదమైన నా వియోగమే..
వసంతంలోనూ గ్రీష్మాన్నే స్మరిస్తూ..
2780. వెన్నెలతునకనై నీదరి చేరానందుకే..
మదిలోని నిశీధిని తరిమేయాలనే..
2781. నీ హృదయం ఆల్చిప్పై ఆదుకుంది..
నీటిబొట్టును ముత్యంగా మార్చి మెరిపిస్తూ..
2782. చంద్రోదయాన్ని మరచినట్లున్నావు..
నా కన్నుల్లోకి తొంగి చూడలేదని..
2783. రాయినైన నన్ను జవరాలిగా చేసావుగా..
నీ ఊపిరితో నాలో ప్రాణంపోసి..
2784. ఓడిద్దామని వచ్చానంటావే..
మాలికలతో మురిపిద్దామని నిద్దుర మానుకున్నందుకేనా...
2785. ఒక్కక్షణమే..
కూడుకున్న వాటిని తీసివేతలుగా మార్చగలదు..
2786. సందేహమవసరమే లేదు..
వీడలేని చిక్కుముళ్ళై సమస్య చుట్టుముడుతుంటే..
2787. తరలిపోయే ఆనందాలెన్నో..
మధురక్షణాలను వేళ్ళపై లెక్కిస్తూ కూర్చుంటుంటే
2788. వక్రభాష్యాలెన్నో..
అర్ధాలకే నానార్ధాలను వెతికేస్తూ..
2789. కలభాషిణిగా మార్చేసావు..
నీ ప్రతికధలో నాయికగా మార్చేస్తూ..
2790. శృతి చేసిన రసధునివయ్యావుగా..
నే రాసిన ప్రతిపాటలో నువ్వే పల్లవిగా మారి..
2791. వెన్నెలకే గుబులు పుట్టిస్తావు..
అమాసలన్నీ పున్నములుగా మార్చేస్తూ..
2792. కావ్యాలంకారమైపోయా..
నీ ప్రతిస్పందనలో నే నిండిపోయినందుకేమో..
2793. నిన్నల్లో ఆగిన కల..
రేపటిని ఊహించనివ్వని వర్తమానంలో..
2794. పూటకో వేషం తప్పదేమో..
ఆనందాన్ని అనుక్షణం తూచాలనుకుంటే..
2795. మౌనపంజరంలో ఎన్నాళ్ళుంటావో..
శిశిరమెళ్ళి శరత్తును నీకు విడిచిపెట్టినా
2796. మణిమాలికతోనే ఆపేసావెందుకో..
నవలగా నన్ను రాస్తావని ఎదురుచూస్తుంటే.
2797. సందడి చేస్తున్న కలలు..
రాతిరైతే నీలో నర్తించాలని..
2798. ప్రేమ గుడ్డిదంటూ నా వెంటపడ్డావుగా..
ఇప్పుడు మూగగా మారానని వేదనెందుకు..
2799. నా బుగ్గలకి సొట్టలెందుకో..
నవ్వింది నీ పెదవులైతే..
2800. సాయంత్రపు సూర్యుడిలా సంకటమెందుకు..
తిరిగి రేపు ఉదయిస్తావుగా..
..................................... ********.....................................
No comments:
Post a Comment