Wednesday, 18 November 2015

ద్విపదాలు : 1351 నుండి 1400 వరకు

..................................... ********.....................................
1351. నీ పెదవులకెంత అభిమానమో..
నిరతం నన్నే ధ్యానిస్తూ..
1352. సీతకోకగా మారి సవాలు విసురుతున్నా..
నీ మనసు ఆరాటం అర్ధమయ్యిందనే..
1353. ప్రతీపున్నమికీ ఆరాటమే..
వెన్నెల్లో నీతో రేయంతా కరిగిపోవాలని..
1354. సీతాకోకగా మారిపోవాలనుంది..
ఊసరవెల్లితోనిక పోల్చలేరని..
1355. కష్టమైనా ఇష్టంగానే భావిస్తున్నా..
ఆరాటపడింది ప్రియమైన మనసుకదాని..
1356. గెలుపుకీ ఆరాటమే..
ఇందరిలో నిన్నే వరించి తరించాలని..
1357. చెక్కిళ్ళకెంత చెలగాటమో..
చెంగల్వలపై కన్నీటి ముత్యాల ఆగమనమేమిటని..
1358. కనుపాపవై నువ్వుందుకే..
చెలియలకట్ట దాటి రానంది కన్నీరు..
1359. చెలిమి చేయి అడ్డుపెట్టినందుకేమో..
మనసారాటం కన్నుల్లోనే ఆగిపోయింది..
1360. నిలువుటద్దంగా మారావుగా మరి..
అనుక్షణం తిలకించుకోమని తొందరపెడ్తూ..
1361. అమ్మకెప్పుడూ ఆరాటమే..
గోరంత ముద్దలోనే చందమామని చూపించి స్ఫూర్తి నింపాలని..
1362. ఆరాటాన్ని కుదించేసా..
అస్తిత్వానికే తప్ప వ్యక్తిత్వానికి విలువేముందని..
1363. రోజుకో ఉత్తమ మాలిక రాస్తున్నా..
వారానికి ఓ మారన్నా గుర్తిస్తారనే..
1364. ప్రేమ కోసమే ఆరాటం..
ప్రేమరాహిత్యమే అధిగమించలేని పోరాటం..
1365. ఊపిరిగా చేరిపోయానందుకే..
నీ నిశ్వాసలో లయించి ప్రాణమవ్వాలని..
1366. హృదయం..
ఉషోదయానికై ఎదురుచూసే మధురస్వప్నం..
1367. మనసు ఊసులాడింది..
నీ తలపు చిరుగాలై పలకరించిందనే..
1368. పిలుపు కోసమే వేచున్నా..
మనసంతా నువ్వంటూ ఆహ్వానిస్తావని..
1369. గతజన్మ గుర్తుకొస్తోంది..
నువ్వలా పాతజ్ఞాపకాలను తవ్వి పెడుతుంటే..
1370. శివరంజనిరాగాన్ని మొదలుపెట్టా..
చానాళ్ళుగా నువ్వు మరచి మూలపెట్టావనే..
1371. గోదారిగా మారదొన్నానందుకే..
తిరిగి తలపుల సముద్రంలోకి చేరతావనే..
1372. తలపుల్లోనే నర్తిస్తున్నా...
మౌనంగా నిన్నలరించాలనే...
1373.  యుగాలను సైతం మరుస్తోంది కాలం..
రేయింబవళ్ళు రాలిపోతున్నా తనకేంపట్టనట్లు పరుగెడుతూ..
1374. మోమాటమే గతానికి...
అడుగకనే నీ తలపుల్లో సడిచేయాలంటే..
1375. ఊహల పక్షులు ఎగురుతూనే ఉన్నాయి..
నీ జ్ఞాపకాలు ఎద గిల్లుతూంటే..
1376. పంచమరాగం వినబడుతోంది..
వియోగాన్ని పాటగా చేసి పాడావనే..
1377. కన్నులలిపి చదవలేకున్నా..
రోజుకో అర్ధంతో నువ్వలా చూస్తుంటే..
1378. అనుభవమైతే మిగిల్చుకున్నాగా..
జ్ఞాపకంగా మార్చుకున్నందుకు..
1379. వానవిల్లుతో కబురంపావుగా..
మేఘసందేశమని అర్ధంచేసుకున్నాలే..
1380. ఎడబాసిందెప్పుడని..
నీ తలపులు నిరంతరం వేధిస్తుంటే..
1381. నేటి కీర్తి చెరిగిపోయింది..
రేపటికోసం గట్టిగా రాయలేదనే..
1382. నల్లపూసై తిరిగినందుకేమో..
అమ్మ కంట్లో నిత్యమూ నలకలే..
1383. జీవం పోయడానికేగా నేనున్నది..
ఊసుల తీయదనంతో నిన్నూరడిస్తూ..
1384. తలపులకెప్పుడూ తపనలే..
నిన్ను ఆవాహించుకొని మనమొక్కటిగా కావాలని..
1385. మబ్బుల్లో నీటికే మురిసిపోతున్నా..
ఎడబాటు అలవాటు చేసావనే...
1386. వరూధిని విరహమంటినట్లుంది..
చంద్రకాంత శిలలు సైతం కరిగిస్తూ..
1387. పెదవొంపునే చూస్తారంతా..
కనురెప్ప వెనుక తొంగి చూడలేకనేమో..
1388. పుట్టెడు పొట్ట కోసమే తిప్పలు..
పళ్ళని కసిరికొట్టే దాకా అంతే..
1389. గర్జించలేదని వాపోతావే..
మౌనంలో తీయని మాటలు ఆలకిస్తుంటే..
1390.  నా మౌనానికీ మాటలొచ్చని ఒప్పుకుంటున్నా..
నీ సమక్షంలోనున్నప్పుడు సిగ్గుని చదివానన్నావనే..
1391. ఉరుకుతోంది కాలం..
నన్ను చూడాలనుకున్న నీ ఆత్రానికే..
1392. మౌనాన్నే ఆయుధం చేసా...
తూపులై నీపైకి విసురుతూ..
1393. మౌనం మనసు విప్పింది..
నిశ్శబ్దంలో నీతో ఊసులాడాలనే..
1394. ప్రవచిస్తే వినేవారెవ్వరు నేడు..
ప్రతివారికీ అనుభవాలు కావలిగాని..
1395. చెక్కిళ్ళను చిత్రించాలనుకుందేమో మది..
మునివేళ్ళనే కుంచెగా మార్చేస్తూ..
1396. అరమోడ్పులవుతూ కన్నులు..
నీ వర్ణాల మేళవింపుకు మైమరచినందుకు..
1397. గుర్తించావని సంతోషిస్తున్నా..
తారల్లో ఒంటరిగా మెరుస్తున్నానని విడిచిపెట్టక..
1398. అల్లిబిల్లి అల్లికలెన్నో కుట్టేస్తావు..
బహువల్లరిలో అల్లరితో అలరించాలనేమో..
1399. మోహం మనసుని వరించింది..
పరవశమైన పలుకునూ వశంచేస్తూ..
1400. గమ్యమేనాడో మారిందిగా..
ఏడడుగులంటూ మొదలెట్టి నాలుగోఅడుక్కి అలసినప్పుడే..

..................................... ********.....................................

No comments:

Post a Comment