..................................... ********.....................................
1501. ఆలోచన ఆరుద్రపురుగు కావాలి..
కొత్తవెన్నెలకాంతి మనసులో నిండాలంటే
1502. పల్లెటూరు పెళ్ళికూతురై ముస్తాబయ్యిందిగా..
ఆశీర్వదించడానికి పయనమయ్యింది కాబోలు
1503. సూర్యకిరణాల మెత్తని వెచ్చదనమే..
చలిపులి ఆగడాన్ని ఆటకట్టిస్తూ..
1504. మరో పాయగా చేరిందందుకే..
త్వరత్వరగా ప్రేమసముద్రంలో కలుద్దామనే..
1505. మబ్బులపైనే తేలుతున్నా..
నువ్వలా నన్ను ఊహలపల్లకి ఎక్కిస్తే..
1506. జీవితం ఉరకలేస్తుంది..
నువ్వలా ఊరేగిస్తుంటే..
1507. జీవితం నిండుగా ప్రవహిస్తుంది..
ప్రతీయణువులో నువ్వు నిండినందుకేమో.
1508. అక్షరం అవసరమే..
సమాజపు కుళ్ళు కడిగేందుకు..జగతిని జాగృతం చేసేందుకు..
1509. ఆశలపల్లకీ దింపేసావుగా..
ఆశువుగా ఎన్నన్నా చెప్తావు తీయగా
1510. తుంటరిగాలికి అల్లరెక్కువయ్యింది
ఆకాసాన్ని మెరిపిస్తూ ఆనందభాష్పాలు కురిపిస్తోంది..
1511. మౌనం హిమాలయమయ్యింది..
మన ఇరువురినడుమ మాటలు కరువయ్యాయనేనేమో..
1512. కాలమే విఫలమవుతోంది..
నిన్ను ఓదార్చేందుకు సరైన మందివ్వలేక..
1513. ఇంతకన్నా ఏ వైభోగం కావాలి జీవితానికి
కార్తీకంలోనే కల్యాణం కొత్తకాపురానికి ముహూర్తం కుదిరాక..;
1514. కనుచూపు కావ్యాలు కనిపెడుతున్నావుగా..
మాటలతో మురిపమెందుకు దండుగ..
1515. బాగుంది నీ భావవల్లరి..
ఆగనంటోంది నాలో అల్లరి..
1516. అతీతమైన స్తబ్దత..
మనసు ఆలోచించడం మానేసింది కాబోలు
1517. నిర్వేదం వేదమై కూర్చుందేమో..
చదవడానికి పట్టు చిక్కనంతగా.
1518. మనసు ఎగిసిపడుతోంది
ఎన్నిసార్లని తొంగిచూస్తావలా
1519. అనుభూతుల గతమయ్యింది మనసు..
వాస్తవ విచారాలను విస్మరించేందుకు
1520. రంగులవానే అది
పూలరంగుల పుప్పొడి కలిసిన పరిమళవాన
1521. కిరణాలవాన కురిపించాగా
రాజకీయపురంగు తుడవాలనే
1522. శరత్తు గమ్మత్తు..
పచ్చనిగడ్డికి తెల్లని మంచును పూస్తూ
1523. వసంతపు ఆగమనమే..
శశిరం తరువాత తప్పక చిగురిస్తానంటూ
1524. గడ్డిపరకల కిలకిలలు..
రవికిరణాలతో మంచుస్నానం చేస్తున్నాయని కాబోలు
1525. రాళ్ళు సైతం కరగాల్సిందే..
ఆ కన్నీటికే మాటలొస్తే
1526. ఒక్క వెలుగురేఖే..
నిశీధిలో నెలవంకలా మెరుపులీనుతూ అలా..
1527. భద్రమే జ్ఞాపకాలన్నీ..
అక్షరాలలో అమరమవుతూ
1528. జ్ఞాపకం దాచుకున్నా..
జ్ఞాపికచేసి నీకిద్దామని..
1529. స్వప్నము నిజమయ్యింది..
నీ తలపులు తలుపులు తీసాకనేగా
1530. నిత్యవధువేగా ఆమె
నవరాగమాలికను ద్విపదముగాచేసి నిన్నలరించే వేళ
1531. ఎన్ని అనుభూతులు కావాలో..
ఘనీభవించిన పాషాణం కరగాలంటే
1532. మునకే ఆనందముగా ఉంది..
ప్రవాహం అద్భుతమైనది మరి..
1533. వనితల విలువను పెంచేవాడుగా..
సరసవైభవ సర్వమోహనుడు మరి..:
1534. ఒక జీవితం గతి తప్పింది..
లోకంతెలియని పసిపాపను అనాధగా చేసింది.
1535. వెన్నెల్లో ఆడపిల్లనేగా
శిలని శిల్పంగా చేసి ప్రాణంపోసాక..
1536. పులకరిస్తున్నా..పుష్పమల్లే..
నొప్పితెలియకుండా గ్రోలిన తుమ్మెద నీవైనట్లు..
1537. ఎంతతీయగా వినిపించిందో..
నువ్వు పిలిచిన నా పేరు..
1538. ప్రాణం విలువ తెలీదుగా పావురాలకి..
ఆదరణ లేకే అన్యాయంగా అంతమవుతూ..
1539. ప్రేమ చిన్నబోయింది..
పవిత్రమైన తనను నటనకు వాడుకున్నారని..:
1540. ఎన్నిరాగాలు ఉండుంటాయో స్వరాల్లో..
నాకైతే అనురాగమే నచ్చింది
1541. రెప్పలకౌగిలిలో దాచెయనా..
నులివెచ్చగా సేదతీరుతానంటే
1542. ఎన్నో తెలుసుకోవాలనుకున్నా..
నువ్వు తప్ప అన్నీ అర్ధమయ్యాయి
1543. అక్షరాలు అనంతమయ్యే..
అక్షతలై ఆశీర్వదించ.
1544. పద్మాసనం వేసి కూర్చోపెట్టావుగా..
నులివెచ్చని స్వాగతాన్ని కాదనలేకపోయా..
1545. అలుక్కుపోయాయి అక్షరాలు..
గతాన్ని మర్చిపోమంటూ
1546. ఎంతోసహృదయం కావాలి..
ఎదుటివారిని ప్రతిభను అర్ధంచేసుకొని ప్రోత్సహించేందుకు.
1547. నిత్యవిద్యార్ధినే..
ఎంతకూ అర్ధంకాని జీవితపాఠాన్ని చదువుతూ..
1548. మూడుముళ్ళు పడ్డాయిగా...
కొంగుకు ముడేసుకోవాలిక
1549. వ్యాపకాలేగా స్నేహితులు..
ఒంటరిమనసుకి ఓదార్పులు
1550. గతం గగనమంటిందిలే..
వర్తమానంలో నిలబడమంటూ..
..................................... ********.....................................
1501. ఆలోచన ఆరుద్రపురుగు కావాలి..
కొత్తవెన్నెలకాంతి మనసులో నిండాలంటే
1502. పల్లెటూరు పెళ్ళికూతురై ముస్తాబయ్యిందిగా..
ఆశీర్వదించడానికి పయనమయ్యింది కాబోలు
1503. సూర్యకిరణాల మెత్తని వెచ్చదనమే..
చలిపులి ఆగడాన్ని ఆటకట్టిస్తూ..
1504. మరో పాయగా చేరిందందుకే..
త్వరత్వరగా ప్రేమసముద్రంలో కలుద్దామనే..
1505. మబ్బులపైనే తేలుతున్నా..
నువ్వలా నన్ను ఊహలపల్లకి ఎక్కిస్తే..
1506. జీవితం ఉరకలేస్తుంది..
నువ్వలా ఊరేగిస్తుంటే..
1507. జీవితం నిండుగా ప్రవహిస్తుంది..
ప్రతీయణువులో నువ్వు నిండినందుకేమో.
1508. అక్షరం అవసరమే..
సమాజపు కుళ్ళు కడిగేందుకు..జగతిని జాగృతం చేసేందుకు..
1509. ఆశలపల్లకీ దింపేసావుగా..
ఆశువుగా ఎన్నన్నా చెప్తావు తీయగా
1510. తుంటరిగాలికి అల్లరెక్కువయ్యింది
ఆకాసాన్ని మెరిపిస్తూ ఆనందభాష్పాలు కురిపిస్తోంది..
1511. మౌనం హిమాలయమయ్యింది..
మన ఇరువురినడుమ మాటలు కరువయ్యాయనేనేమో..
1512. కాలమే విఫలమవుతోంది..
నిన్ను ఓదార్చేందుకు సరైన మందివ్వలేక..
1513. ఇంతకన్నా ఏ వైభోగం కావాలి జీవితానికి
కార్తీకంలోనే కల్యాణం కొత్తకాపురానికి ముహూర్తం కుదిరాక..;
1514. కనుచూపు కావ్యాలు కనిపెడుతున్నావుగా..
మాటలతో మురిపమెందుకు దండుగ..
1515. బాగుంది నీ భావవల్లరి..
ఆగనంటోంది నాలో అల్లరి..
1516. అతీతమైన స్తబ్దత..
మనసు ఆలోచించడం మానేసింది కాబోలు
1517. నిర్వేదం వేదమై కూర్చుందేమో..
చదవడానికి పట్టు చిక్కనంతగా.
1518. మనసు ఎగిసిపడుతోంది
ఎన్నిసార్లని తొంగిచూస్తావలా
1519. అనుభూతుల గతమయ్యింది మనసు..
వాస్తవ విచారాలను విస్మరించేందుకు
1520. రంగులవానే అది
పూలరంగుల పుప్పొడి కలిసిన పరిమళవాన
1521. కిరణాలవాన కురిపించాగా
రాజకీయపురంగు తుడవాలనే
1522. శరత్తు గమ్మత్తు..
పచ్చనిగడ్డికి తెల్లని మంచును పూస్తూ
1523. వసంతపు ఆగమనమే..
శశిరం తరువాత తప్పక చిగురిస్తానంటూ
1524. గడ్డిపరకల కిలకిలలు..
రవికిరణాలతో మంచుస్నానం చేస్తున్నాయని కాబోలు
1525. రాళ్ళు సైతం కరగాల్సిందే..
ఆ కన్నీటికే మాటలొస్తే
1526. ఒక్క వెలుగురేఖే..
నిశీధిలో నెలవంకలా మెరుపులీనుతూ అలా..
1527. భద్రమే జ్ఞాపకాలన్నీ..
అక్షరాలలో అమరమవుతూ
1528. జ్ఞాపకం దాచుకున్నా..
జ్ఞాపికచేసి నీకిద్దామని..
1529. స్వప్నము నిజమయ్యింది..
నీ తలపులు తలుపులు తీసాకనేగా
1530. నిత్యవధువేగా ఆమె
నవరాగమాలికను ద్విపదముగాచేసి నిన్నలరించే వేళ
1531. ఎన్ని అనుభూతులు కావాలో..
ఘనీభవించిన పాషాణం కరగాలంటే
1532. మునకే ఆనందముగా ఉంది..
ప్రవాహం అద్భుతమైనది మరి..
1533. వనితల విలువను పెంచేవాడుగా..
సరసవైభవ సర్వమోహనుడు మరి..:
1534. ఒక జీవితం గతి తప్పింది..
లోకంతెలియని పసిపాపను అనాధగా చేసింది.
1535. వెన్నెల్లో ఆడపిల్లనేగా
శిలని శిల్పంగా చేసి ప్రాణంపోసాక..
1536. పులకరిస్తున్నా..పుష్పమల్లే..
నొప్పితెలియకుండా గ్రోలిన తుమ్మెద నీవైనట్లు..
1537. ఎంతతీయగా వినిపించిందో..
నువ్వు పిలిచిన నా పేరు..
1538. ప్రాణం విలువ తెలీదుగా పావురాలకి..
ఆదరణ లేకే అన్యాయంగా అంతమవుతూ..
1539. ప్రేమ చిన్నబోయింది..
పవిత్రమైన తనను నటనకు వాడుకున్నారని..:
1540. ఎన్నిరాగాలు ఉండుంటాయో స్వరాల్లో..
నాకైతే అనురాగమే నచ్చింది
1541. రెప్పలకౌగిలిలో దాచెయనా..
నులివెచ్చగా సేదతీరుతానంటే
1542. ఎన్నో తెలుసుకోవాలనుకున్నా..
నువ్వు తప్ప అన్నీ అర్ధమయ్యాయి
1543. అక్షరాలు అనంతమయ్యే..
అక్షతలై ఆశీర్వదించ.
1544. పద్మాసనం వేసి కూర్చోపెట్టావుగా..
నులివెచ్చని స్వాగతాన్ని కాదనలేకపోయా..
1545. అలుక్కుపోయాయి అక్షరాలు..
గతాన్ని మర్చిపోమంటూ
1546. ఎంతోసహృదయం కావాలి..
ఎదుటివారిని ప్రతిభను అర్ధంచేసుకొని ప్రోత్సహించేందుకు.
1547. నిత్యవిద్యార్ధినే..
ఎంతకూ అర్ధంకాని జీవితపాఠాన్ని చదువుతూ..
1548. మూడుముళ్ళు పడ్డాయిగా...
కొంగుకు ముడేసుకోవాలిక
1549. వ్యాపకాలేగా స్నేహితులు..
ఒంటరిమనసుకి ఓదార్పులు
1550. గతం గగనమంటిందిలే..
వర్తమానంలో నిలబడమంటూ..
..................................... ********.....................................
No comments:
Post a Comment