Wednesday, 18 November 2015

ద్విపదాలు : 451 నుండి 500 వరకు

..................................... ********.....................................

451. చెమరింతల కల్పితాలే..
ఆకర్షణ సమ్యోగంలో సయోధ్య వెతులాటలు..

452. పెట్టావులే కిరీటం..
మెరిసే మణులన్నీ నకిలీవి తగిలించి..

453. కోహినూరని బేరంపెట్టకు..
విలువైన నేను మళ్ళీ దొరకను..

454. మాటలనే తాగేస్తున్నావు..
మౌనాన్ని మింగమన్నానని నాపై అలిగినందుకేమో..

455. నీ మదికెన్ని అపురూపాలో..
ప్రతిరూపమై నే కొలువున్నందుకేనా

456. నిద్దురనే నిలువరిస్తున్నావు..
వరించే వేడుకలో వసంతాన్ని వీక్షిస్తూ..

457. పూరించావుగా మనసులో ఖాళీ..
అనుకోని రంగులన్నీ చల్లి..

458. మాటలను మాలికగా మార్చేసా..
అక్షరాలకి ఆరాటం ఎక్కువైందని..

459. ఏకాంతమూ మాట్లాడుతోంది..
నీరవంలో నా మనసులో తొంగిచూసిందేమో..

460. ఏకాంతాన్ని కోరుతోంది మది..
పిలవకున్నా నువ్వొస్తావని కాబోలు..

461.వేకువ ప్రణయం నేనేగా..
నీ తొలిపాటకు పల్లవినవుతూ

462. నిరీక్షణైతేనేమి..
నీ నిత్యతలపుల్లో నే నడయాడుతుండగా

463. అక్షరాలకెంత ఆరాటమో..
వేకువనే మాలికల్లో మల్లికై మెరవాలని..

464. రాయంచలే నీ కులుకులు..
సవ్వడై ఎదలో మారుమ్రోగుతూ

465. అక్షరాలు అంబరమంటాయి..
తమను అందంగా రాస్తున్నావనే సంబరమేమో

466. జీవితంలో ఆశ పెరిగింది..
మల్లె కన్నా స్వచ్ఛమైన నీ చెలిమి దొరికాక..

467. సూర్యాస్తమయం అందంగా కనిపిస్తోంది...
తూరుపువేకువకి ఇంకా సమయముందనేమో..

468. అంతెక్కడిదిలే ఆశలకు..
రేపటికి నిన్నటిది నేడే పాతబడిపోతుంటే

469. చంపుకోక తప్పదు మనసుని..
మరొకరిని చిరంజీవిని చేస్తుందంటే..

470. అందరూ మంచోళ్ళే..
మనిషితనానికి ముసుగేస్తూ..

471. ఆవేశంగా అల్లుకుందో భావలత..
అభిసారికనే అమాంతం చుట్టుకొనేందుకట..

472. పునీతమవ్వలనేగా మునులు సైతం..
పన్నెండేళ్ళకోమారు ఒక్కోనదిలో మునకేయడం..

473. తడబాటే ప్రతీఅడుగులో..
కలో నిజమో తెలియని భ్రమల్లో

474. తలపులూ వలపులూ పోటీ పడుతున్నాయి..
నిన్ను చేరే మార్గాన్ని ఆలోచిస్తూ..

475. తనువుకెందుకో తీయందనము..
నీవు తాకింది కేవలం పెదవంచునైతే..

476. వెతుకునేందుకే నిన్ను..
జ్ఞాపకాల జాడల్లోనైనా నాకై ఎదురొస్తావని

477. దూరం ఎక్కడుంది అనుబంధానికి..
రెండుహృదయాలు ఏకమై తీసే ఊపిరి ఒకటే అయితే..

478. చెదిరిపోయిన కలలేమో..
అలమాదిరి తూగుతూనే కడలిలో ఉరుకుతూ..

479. చెక్కిలిగింతల గీతాలెన్నో రాసావుగా..
నా చెక్కిళ్ళనే శృతిచేసి..

480. కామా కూడా పెట్టనుగా ప్రేమకి..
ముందు రాయడమన్నది నువ్వు మొదలెడితే..

481. అక్షరాల అలుకలు..
తస్మదీయుల చేరికతో..అస్మదీయుల విరుపులతో..

482. నీవూ నేనూ ఒక్కటేగా..
చూసేకంటికి వేరుగా కనపడ్డా..

483. పల్లెలకెంత కన్నీరో..
పిల్లల నాగరికత నెత్తావుల మత్తులకి..

484. ఊసుల కధలన్నీ కంటికిచ్చేసా..
మనసును మాత్రమే తనువుంచుకుందని..

485. ఎక్కిళ్ళే నిద్దట్లో..
నువు దూరమైతే నాకు జీవమేదని..

486. మరులు వికసించాయి..
నీ ఊసులు మురిపాలు వినబడ్డాయని..

487. కోరికల గుర్రమొకటుందిగా..
అవసరానికి కీలుగుర్రంగా మార్చేస్తూ మనిషిని..

488. నీరవమే బాగుందేమో
నిశ్శబ్దం వినబడుతోంది..

489. వేళాపాళాలేని వర్షమేమిటో..
వారంవర్జ్యం లేని విరహాన్ని తలపిస్తూ..

490. పగటి పరిమాణం పెరిగింది..
నీకు పగటినిద్ర ఎక్కువయ్యిందనే..

491. కన్నీరే తీయనైతే తాగేస్తామనేమో..
పుడమంతా నీటికి ఎద్దడవుతుందని..

492. ఆదరణ కరువైందిగా భావుకతకి..
వచ్చి మాత్రం చేసేదేముందని..

493. తలపులెప్పుడూ తెరిచే వున్నాయి..
కలలద్వారానికీ..వలపుల విహారానికి..

494. ఊహించని మలుపులే..
అకాలంలో తళుక్కుమన్న ఉరుముల తళుకులు..

495. జ్ఞాపకాల వెల్లువేనేమో..
తొలివలపు మేఘం మరలా తడిమినందుకు..

496. చిలిపి తలపులకెన్ని నాట్యాలో..
తలుపు మాటునే గెంతులేస్తూ..

497. జీవితం జిలేబయ్యింది..
తీయని మధువుని నువ్వు పంచినందుకే..

498. మనసులెప్పుడూ మమేకమేలే..
మణిమాలిక ముచ్చట తీరే మార్గమేదని..

499. కన్నీరంతా కష్టాలపాలు..
నీళ్ళన్నీ కాల్వలపాలు..

500. అలుపేదీ అల్లరికి..
మనసెరిగిన ముచ్చట్లకి లేని మోమాటానికి..
..................................... ********.....................................

No comments:

Post a Comment