..................................... ********.....................................
1951. మంచుబిందువులా నువ్వు..
నిద్దురపొద్దుల్లో తుషారపు గిలిగింతలు పెట్టేలా..
1952. కెరటాలవుతూ నా భావాలు..
అనుభూతిలో నిన్ను ముంచెత్తాలనే..
1953. మకరందంలో ముంచుతున్నా నీ తలపులని..
ప్రతి నిముషం తీయగా తాగాలనే..
1954. సన్నజాజులు రువ్వినట్లుంది..
నీ చూపులు ఉషస్సులై సంధిస్తుంటే
1955. రాలుగాయి మనసే నీది..
రాగాలను రాతితో కలిపేస్తూ
1956. సూర్యుడు సద్దు చేసాడు..
అర్ఘ్యం పుచ్చుకునేందుకైనా ఆహ్వానించమంటూ...
1957. మనసుకు దాహం తెలియకూడదనేమో..
కన్నుల్లో నిత్యమందాకినులు సృష్టించాడు.
1958. సహనమే నిన్ను గెలవడానికి..
రోజంతా నామజపముతో పొద్దుపుచ్చుతూ..
1959. కొన్ని కన్నీళ్ళంతే..
ఆగకుండా ప్రవహించి ఉనికి చాటుకుంటాయి..
1960. అసలేం పట్టిచ్చుకోవద్దంటాడు..
నొప్పి తెలియకుండా తలకొరివి పెట్టేస్తూ..
1961. విరిసే వసంతమంతా నువ్వేలే..
నా తలపుల్లో చిగురిస్తుంటే..
1962. చందమామ నవ్వినట్లుంది..
అసమానంగా వెలుగుతున్న నీ మోములో..
1963. హేమంతం గుర్తొస్తోంది..
నీ తలపుకు మనసు ఒణుకుతుంటే..
1964. అనుమతి లేకుండానే చొరబడ్డావుగా..
మట్టివాసనతో మనసును దోచేసి..
1965. ఊహల్ని విసుక్కుంటావే..
పొద్దస్తమానూ కలవరించి కలలో రమ్మంటూనే..
1966.పట్టించుకోవడమే మానేసా..
పొలమారిన ప్రతిసారీ నువ్వు తలుస్తున్నావనే..
1967. గుండెచాటు ఊసులే..
నే వేసే మాలికల మణిహారాలన్నీ
1968. వెన్నెలనై జారిపోతున్నానందుకే..
నీ చూపులకు పట్టుబడ్డ ప్రతిసారి..
1969. లయ తప్పని నర్తనమే నీది..
నా హృదయాన్ని వేదిక చేసాననేమో..
1970. గుండె గతుక్కుమంది..
గుట్టుగా నీ ఆలోచనని పసిగట్టినందుకే
1971. తూగుటుయ్యాలలో పరవశించినట్లుంది..
నీ ఊహలు ఊయలూపి లాలిస్తుంటే..
1972. దుర్గంధం తప్పదు..
మనసు నిండా మాలిన్యమే నింపుకుంటే..
1973. నిత్య నరకం..
నిశ్శబ్ద పోరాటంలోనే..
1974. ఆడదే ఆధారం..
కానీ మగనిచేతిలోనే ఆ దారం..
1975. అనుభవపాఠాలు రుచించేదెందరికి..
అనుభవైకవేద్యం కావాలనే కుతూహలం పెరుగుతుంటే..
1976. ఆంక్షలవలయం తప్పదు..
సమాజమెంత మారినా..ఆవేశమెంత గింజుకున్నా..
1977. ఎంత ఆవేశమో యువతకి..
భవిష్యత్తుని వ్యర్ధం చేసుకుంటూ..
1978. వదులైపోయినవి కన్నుల్లో నరాలు..
అదేపనిగా ఆర్ద్రతను కురిసినందుకే..
1979. చెరిగిపోని చిత్రపటాన్నే..
నీ మనసు కుంచెతో చిత్రించినందుకు
1980. అనుభూతులపర్వమే నా జీవితం..
నీవు అడుగుపెట్టిన వేళావిశేషమనుకుంట..
1981. ఎదురొచ్చావందుకేగా...
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచినందుకు..
1982. అభిమానమా..
కాదు..నీ ఆత్మీయతా రథం..
1983. నీ కలానికే సాధ్యం..
నన్నందంగా ఇలా వర్ణించడం
1984. నీ కిరణాలకే వెలుగుతున్నా..
ఇన్నాళ్ళూ చీకట్లోనే మగ్గినందుకు..
1985. చిగురాకల్లే ఒణుకుతున్నా..
నీ వలపుజల్లులో తడిచిన ప్రతిసారి..
1986. శుభలేఖకు పచ్చనిబొట్టు పెట్టనందుకే..
నీ చూపుతో రాసావనే..
1987. నిరంతర చదువరినే..
నిన్ను చదవాలని ప్రయత్నించి ఓడిపోతూ..
1988. కన్నుల్లో పువ్వులై మిగిలాయి చిత్రాలు..
నీ జ్ఞాపకాల ఒత్తిడి ఎక్కువైనందుకే...
1989. నువ్వుగానే మిగిలిపోయా..
నీలోకొచ్చి చేరినందుకు..
1990. నీ చూపుకు మాత్రమే సాధ్యం..
నన్ననేక కోణాల్లో పట్టి బంధించడం..
1991. వరూధినివంటూ వలచావెందుకో..
మాయప్రవరుడివై మభ్యపెడుతూ..
1992. ఎన్ని అల్లర్లు మెలిపెడతాయో..
బాల్యపుస్మృతుల్లో మనసు ఈదులాడుతుంటే..
1993. పురి విప్పుకొను ఊపిరులెన్నో నాలో..
నీ మృదుస్పర్శను ఊహించిన ప్రతిసారి..
1994. నీ స్పర్శలోని గమ్మత్తే..
స్వర్గాన్ని సొంతం చేసింది..
1995. . మరణం ముగింపు కాదేమో..
జ్ఞాపకాల్లో సజీవమై ఉన్నంతవరకూ
1996. వెన్నెలకెన్ని కిటుకులో..
అధరాన్ని బట్టీ స్వభావాన్ని మార్చుకుంటూ
1997. మూగనైతేనేమిలే..
నా స్పర్శతోనే సందేశం వినిపించానుగా..
1998. వెనుదిరిగిన ఓటమినెందుకు వెక్కిరించడం..
రమ్మంటూ విజయం ఎదురవుతుంటే..
1999. అంతరంగం కుదుటపడింది..
నీ స్పర్శలోని మధుర సాంత్వనకే..
2000. ఆనందదీప్తులెన్నో నీ స్పర్శలో..
వియోగపు చీకట్లను తరిమేస్తూ..
..................................... ********.....................................
1951. మంచుబిందువులా నువ్వు..
నిద్దురపొద్దుల్లో తుషారపు గిలిగింతలు పెట్టేలా..
1952. కెరటాలవుతూ నా భావాలు..
అనుభూతిలో నిన్ను ముంచెత్తాలనే..
1953. మకరందంలో ముంచుతున్నా నీ తలపులని..
ప్రతి నిముషం తీయగా తాగాలనే..
1954. సన్నజాజులు రువ్వినట్లుంది..
నీ చూపులు ఉషస్సులై సంధిస్తుంటే
1955. రాలుగాయి మనసే నీది..
రాగాలను రాతితో కలిపేస్తూ
1956. సూర్యుడు సద్దు చేసాడు..
అర్ఘ్యం పుచ్చుకునేందుకైనా ఆహ్వానించమంటూ...
1957. మనసుకు దాహం తెలియకూడదనేమో..
కన్నుల్లో నిత్యమందాకినులు సృష్టించాడు.
1958. సహనమే నిన్ను గెలవడానికి..
రోజంతా నామజపముతో పొద్దుపుచ్చుతూ..
1959. కొన్ని కన్నీళ్ళంతే..
ఆగకుండా ప్రవహించి ఉనికి చాటుకుంటాయి..
1960. అసలేం పట్టిచ్చుకోవద్దంటాడు..
నొప్పి తెలియకుండా తలకొరివి పెట్టేస్తూ..
1961. విరిసే వసంతమంతా నువ్వేలే..
నా తలపుల్లో చిగురిస్తుంటే..
1962. చందమామ నవ్వినట్లుంది..
అసమానంగా వెలుగుతున్న నీ మోములో..
1963. హేమంతం గుర్తొస్తోంది..
నీ తలపుకు మనసు ఒణుకుతుంటే..
1964. అనుమతి లేకుండానే చొరబడ్డావుగా..
మట్టివాసనతో మనసును దోచేసి..
1965. ఊహల్ని విసుక్కుంటావే..
పొద్దస్తమానూ కలవరించి కలలో రమ్మంటూనే..
1966.పట్టించుకోవడమే మానేసా..
పొలమారిన ప్రతిసారీ నువ్వు తలుస్తున్నావనే..
1967. గుండెచాటు ఊసులే..
నే వేసే మాలికల మణిహారాలన్నీ
1968. వెన్నెలనై జారిపోతున్నానందుకే..
నీ చూపులకు పట్టుబడ్డ ప్రతిసారి..
1969. లయ తప్పని నర్తనమే నీది..
నా హృదయాన్ని వేదిక చేసాననేమో..
1970. గుండె గతుక్కుమంది..
గుట్టుగా నీ ఆలోచనని పసిగట్టినందుకే
1971. తూగుటుయ్యాలలో పరవశించినట్లుంది..
నీ ఊహలు ఊయలూపి లాలిస్తుంటే..
1972. దుర్గంధం తప్పదు..
మనసు నిండా మాలిన్యమే నింపుకుంటే..
1973. నిత్య నరకం..
నిశ్శబ్ద పోరాటంలోనే..
1974. ఆడదే ఆధారం..
కానీ మగనిచేతిలోనే ఆ దారం..
1975. అనుభవపాఠాలు రుచించేదెందరికి..
అనుభవైకవేద్యం కావాలనే కుతూహలం పెరుగుతుంటే..
1976. ఆంక్షలవలయం తప్పదు..
సమాజమెంత మారినా..ఆవేశమెంత గింజుకున్నా..
1977. ఎంత ఆవేశమో యువతకి..
భవిష్యత్తుని వ్యర్ధం చేసుకుంటూ..
1978. వదులైపోయినవి కన్నుల్లో నరాలు..
అదేపనిగా ఆర్ద్రతను కురిసినందుకే..
1979. చెరిగిపోని చిత్రపటాన్నే..
నీ మనసు కుంచెతో చిత్రించినందుకు
1980. అనుభూతులపర్వమే నా జీవితం..
నీవు అడుగుపెట్టిన వేళావిశేషమనుకుంట..
1981. ఎదురొచ్చావందుకేగా...
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచినందుకు..
1982. అభిమానమా..
కాదు..నీ ఆత్మీయతా రథం..
1983. నీ కలానికే సాధ్యం..
నన్నందంగా ఇలా వర్ణించడం
1984. నీ కిరణాలకే వెలుగుతున్నా..
ఇన్నాళ్ళూ చీకట్లోనే మగ్గినందుకు..
1985. చిగురాకల్లే ఒణుకుతున్నా..
నీ వలపుజల్లులో తడిచిన ప్రతిసారి..
1986. శుభలేఖకు పచ్చనిబొట్టు పెట్టనందుకే..
నీ చూపుతో రాసావనే..
1987. నిరంతర చదువరినే..
నిన్ను చదవాలని ప్రయత్నించి ఓడిపోతూ..
1988. కన్నుల్లో పువ్వులై మిగిలాయి చిత్రాలు..
నీ జ్ఞాపకాల ఒత్తిడి ఎక్కువైనందుకే...
1989. నువ్వుగానే మిగిలిపోయా..
నీలోకొచ్చి చేరినందుకు..
1990. నీ చూపుకు మాత్రమే సాధ్యం..
నన్ననేక కోణాల్లో పట్టి బంధించడం..
1991. వరూధినివంటూ వలచావెందుకో..
మాయప్రవరుడివై మభ్యపెడుతూ..
1992. ఎన్ని అల్లర్లు మెలిపెడతాయో..
బాల్యపుస్మృతుల్లో మనసు ఈదులాడుతుంటే..
1993. పురి విప్పుకొను ఊపిరులెన్నో నాలో..
నీ మృదుస్పర్శను ఊహించిన ప్రతిసారి..
1994. నీ స్పర్శలోని గమ్మత్తే..
స్వర్గాన్ని సొంతం చేసింది..
1995. . మరణం ముగింపు కాదేమో..
జ్ఞాపకాల్లో సజీవమై ఉన్నంతవరకూ
1996. వెన్నెలకెన్ని కిటుకులో..
అధరాన్ని బట్టీ స్వభావాన్ని మార్చుకుంటూ
1997. మూగనైతేనేమిలే..
నా స్పర్శతోనే సందేశం వినిపించానుగా..
1998. వెనుదిరిగిన ఓటమినెందుకు వెక్కిరించడం..
రమ్మంటూ విజయం ఎదురవుతుంటే..
1999. అంతరంగం కుదుటపడింది..
నీ స్పర్శలోని మధుర సాంత్వనకే..
2000. ఆనందదీప్తులెన్నో నీ స్పర్శలో..
వియోగపు చీకట్లను తరిమేస్తూ..
..................................... ********.....................................
No comments:
Post a Comment