..................................... ********.....................................
1801. అడ్డూఅదుపూ లేని నోళ్ళను చీల్చాలేమో..
మన మనసు పదిలం కావాలంటే..
1802. ఎడారిలో తుఫానులా నీ తలపులు..
గాలితో కబురంపి నన్ను మేల్కొల్పుతూ..
1803. ఊహలు గానాలు మొదలెట్టాయి..
మౌనమింకా మాటలు కూడదీసుకుంటుందని..
1804. నిన్న లేని అందమేదో నాలో..
ఋతుశోభలన్నీ నువ్వు నాకే పూస్తుంటే..
1805. నా తలపులు చినుకులేననుకున్నా..
నువ్వింతకాలం పచ్చగా ఉన్నందుకు..
1806. మనసు వెతుకుతోంది..
అందరినీ మెప్పించే పూదారుంటే బాగుండని..
1807. నయనానికెప్పుడూ అరనవ్వులే..
తొలివేకువ నీవై నిద్దురలేపే క్షణాలుంటే..
1808. వసంతమానాడే అలిగింది..
తనను కాదని నిన్నే వలచానని
1809. నీవో అమాయకరాజువి..
నీ ఆస్థి స్వాతిముత్యమంటి మనసే..
1810. నా మనసుకెప్పుడూ రెక్కలుంటాయి..
వలరాజుల ఉచ్చునుండీ ఎగిరేందుకు..
1811. నిరాశతో వెనుదిరిగా..
నువ్వెగరేసిన గాలిపటంలో రంగులు నచ్చలేదనే..
1812. కంచికే పోదామనుకున్నాను..
కలవరిస్తావనుకొని మిగిలుండిపోయాను..
1813. నా మీద నుంచీ వీచినప్పుడే అనుకున్నా..
చిలిపిగాలి అల్లరేదో చేసేందుకు నిన్ను చేరబోతోందని..
1814. ఎన్నిసార్లు మూర్ఛపోయిందో మనసు..
కలలో తప్ప ఇలలో లేని అందానికి మోసపోయానని..
1815. నేటి వెతలన్నీ..
నిన్నటి తప్పులే
1816. నిదురలోనే ఉంటావెందుకలా..
రోజూ గుడిగంటలు దొంగిలించలేక చస్తున్నా..
1817. మనసున విరబూస్తున్నది..
అనుభూతుల పువ్వేదో తనను రాయమంటూ..
1818. చిగురిస్తూనే ఉన్న మనోవనాలు..
శిశిరాలెన్నిసార్లు రాల్చాలని చూసినా
1819. తూరుపువెళ్ళే రైలు వెనుకే రాసిపెట్టా
మనసు ఊసులు తెలుసుకుంటావని ప్రతిరోజూ..
1820. నా మనసుకి దాహం తీరినట్లే..
నీ అధరాల చిరునవ్వును తాగుతుంటే..
1821. సొబగుల సంతకాలు..
వయసుకి వాయనాలు..
1822. కన్నుల్లో చిలిపిదనం..
నీ పెదవులు నన్ను చదువుతుంటే..
1823. ఆరని వెలుతురే నువ్వు..
మనసుల్లో మరిన్నిదీపాలు వెలిగిస్తూ..
1824. రెక్కలుపంపి మరీ కలలోకి ఆహ్వానించావుగా..
రెప్పలవాకిలి మూసున్నా మనసు మెలకువేనంటూ..
1825. సంగీతలక్ష్మి చిన్నబోయింది..
తన స్వరార్చనను ఆదిలోనే అడ్డగించావని..
1826. ఆనందభాష్పాలతో చిగురించావేమో..
వెతక్కుండానే ఆచూకీ దొరికింది కనులకి..
1827. నిన్ను విస్మరించడం వల్లకాదు..
నీవు నన్ను విడిచిపోయినా..
1828. దాచేసాననేక స్పందనలను..
మాలికలుగా చదివి ఇబ్బంది పడతావనే..
1829. కొండమల్లె కొప్పు మీదికెక్కింది..
నీలమంటి కురులను మోహించే..
1830. మూడుముళ్ళు బరువయ్యాయేమో..
నాలుగోముడికి తేలికవ్వొచ్చని
1831. ప్రతిస్పందనలన్నీ మాలగా గుచ్చేసా..
మాలికగా మెడలోవేసి మురిపిద్దామనే..
1832. నమ్మకమేగా జీవితం..'
ఆశ ఆధారమనుకుంటే..
1833. గమ్మత్తైన అనుబంధమే మనది..
ప్రాణాల సైతం లెక్కలేదంటూ..
1834. కోరికలు గువ్వలై ఎగురుతుంటే ఆనందమే..
కన్నవారిని మరువకుంటే మరింత ప్రమోదమే..
1835. అంతరంగం బైటపడింది..
మనసద్దం పగిలినప్పుడే..
1836.మానవత్వం గెలిచింది..
వర్గాలుగా విభజించడం నీవు చేయలేవనే..
1837. యుద్దాలన్నీ వ్యర్ధమేగా..
మార్పు ముందుగా మనలో మొదలవకుంటే..
1838. మల్లెలెంతో మూగగా పరిమళిస్తున్నవి..
మన పరవశానికి తోడవ్వాలనేమో..
1839. నేనెప్పటికీ తారకనే..
ఎన్ని తారలు రాలినా నా ఉనికి నిలుపుకుంటూ..
1840. నువ్వు దూరమయ్యాకనే తెలిసింది..
నే పోగొట్టుక్కున్న సిరేమిటో..
1841. జీవనమెప్పుడూ చైతన్యమే..
ఆటుపోట్లకు కలతచెందక మనమూ ఉరకలెత్తితే..
1842. .వర్తమానాన్ని వరించక తప్పదు..
గతం నీడై అనుసరించినందుకు..
1843. అమ్మ కళ్ళలోంచీ తొంగిచూసా..
ప్రపంచం కమ్మగానే కనపడింది..
1844. జాబిల్లి విస్తుపోయినప్పుడే తెలుసులే..
నీ నెలవంక ఒంపులన్నీ నన్ను చూసాక పుట్టినవని..
1845. రోజుకో రూపంలో విచ్చేస్తున్నా..
నువ్వల్లే మాలికాతోరణాన్ని చూసేందుకే..
1846. రాతిరిరాగాలే తీద్దామిక..
సుప్రభాతగీతాలకి సెలవిచ్చేసాక..
1847. మత్తకోకిలవే ఆనాడు..
మత్తెక్కించే కాకిలా మారావు ఈనాడు..
1848. మనసు నవ్వుకుంది..
బాల్యంలోకి పయనించి స్మృతులను గిల్లుకున్నందుకే
1849. అందం మెరిసిపోతోంది..
అద్దం నన్ను కొత్తగా చూపించినందుకేనట..
1850. ఆమె కన్నుల్లో అగ్నిశిఖలు..
నీ విషాదస్రవంతిని గుర్తించినందుకే..
..................................... ********.....................................
1801. అడ్డూఅదుపూ లేని నోళ్ళను చీల్చాలేమో..
మన మనసు పదిలం కావాలంటే..
1802. ఎడారిలో తుఫానులా నీ తలపులు..
గాలితో కబురంపి నన్ను మేల్కొల్పుతూ..
1803. ఊహలు గానాలు మొదలెట్టాయి..
మౌనమింకా మాటలు కూడదీసుకుంటుందని..
1804. నిన్న లేని అందమేదో నాలో..
ఋతుశోభలన్నీ నువ్వు నాకే పూస్తుంటే..
1805. నా తలపులు చినుకులేననుకున్నా..
నువ్వింతకాలం పచ్చగా ఉన్నందుకు..
1806. మనసు వెతుకుతోంది..
అందరినీ మెప్పించే పూదారుంటే బాగుండని..
1807. నయనానికెప్పుడూ అరనవ్వులే..
తొలివేకువ నీవై నిద్దురలేపే క్షణాలుంటే..
1808. వసంతమానాడే అలిగింది..
తనను కాదని నిన్నే వలచానని
1809. నీవో అమాయకరాజువి..
నీ ఆస్థి స్వాతిముత్యమంటి మనసే..
1810. నా మనసుకెప్పుడూ రెక్కలుంటాయి..
వలరాజుల ఉచ్చునుండీ ఎగిరేందుకు..
1811. నిరాశతో వెనుదిరిగా..
నువ్వెగరేసిన గాలిపటంలో రంగులు నచ్చలేదనే..
1812. కంచికే పోదామనుకున్నాను..
కలవరిస్తావనుకొని మిగిలుండిపోయాను..
1813. నా మీద నుంచీ వీచినప్పుడే అనుకున్నా..
చిలిపిగాలి అల్లరేదో చేసేందుకు నిన్ను చేరబోతోందని..
1814. ఎన్నిసార్లు మూర్ఛపోయిందో మనసు..
కలలో తప్ప ఇలలో లేని అందానికి మోసపోయానని..
1815. నేటి వెతలన్నీ..
నిన్నటి తప్పులే
1816. నిదురలోనే ఉంటావెందుకలా..
రోజూ గుడిగంటలు దొంగిలించలేక చస్తున్నా..
1817. మనసున విరబూస్తున్నది..
అనుభూతుల పువ్వేదో తనను రాయమంటూ..
1818. చిగురిస్తూనే ఉన్న మనోవనాలు..
శిశిరాలెన్నిసార్లు రాల్చాలని చూసినా
1819. తూరుపువెళ్ళే రైలు వెనుకే రాసిపెట్టా
మనసు ఊసులు తెలుసుకుంటావని ప్రతిరోజూ..
1820. నా మనసుకి దాహం తీరినట్లే..
నీ అధరాల చిరునవ్వును తాగుతుంటే..
1821. సొబగుల సంతకాలు..
వయసుకి వాయనాలు..
1822. కన్నుల్లో చిలిపిదనం..
నీ పెదవులు నన్ను చదువుతుంటే..
1823. ఆరని వెలుతురే నువ్వు..
మనసుల్లో మరిన్నిదీపాలు వెలిగిస్తూ..
1824. రెక్కలుపంపి మరీ కలలోకి ఆహ్వానించావుగా..
రెప్పలవాకిలి మూసున్నా మనసు మెలకువేనంటూ..
1825. సంగీతలక్ష్మి చిన్నబోయింది..
తన స్వరార్చనను ఆదిలోనే అడ్డగించావని..
1826. ఆనందభాష్పాలతో చిగురించావేమో..
వెతక్కుండానే ఆచూకీ దొరికింది కనులకి..
1827. నిన్ను విస్మరించడం వల్లకాదు..
నీవు నన్ను విడిచిపోయినా..
1828. దాచేసాననేక స్పందనలను..
మాలికలుగా చదివి ఇబ్బంది పడతావనే..
1829. కొండమల్లె కొప్పు మీదికెక్కింది..
నీలమంటి కురులను మోహించే..
1830. మూడుముళ్ళు బరువయ్యాయేమో..
నాలుగోముడికి తేలికవ్వొచ్చని
1831. ప్రతిస్పందనలన్నీ మాలగా గుచ్చేసా..
మాలికగా మెడలోవేసి మురిపిద్దామనే..
1832. నమ్మకమేగా జీవితం..'
ఆశ ఆధారమనుకుంటే..
1833. గమ్మత్తైన అనుబంధమే మనది..
ప్రాణాల సైతం లెక్కలేదంటూ..
1834. కోరికలు గువ్వలై ఎగురుతుంటే ఆనందమే..
కన్నవారిని మరువకుంటే మరింత ప్రమోదమే..
1835. అంతరంగం బైటపడింది..
మనసద్దం పగిలినప్పుడే..
1836.మానవత్వం గెలిచింది..
వర్గాలుగా విభజించడం నీవు చేయలేవనే..
1837. యుద్దాలన్నీ వ్యర్ధమేగా..
మార్పు ముందుగా మనలో మొదలవకుంటే..
1838. మల్లెలెంతో మూగగా పరిమళిస్తున్నవి..
మన పరవశానికి తోడవ్వాలనేమో..
1839. నేనెప్పటికీ తారకనే..
ఎన్ని తారలు రాలినా నా ఉనికి నిలుపుకుంటూ..
1840. నువ్వు దూరమయ్యాకనే తెలిసింది..
నే పోగొట్టుక్కున్న సిరేమిటో..
1841. జీవనమెప్పుడూ చైతన్యమే..
ఆటుపోట్లకు కలతచెందక మనమూ ఉరకలెత్తితే..
1842. .వర్తమానాన్ని వరించక తప్పదు..
గతం నీడై అనుసరించినందుకు..
1843. అమ్మ కళ్ళలోంచీ తొంగిచూసా..
ప్రపంచం కమ్మగానే కనపడింది..
1844. జాబిల్లి విస్తుపోయినప్పుడే తెలుసులే..
నీ నెలవంక ఒంపులన్నీ నన్ను చూసాక పుట్టినవని..
1845. రోజుకో రూపంలో విచ్చేస్తున్నా..
నువ్వల్లే మాలికాతోరణాన్ని చూసేందుకే..
1846. రాతిరిరాగాలే తీద్దామిక..
సుప్రభాతగీతాలకి సెలవిచ్చేసాక..
1847. మత్తకోకిలవే ఆనాడు..
మత్తెక్కించే కాకిలా మారావు ఈనాడు..
1848. మనసు నవ్వుకుంది..
బాల్యంలోకి పయనించి స్మృతులను గిల్లుకున్నందుకే
1849. అందం మెరిసిపోతోంది..
అద్దం నన్ను కొత్తగా చూపించినందుకేనట..
1850. ఆమె కన్నుల్లో అగ్నిశిఖలు..
నీ విషాదస్రవంతిని గుర్తించినందుకే..
..................................... ********.....................................
No comments:
Post a Comment