..................................... ********.....................................
251. నా మనసెప్పుడూ విశాలమే..
విశేషించి నీలా మంచిమనసున్నవారికి..
252. ఆవేదనలూ అరుణిమలయ్యాయి..
నీ ప్రేమతీపిని మనసుకు అద్దుకున్నాయేమో
253. ఊయలూగుతోంది మది..
ఊహలమేనాలో కుదుపులకి..
254. బ్రతుకుని ఎలాగయినా ఈడ్చక తప్పదు..
మరణాన్ని లొంగదీసుకోవడం మాత్రం కుదరదుగా..
255. ఈనాటి రాబందులే..
ఆనాటి బంధువులేమో..
256. సిగ్గుపూలు చల్లావుగా ఎదలో
నిస్సిగ్గుగా ఎలా ఉండేది..
257. వేడుకయ్యింది విరహం..
నీ పిలుపుల వసంతగానం ఆలకించి..
258. అన్నీ వంకలే..
అలుకలలో నెలవంకలూ..ఆనందంలో గోరువంకలు..
259. కళ ఏముంది..
ఆ మోమున చిరునవ్వు లేకుంటే..
260. ఆశావాహదృక్పథం అలవాటయ్యింది అంతటి వేదనలోనూ..
దేవతలు తప్పక కరుణించి తీరతారని
261. నీ మనసెంత సుతిమెత్తనో..
కనకాంబరమంత సున్నితంగా నన్నలరిస్తూ..
262. మిథునంలో రతీమన్మథులు..
అరుణోదయ సరసోదయానికి సమాయత్తం అవమంటూ..
263. మనసుకి వసంతమేగా..
నీ తలపుల సహజీవనం చేస్తున్నందుకు..
264. అశ్వినినక్షత్రమని మరచినట్లున్నావు..
వాయువేగం పెంచమని వేడుకోవా మనసుని..
265. అందమేనాడో కనిపించిందిలే అనుభూతిలో..
ఇరువురమొకటై పూచిన గంధపుపువ్వులో..
266. అలరించావుగా అందమై..
అలసిన వేసంగి మనసుకి మల్లెలగంధమై
267. కన్నులకెంత ఆనందమో..
నీ కలలగమ్యం తామని తెలిసినందుకు..
268. కోరికలు కోకొల్లలు..
జీవితమూ చిన్నదేనేమో వాటి ముందు..
269. ఒయ్యారాలు పోతున్నాయి నదులు..
సముద్రుడిలో కలిసేందుకు వెళ్తున్నాయనే..
270. ఉత్సాహం నీరుగారిపోతుంది..
సంతోషమనే భ్రమని కన్నీరు కడిగేస్తుంటే..
271. కోటివసంతాలు వెల్లువెత్తాయి..
కొమ్మకి కోయిల పుట్టిందని తెలిసిందనేమో..
272. అమ్మానాన్నలు అలంకరణలేనట..
అద్దాలమేడలో మరబొమ్మల్లా..
273. అరనవ్వెంత మధురమో..
దుఃఖమైన మనసుని తేలిక చేసేస్తూ..
274. అంతఃకరణపై దృష్టి పెట్టాలి..
పోయేదేముంది మాలిన్యం తప్ప..
275. నవవసంతాన్నే..
శిశిరమెన్నిసార్లు రాల్చినా మళ్ళీ పుడుతూ..
276. అనుభవం పండింది నీ ప్రేమలో..
ఆషాడ గోరింటవై అరచేత చేరావనే..
277. మనిషితనపు పరిమళమెక్కడ మిగిలింది మనసులో..
అరిషడ్వికారమనే దుర్గంధమొచ్చి అక్రమంగా చేరాక..
278. మనిషితనపు పరిమళమే..
మనమింకా జీవించి ఉన్నామనుకొనే మనసుకు ఇవ్వగలిగే ఋజువు..
279. పరిమళాలకెప్పుడూ పరుగులే..
నీ ఉనికిని కనిపెట్టే ధ్యాసలో..
280. పరిమళించడం మానేసింది మనసు..
నిన్ను దూరంచేసాననే కాబోలు..
281. ద్విగిణీకృతమైంది పరిమళం మనసుకి..
శ్రామికసౌందర్యాన్ని కన్నుల్లో నింపుకుందనే..
282. పరిమళాన్ని త్యజించింది రేయి..
నీ పున్నమిస్పర్శని తడమలేకపోయిందనే..
283. మనసంతా పరిమళమే..
మల్లెకొమ్మలా తనలో నువ్వు మొలకెత్తావనే...
284. పరిమళమంటని వేసవయ్యానుగా..
నీ మల్లెమనసు నాది కాదనుకున్నందుకు..
285. నెరజాజులు తలవాల్చేసాయి..
నీ మనసు తాపానికి తగననుకున్నాయేమో..
286. విత్తులన్నీ మొలకెత్తాయి..
నీ మనసును పరిమళాల తీగల పొదరిల్లు చేయాలనే..
287. అక్షరస్పర్శ ఇన్నాళ్ళకు తెలిసింది..
ఆమె మనసందం రాసాక..
288. కానుకలిచ్చా కలల్ని..
నీ రేయి నిత్యప్రకాశం కావాలనే..
289. పున్నమికే పరిమళమద్దాను..
రేరాజు నావెనుకే అడుగేసి రావాలని...
290. చిత్తమే చెదిరింది..
నీ మధుర పరిమళ గంధాలకి..
291. నాదంటూ పరిమళమేముందని..
హృదయపుష్పాన్ని నీకర్చించాక..
292. శ్రమైకజీవనలోనే పరిమళమంతా..
రక్తాన్ని స్వేదంగా మార్చి చిందించినందుకు..
293. వసంతాన్ని మరచాయట మాలికలు..
భావాలపల్లకిలో మనసును ఊరేగిస్తూ..
294. చిన్నారి కేరింతలే లేతపరిమళాలు..
ఇంతకన్నా మనసుకెక్కడివి గిలిగింతలు..
295. మంచిమనసంటే అదే..
మానవత్వాన్ని ఉపకార పరిమళంతో పోల్చడం..
296. తరువులకెంత పరవశమో..
ప్రకృతి వెచ్చని పరిమళాల ఆస్వాదనలో..
297. పరవశించిన మయూరాన్నే..
నీలిమేఘపు పరిమళం వర్షమై కురిసినందుకే
298. కుసుమించించి కాగితం..
పరిమళించిన నీ అక్షరాన్ని హత్తుకున్నందుకే..
299. ఊసుల వాయినాలు వద్దన్నానందుకే..
ప్రతీరోజూ కావాలంటాయనే అల్లరిగాలులు..
300. నా మనసెప్పుడో నవ్వేసింది..
నీ సహజపరిమళాన్ని గ్రహించినప్పుడే
..................................... ********.....................................
251. నా మనసెప్పుడూ విశాలమే..
విశేషించి నీలా మంచిమనసున్నవారికి..
252. ఆవేదనలూ అరుణిమలయ్యాయి..
నీ ప్రేమతీపిని మనసుకు అద్దుకున్నాయేమో
253. ఊయలూగుతోంది మది..
ఊహలమేనాలో కుదుపులకి..
254. బ్రతుకుని ఎలాగయినా ఈడ్చక తప్పదు..
మరణాన్ని లొంగదీసుకోవడం మాత్రం కుదరదుగా..
255. ఈనాటి రాబందులే..
ఆనాటి బంధువులేమో..
256. సిగ్గుపూలు చల్లావుగా ఎదలో
నిస్సిగ్గుగా ఎలా ఉండేది..
257. వేడుకయ్యింది విరహం..
నీ పిలుపుల వసంతగానం ఆలకించి..
258. అన్నీ వంకలే..
అలుకలలో నెలవంకలూ..ఆనందంలో గోరువంకలు..
259. కళ ఏముంది..
ఆ మోమున చిరునవ్వు లేకుంటే..
260. ఆశావాహదృక్పథం అలవాటయ్యింది అంతటి వేదనలోనూ..
దేవతలు తప్పక కరుణించి తీరతారని
261. నీ మనసెంత సుతిమెత్తనో..
కనకాంబరమంత సున్నితంగా నన్నలరిస్తూ..
262. మిథునంలో రతీమన్మథులు..
అరుణోదయ సరసోదయానికి సమాయత్తం అవమంటూ..
263. మనసుకి వసంతమేగా..
నీ తలపుల సహజీవనం చేస్తున్నందుకు..
264. అశ్వినినక్షత్రమని మరచినట్లున్నావు..
వాయువేగం పెంచమని వేడుకోవా మనసుని..
265. అందమేనాడో కనిపించిందిలే అనుభూతిలో..
ఇరువురమొకటై పూచిన గంధపుపువ్వులో..
266. అలరించావుగా అందమై..
అలసిన వేసంగి మనసుకి మల్లెలగంధమై
267. కన్నులకెంత ఆనందమో..
నీ కలలగమ్యం తామని తెలిసినందుకు..
268. కోరికలు కోకొల్లలు..
జీవితమూ చిన్నదేనేమో వాటి ముందు..
269. ఒయ్యారాలు పోతున్నాయి నదులు..
సముద్రుడిలో కలిసేందుకు వెళ్తున్నాయనే..
270. ఉత్సాహం నీరుగారిపోతుంది..
సంతోషమనే భ్రమని కన్నీరు కడిగేస్తుంటే..
271. కోటివసంతాలు వెల్లువెత్తాయి..
కొమ్మకి కోయిల పుట్టిందని తెలిసిందనేమో..
272. అమ్మానాన్నలు అలంకరణలేనట..
అద్దాలమేడలో మరబొమ్మల్లా..
273. అరనవ్వెంత మధురమో..
దుఃఖమైన మనసుని తేలిక చేసేస్తూ..
274. అంతఃకరణపై దృష్టి పెట్టాలి..
పోయేదేముంది మాలిన్యం తప్ప..
275. నవవసంతాన్నే..
శిశిరమెన్నిసార్లు రాల్చినా మళ్ళీ పుడుతూ..
276. అనుభవం పండింది నీ ప్రేమలో..
ఆషాడ గోరింటవై అరచేత చేరావనే..
277. మనిషితనపు పరిమళమెక్కడ మిగిలింది మనసులో..
అరిషడ్వికారమనే దుర్గంధమొచ్చి అక్రమంగా చేరాక..
278. మనిషితనపు పరిమళమే..
మనమింకా జీవించి ఉన్నామనుకొనే మనసుకు ఇవ్వగలిగే ఋజువు..
279. పరిమళాలకెప్పుడూ పరుగులే..
నీ ఉనికిని కనిపెట్టే ధ్యాసలో..
280. పరిమళించడం మానేసింది మనసు..
నిన్ను దూరంచేసాననే కాబోలు..
281. ద్విగిణీకృతమైంది పరిమళం మనసుకి..
శ్రామికసౌందర్యాన్ని కన్నుల్లో నింపుకుందనే..
282. పరిమళాన్ని త్యజించింది రేయి..
నీ పున్నమిస్పర్శని తడమలేకపోయిందనే..
283. మనసంతా పరిమళమే..
మల్లెకొమ్మలా తనలో నువ్వు మొలకెత్తావనే...
284. పరిమళమంటని వేసవయ్యానుగా..
నీ మల్లెమనసు నాది కాదనుకున్నందుకు..
285. నెరజాజులు తలవాల్చేసాయి..
నీ మనసు తాపానికి తగననుకున్నాయేమో..
286. విత్తులన్నీ మొలకెత్తాయి..
నీ మనసును పరిమళాల తీగల పొదరిల్లు చేయాలనే..
287. అక్షరస్పర్శ ఇన్నాళ్ళకు తెలిసింది..
ఆమె మనసందం రాసాక..
288. కానుకలిచ్చా కలల్ని..
నీ రేయి నిత్యప్రకాశం కావాలనే..
289. పున్నమికే పరిమళమద్దాను..
రేరాజు నావెనుకే అడుగేసి రావాలని...
290. చిత్తమే చెదిరింది..
నీ మధుర పరిమళ గంధాలకి..
291. నాదంటూ పరిమళమేముందని..
హృదయపుష్పాన్ని నీకర్చించాక..
292. శ్రమైకజీవనలోనే పరిమళమంతా..
రక్తాన్ని స్వేదంగా మార్చి చిందించినందుకు..
293. వసంతాన్ని మరచాయట మాలికలు..
భావాలపల్లకిలో మనసును ఊరేగిస్తూ..
294. చిన్నారి కేరింతలే లేతపరిమళాలు..
ఇంతకన్నా మనసుకెక్కడివి గిలిగింతలు..
295. మంచిమనసంటే అదే..
మానవత్వాన్ని ఉపకార పరిమళంతో పోల్చడం..
296. తరువులకెంత పరవశమో..
ప్రకృతి వెచ్చని పరిమళాల ఆస్వాదనలో..
297. పరవశించిన మయూరాన్నే..
నీలిమేఘపు పరిమళం వర్షమై కురిసినందుకే
298. కుసుమించించి కాగితం..
పరిమళించిన నీ అక్షరాన్ని హత్తుకున్నందుకే..
299. ఊసుల వాయినాలు వద్దన్నానందుకే..
ప్రతీరోజూ కావాలంటాయనే అల్లరిగాలులు..
300. నా మనసెప్పుడో నవ్వేసింది..
నీ సహజపరిమళాన్ని గ్రహించినప్పుడే
..................................... ********.....................................
No comments:
Post a Comment