..................................... ********.....................................
101. వెన్నెలలో తడిచిందేమో..
అమాస కరిగిపోయింది..
102. చొరబడిపోయా ఎదలో..
చనువిచ్చి చేరదీసావనే..
103. కందిరీగే నా జ్ఞాపకం..
కదిపితే కుట్టకుండా వెళ్ళదుగా..
104. భానోదయమయ్యిందిగా..
సూర్యకాంతిపువ్వునై నీవైపు తిరుగడమే తరువాయిక..
105. ఏమనాలో నిన్ను..
ఘడికోమారు మనసు తలపునలా తడుతూంటే..
106.నిషాదమేగా మిగిలింది..
షడ్జమం రిషబం మథ్యమాలు విడిచెళ్ళాక
107. చూపుల వాయనాలిచ్చా
కన్నుల పేరంటానికి..
108. మల్లెలకెన్ని మాయలో
తమకమైన మదికి గమకాలు నేర్పిస్తూ..
109. ప్రేమెప్పుడూ నులివెచ్చనే
కమ్మని కవితల్లో వెచ్చగా బయటపడుతూ..
110. ఆమని సోయగం అరుణిమయ్యింది..
వసంతరాత్రి వైభోగం కాబోలు..
111. కనుకొలుకుల్లో నిలిచింది కన్నీరు..
ఎండిన కలల తీరం చేరి ఆవిరి కాలేక..
112. గమ్మత్తైన పారిజాతానివే..
పూజకు సిద్ధం చేసేలోపే వాడిపోతూ
113. తుమ్మెదలవుతూ నీ కన్నులు..
పువ్వులనుకున్నాయేమో నా పెదవులను..
114. అతిశయమెక్కువే నీకు..
చూపులతోనే నా మృదుత్వాన్ని కొలిచేస్తూ
115. ఆహ్వానించానుగా కలలోకందుకే..
కాసేపైన నా రెప్పలకౌగిట్లో సేదతీరతావని..
116. నీ రెప్పలకౌగిట్లొనే విశ్రాంతి..
కమ్మనికలనై కాసేపలా సేదతీరాలనే..
117. వేపపువ్వూ తీపయ్యింది..
సొంతఖర్చుతో కొన్నందుకే..
118. ఓటమి శాశ్వతమూ కాదు..
గెలుపు నిత్యమూ రాదు..
119. గతం గరళమయ్యిందనేమో..
గొంతు మూగబోయింది..
120. కపోలాలకీ దాహమట..
కన్నీటితోనే తీరతాయని..ఆవురావురని తాగేస్తూ
121. కొన్ని కన్నీళ్ళంతే..
కంటికి తెరలై కలలనూ కప్పేస్తాయి..
122. శిశిరానికి వగలెక్కువైంది..
వసంతమెదురుగానే తనను వేడుకుంటున్నావని కాబోలు..
123. మనసును దాచేసానందుకే ఎదపొరలో..
ఆలోచను మాత్రమే మెదడుకిచ్చి..
124. చిన్న కృతజ్ఞతైనా సరిపోతుందిలే..
మేలైన ఉన్నతమైన ఆదర్శముంటే ..
125. అంతరంగం అతలాకుతలమే..
అర్ధం లేని సమాంతరవాదనలు ఆలకిస్తుంటే..
126. ఆస్వాదించలేకున్నా ఒంటరిగా..
నవ్వులనేవి బహువచనాలనేమో..
127. మారుస్తున్నారందుకే ఇంటివాస్తుని..
చెరపలేకున్నా చేతిగీతని..జననమరణాలని ఆపలేక
128. సంవత్సరమంతా గుర్తుండాలనే..
ఉగాదిపచ్చడిలో కలిపేసా..మమతల రుచిని..
129. అక్షరాలే ఆలంబన..
దిగుళ్ళ తెగుళ్ళను తేలిగ్గా నరికేందుకు..
130. అడుగు తడబడుతోంది..
పయనం నీ హృదయంలోకని తెలిసినందుకే
131. ఉల్లాస మౌనమేననుకుంటా..
అంతర్నాద సంగీతానికి వివశమవుతూ మది..
132. పోరాటం తప్పదుగా ఎవ్వరికైనా..
వాస్తవంలో జీవించక తప్పదనుకుంటే..
133. నవ్వుతూనే ఉన్నానందుకే..
వేసవిని వెన్నెలగా మార్చేద్దామని నీకోసం..
134. సనాతనభావాలేనట..
వేషభాషల్లోనే కానీ అంతరంగాల్లో కాదట
135. అస్తిత్వపు ఆలోచనలడుగంటాయి..
అంచుల్లేని నరకంలోకి అడుగులు పయనమైనప్పుడే..
136. పరకాయప్రవేశం చేయించావుగా..
అరనిముషంలో మనిషి నుండి పక్షిగా..
137. అజ్ఞానమే మరి..
ఆదర్శాలను ఆచరణలో పెట్టలేని అసహాయతకి..
138. మనసోడిపోయింది..
నీ మాటలు నమ్మినందుకు సాక్ష్యమే లేక..
139. అన్యాయమేగా నమ్మించడం..
నా కన్నీటిని ఆనందభాష్పాలుగా పొరపడటం
140. కన్ను కొట్టింది సరిపోలేదా
మనసు పడగొడదామని చూస్తావేం
141. అనుసరిస్తూనే ఉన్నా..
నీ కనుకొలుకుల్లో నిలిచిన వేదననాదేనని..
142. తాపమెంతకూ వీడదే..
వేసవని తెలిసినా..మోహమనే భ్రమలో..
143. నా హృదయమెప్పుడూ పదిలమేగా..
నీ చరణాలు కమలాలయినందుకు..
144. అపనమ్మక అడుగుజాడల్లో..
ఖాళీ అవుతూ హృదయ వాటిక..
145. అలుక దద్దరిల్లింది..
పదిమందికీ ఉచిత వినోదం పంచేలా
146. మౌనాన్నే జోకొట్టా..
నిన్ను గెలిపిద్దామని
147. అక్షరం అలిగింది..
గులాబీనిచ్చినా ముళ్ళనే ముట్టుకొని నిందిస్తావని..
148. మనసెంతకూ లిఖించవే..
నీకై ఎంత వేదన మింగినా..
149. నీ మాటలు వినాలనే ఉంది..
రేపటి చీకట్లోనూ నాకు తోడుంటానంటే..
150.ఏ అలసత్వానికి బానిసలో..
మాటలనే ఛర్నాకోలు చేసి కర్కశంగా ఝుళిపించే మొరటోళ్ళు..
..................................... ********.....................................
101. వెన్నెలలో తడిచిందేమో..
అమాస కరిగిపోయింది..
102. చొరబడిపోయా ఎదలో..
చనువిచ్చి చేరదీసావనే..
103. కందిరీగే నా జ్ఞాపకం..
కదిపితే కుట్టకుండా వెళ్ళదుగా..
104. భానోదయమయ్యిందిగా..
సూర్యకాంతిపువ్వునై నీవైపు తిరుగడమే తరువాయిక..
105. ఏమనాలో నిన్ను..
ఘడికోమారు మనసు తలపునలా తడుతూంటే..
106.నిషాదమేగా మిగిలింది..
షడ్జమం రిషబం మథ్యమాలు విడిచెళ్ళాక
107. చూపుల వాయనాలిచ్చా
కన్నుల పేరంటానికి..
108. మల్లెలకెన్ని మాయలో
తమకమైన మదికి గమకాలు నేర్పిస్తూ..
109. ప్రేమెప్పుడూ నులివెచ్చనే
కమ్మని కవితల్లో వెచ్చగా బయటపడుతూ..
110. ఆమని సోయగం అరుణిమయ్యింది..
వసంతరాత్రి వైభోగం కాబోలు..
111. కనుకొలుకుల్లో నిలిచింది కన్నీరు..
ఎండిన కలల తీరం చేరి ఆవిరి కాలేక..
112. గమ్మత్తైన పారిజాతానివే..
పూజకు సిద్ధం చేసేలోపే వాడిపోతూ
113. తుమ్మెదలవుతూ నీ కన్నులు..
పువ్వులనుకున్నాయేమో నా పెదవులను..
114. అతిశయమెక్కువే నీకు..
చూపులతోనే నా మృదుత్వాన్ని కొలిచేస్తూ
115. ఆహ్వానించానుగా కలలోకందుకే..
కాసేపైన నా రెప్పలకౌగిట్లో సేదతీరతావని..
116. నీ రెప్పలకౌగిట్లొనే విశ్రాంతి..
కమ్మనికలనై కాసేపలా సేదతీరాలనే..
117. వేపపువ్వూ తీపయ్యింది..
సొంతఖర్చుతో కొన్నందుకే..
118. ఓటమి శాశ్వతమూ కాదు..
గెలుపు నిత్యమూ రాదు..
119. గతం గరళమయ్యిందనేమో..
గొంతు మూగబోయింది..
120. కపోలాలకీ దాహమట..
కన్నీటితోనే తీరతాయని..ఆవురావురని తాగేస్తూ
121. కొన్ని కన్నీళ్ళంతే..
కంటికి తెరలై కలలనూ కప్పేస్తాయి..
122. శిశిరానికి వగలెక్కువైంది..
వసంతమెదురుగానే తనను వేడుకుంటున్నావని కాబోలు..
123. మనసును దాచేసానందుకే ఎదపొరలో..
ఆలోచను మాత్రమే మెదడుకిచ్చి..
124. చిన్న కృతజ్ఞతైనా సరిపోతుందిలే..
మేలైన ఉన్నతమైన ఆదర్శముంటే ..
125. అంతరంగం అతలాకుతలమే..
అర్ధం లేని సమాంతరవాదనలు ఆలకిస్తుంటే..
126. ఆస్వాదించలేకున్నా ఒంటరిగా..
నవ్వులనేవి బహువచనాలనేమో..
127. మారుస్తున్నారందుకే ఇంటివాస్తుని..
చెరపలేకున్నా చేతిగీతని..జననమరణాలని ఆపలేక
128. సంవత్సరమంతా గుర్తుండాలనే..
ఉగాదిపచ్చడిలో కలిపేసా..మమతల రుచిని..
129. అక్షరాలే ఆలంబన..
దిగుళ్ళ తెగుళ్ళను తేలిగ్గా నరికేందుకు..
130. అడుగు తడబడుతోంది..
పయనం నీ హృదయంలోకని తెలిసినందుకే
131. ఉల్లాస మౌనమేననుకుంటా..
అంతర్నాద సంగీతానికి వివశమవుతూ మది..
132. పోరాటం తప్పదుగా ఎవ్వరికైనా..
వాస్తవంలో జీవించక తప్పదనుకుంటే..
133. నవ్వుతూనే ఉన్నానందుకే..
వేసవిని వెన్నెలగా మార్చేద్దామని నీకోసం..
134. సనాతనభావాలేనట..
వేషభాషల్లోనే కానీ అంతరంగాల్లో కాదట
135. అస్తిత్వపు ఆలోచనలడుగంటాయి..
అంచుల్లేని నరకంలోకి అడుగులు పయనమైనప్పుడే..
136. పరకాయప్రవేశం చేయించావుగా..
అరనిముషంలో మనిషి నుండి పక్షిగా..
137. అజ్ఞానమే మరి..
ఆదర్శాలను ఆచరణలో పెట్టలేని అసహాయతకి..
138. మనసోడిపోయింది..
నీ మాటలు నమ్మినందుకు సాక్ష్యమే లేక..
139. అన్యాయమేగా నమ్మించడం..
నా కన్నీటిని ఆనందభాష్పాలుగా పొరపడటం
140. కన్ను కొట్టింది సరిపోలేదా
మనసు పడగొడదామని చూస్తావేం
141. అనుసరిస్తూనే ఉన్నా..
నీ కనుకొలుకుల్లో నిలిచిన వేదననాదేనని..
142. తాపమెంతకూ వీడదే..
వేసవని తెలిసినా..మోహమనే భ్రమలో..
143. నా హృదయమెప్పుడూ పదిలమేగా..
నీ చరణాలు కమలాలయినందుకు..
144. అపనమ్మక అడుగుజాడల్లో..
ఖాళీ అవుతూ హృదయ వాటిక..
145. అలుక దద్దరిల్లింది..
పదిమందికీ ఉచిత వినోదం పంచేలా
146. మౌనాన్నే జోకొట్టా..
నిన్ను గెలిపిద్దామని
147. అక్షరం అలిగింది..
గులాబీనిచ్చినా ముళ్ళనే ముట్టుకొని నిందిస్తావని..
148. మనసెంతకూ లిఖించవే..
నీకై ఎంత వేదన మింగినా..
149. నీ మాటలు వినాలనే ఉంది..
రేపటి చీకట్లోనూ నాకు తోడుంటానంటే..
150.ఏ అలసత్వానికి బానిసలో..
మాటలనే ఛర్నాకోలు చేసి కర్కశంగా ఝుళిపించే మొరటోళ్ళు..
..................................... ********.....................................
No comments:
Post a Comment