..................................... ********.....................................
601. తన అంతరంగ పయనమెప్పుడూ శూన్యంలోకేనట..
ఏ రహస్యాన్ని అన్వేషించే యాతనో..
602.. నువ్వో శూన్యానివేగా..
నేనొక్కటై నీ ముందు చేరి విలువ పెంచకపోయుంటే
603. కాలే కడుపు నిండితే చాలుగా..
దినదినమూ ఓ ఉత్సవంగా మారేందుకు..
604. నీ చూపులే వెలుగులు..
చీకటిలో చిరుదివ్వెలై నవ్వుతూ..
605. సోయగం ఆమెదే..
రాసేది మాత్రం నీ చూపులేగా..
606. మనసు కడలవుతోంది..
ఆటుపోట్లంటూ నువ్వలా తాకిన ప్రతిసారీ..
607. అడ్డదారులున్నందుకేమో..
ఎంచుకోలేని నిస్సహాయతలో వాడు..
608. రుబాయిలు రాస్తోంది మది..
ఏ చైతన్యస్రవంతిలో ఓలలాడినందుకో
609. నీకున్న వేయివ్యాపకాలూ నేనేగా..
విరహమంటూ వేధిస్తుంటే నమ్మేదెలా
610. నవరాగాలేమో నీ నవ్వులు..
నిలువెల్లా అనురాగం నింపేస్తూ
611. నవరాగాలేగా నా నవ్వులు..
పంచరత్నాలను అలవోకగా పాడేస్తూ..
612. ప్రియమైన సుప్రభాతాలే..
సారంగీవాద్యమంటి నీ నవ్వులతో నిద్దురలేస్తే
613. కాలే కడుపు నిండితే చాలుగా..
దినదినమూ ఓ ఉత్సవంగా మారేందుకు..
614. నీ చూపులే వెలుగులు..
చీకటిలో చిరుదివ్వెలై నవ్వుతూ
615. సోయగం ఆమెదే..
రాసేది మాత్రం నీ చూపులేగా..
616. మరందాలేగా నీ భావనలు..
తీయందనాలను నాకు పూసేవేళల్లో
617. వేసవి మనసు చల్లబడింది..
సాయంకాలం వీచిందనో..కాలమే సాయమై వీచిందో మరి.
618. మనసు కడలవుతోంది..
ఆటుపోట్లంటూ నువ్వలా తాకిన ప్రతిసారీ.
619. ఆలకిస్తున్నా నిన్నే..
నవరాగాలూ నీ మౌనంలో వినిపిస్తున్నందుకే.
620. మౌనంలోనే రాస్తున్నా..
మహాకావ్యం అవుతుందని..
621. నీ మౌనగీతాలే నాకు మానసగీతాలు..
ఆరాధనే ఆలపనై నన్ను తాకినందుకు..
622. సుజనబాంధవుడే నవనీతచోరుడు..
శిష్టరక్షణుడే సుధాచందనుడు..
623. దారెన్నటికీ తప్పిపోనుగా..
నా ప్రేమకు చిరునామా నీవైతే..
624. అనాదికాలపు అర్తనుకుంట..
భావకవిత్వమై కురుస్తోంది ఆ మనసున..
625. పంచదారలే నీ పలుకులు..
మనసును తీయగా మరిగిస్తూ..
626. నా మనసుకెందుకో అనుకోని ప్రకంపనాలు..
గుండెపొరల్లో ఏ సర్దుబాట్లు జరిగాయనో..
627. సరిగమలనే మొదలెట్టా..
గమకాలై సాగింది విరిచూపుల విభావరి..'
628. మల్లెపందిరికి సిద్దం చేసావనుకున్న మదిని..
రుధిరంతో తడిపి ఎర్రమల్లెలు పూయిస్తావనుకోలా..
629. నన్నలంకరించినందుకేనా..
నీ ప్రతి కదలికలో పరిమళాలు..
630. నువ్వు ఆవహిస్తున్నందుకేగా..
నాలో అనుకోని వింతైన తడబాట్లు..
631. నువ్వుంటే చాలు..
నాలో మౌనానికీ విరహం దూరమవుతూ..
632. నీ కన్నుల్లో ఎన్ని ఇంద్రధనుస్సులో..
ఒక్కోరంగునీ సరికొత్తగా నాకు పరిచయిస్తూ..
633. కనిపించని గాయాలైతేనేం మదిలో..
కవితలుగా కూర్చేస్తున్నాగా నిన్నలరించేందుకు..
634. నా ఆవేశానికి తెరవేసేసా..
నీ ఆరాధనకు అడ్డొస్తోందని..
635. కన్నీటికీ ఎరుపంటింది..
స్రవిస్తున్న రుధిరాన్నే కలం నింపుకోగలదని..
636. అతుకులేస్తూనే ఉన్నా మనసుకి..
చితికినమనసు నలుగురికీ కనపడకూడదనే..
637. భావాలు రాక నేను..
అనుభూతి కాలేక నీవు..
638. నా అందాలన్నీ అలుకలే..
నీ అనునయానికై ఎదురుచూస్తూ..
639. సిగ్గంటూనే పెదవిని తాకావెందుకలా..
చిగురుటాకై తనువెల్లా కంపించేందుకా..
640. మూసిన రెప్పలకేగా కలలు..
పెదాల వెన్నెలతో మేల్కొల్పాలనీ..
641. మెలకువ వద్దంటూ మనసు..
కలలకౌగిట్లో నిన్ను బంధించాలనే..
642.అలసటెందుక్కడిదిలే ఆ అధరాలకి..
ఆనందపు అంచుల్లో తానుంటే..
643. కొత్త ఆటలు నేర్చాయేమో అధరాలు..
వేడుకలూ వినోదాల్లోనూ తామే ముందుండాలంటూ...
644. మరకంటితేనేమి భావానికి..
మెచ్చే భావకులు తుడిచి చదివేరుగా..
645. మరకంటితేనేమి నైపుణ్యానికి..
తగిన సమయానికి మెరుగై మెరిసేనుగా..
646. మూసినరెప్పలకెన్ని ముద్దర్లో..
పున్నమిరాగాన్ని సాధన చేసి అలసుంటాయేమో నీ పెదవులు
647. నిద్దురను పంపేసాలే..
నీ చివురులు వేసిన కలలను నే తిలకించాలనే
648. అసమానం నీ వలపు ప్రబంధం..
నన్నలవోకగా రాసేస్తూ నీ అక్షరాల్లో..
649. పంచమస్వరం పరిచయమయ్యుంటుంది..
అల్లరికోయిల ప్రేమగీతాలు మాత్రమే ఆలపిస్తూ
650. అక్షరానికీ ఆవేదనే..
నిన్ను వెన్నలగా రాద్దామంటే కదలని కలాన్ని చూస్తూ..
..................................... ********.....................................
601. తన అంతరంగ పయనమెప్పుడూ శూన్యంలోకేనట..
ఏ రహస్యాన్ని అన్వేషించే యాతనో..
602.. నువ్వో శూన్యానివేగా..
నేనొక్కటై నీ ముందు చేరి విలువ పెంచకపోయుంటే
603. కాలే కడుపు నిండితే చాలుగా..
దినదినమూ ఓ ఉత్సవంగా మారేందుకు..
604. నీ చూపులే వెలుగులు..
చీకటిలో చిరుదివ్వెలై నవ్వుతూ..
605. సోయగం ఆమెదే..
రాసేది మాత్రం నీ చూపులేగా..
606. మనసు కడలవుతోంది..
ఆటుపోట్లంటూ నువ్వలా తాకిన ప్రతిసారీ..
607. అడ్డదారులున్నందుకేమో..
ఎంచుకోలేని నిస్సహాయతలో వాడు..
608. రుబాయిలు రాస్తోంది మది..
ఏ చైతన్యస్రవంతిలో ఓలలాడినందుకో
609. నీకున్న వేయివ్యాపకాలూ నేనేగా..
విరహమంటూ వేధిస్తుంటే నమ్మేదెలా
610. నవరాగాలేమో నీ నవ్వులు..
నిలువెల్లా అనురాగం నింపేస్తూ
611. నవరాగాలేగా నా నవ్వులు..
పంచరత్నాలను అలవోకగా పాడేస్తూ..
612. ప్రియమైన సుప్రభాతాలే..
సారంగీవాద్యమంటి నీ నవ్వులతో నిద్దురలేస్తే
613. కాలే కడుపు నిండితే చాలుగా..
దినదినమూ ఓ ఉత్సవంగా మారేందుకు..
614. నీ చూపులే వెలుగులు..
చీకటిలో చిరుదివ్వెలై నవ్వుతూ
615. సోయగం ఆమెదే..
రాసేది మాత్రం నీ చూపులేగా..
616. మరందాలేగా నీ భావనలు..
తీయందనాలను నాకు పూసేవేళల్లో
617. వేసవి మనసు చల్లబడింది..
సాయంకాలం వీచిందనో..కాలమే సాయమై వీచిందో మరి.
618. మనసు కడలవుతోంది..
ఆటుపోట్లంటూ నువ్వలా తాకిన ప్రతిసారీ.
619. ఆలకిస్తున్నా నిన్నే..
నవరాగాలూ నీ మౌనంలో వినిపిస్తున్నందుకే.
620. మౌనంలోనే రాస్తున్నా..
మహాకావ్యం అవుతుందని..
621. నీ మౌనగీతాలే నాకు మానసగీతాలు..
ఆరాధనే ఆలపనై నన్ను తాకినందుకు..
622. సుజనబాంధవుడే నవనీతచోరుడు..
శిష్టరక్షణుడే సుధాచందనుడు..
623. దారెన్నటికీ తప్పిపోనుగా..
నా ప్రేమకు చిరునామా నీవైతే..
624. అనాదికాలపు అర్తనుకుంట..
భావకవిత్వమై కురుస్తోంది ఆ మనసున..
625. పంచదారలే నీ పలుకులు..
మనసును తీయగా మరిగిస్తూ..
626. నా మనసుకెందుకో అనుకోని ప్రకంపనాలు..
గుండెపొరల్లో ఏ సర్దుబాట్లు జరిగాయనో..
627. సరిగమలనే మొదలెట్టా..
గమకాలై సాగింది విరిచూపుల విభావరి..'
628. మల్లెపందిరికి సిద్దం చేసావనుకున్న మదిని..
రుధిరంతో తడిపి ఎర్రమల్లెలు పూయిస్తావనుకోలా..
629. నన్నలంకరించినందుకేనా..
నీ ప్రతి కదలికలో పరిమళాలు..
630. నువ్వు ఆవహిస్తున్నందుకేగా..
నాలో అనుకోని వింతైన తడబాట్లు..
631. నువ్వుంటే చాలు..
నాలో మౌనానికీ విరహం దూరమవుతూ..
632. నీ కన్నుల్లో ఎన్ని ఇంద్రధనుస్సులో..
ఒక్కోరంగునీ సరికొత్తగా నాకు పరిచయిస్తూ..
633. కనిపించని గాయాలైతేనేం మదిలో..
కవితలుగా కూర్చేస్తున్నాగా నిన్నలరించేందుకు..
634. నా ఆవేశానికి తెరవేసేసా..
నీ ఆరాధనకు అడ్డొస్తోందని..
635. కన్నీటికీ ఎరుపంటింది..
స్రవిస్తున్న రుధిరాన్నే కలం నింపుకోగలదని..
636. అతుకులేస్తూనే ఉన్నా మనసుకి..
చితికినమనసు నలుగురికీ కనపడకూడదనే..
637. భావాలు రాక నేను..
అనుభూతి కాలేక నీవు..
638. నా అందాలన్నీ అలుకలే..
నీ అనునయానికై ఎదురుచూస్తూ..
639. సిగ్గంటూనే పెదవిని తాకావెందుకలా..
చిగురుటాకై తనువెల్లా కంపించేందుకా..
640. మూసిన రెప్పలకేగా కలలు..
పెదాల వెన్నెలతో మేల్కొల్పాలనీ..
641. మెలకువ వద్దంటూ మనసు..
కలలకౌగిట్లో నిన్ను బంధించాలనే..
642.అలసటెందుక్కడిదిలే ఆ అధరాలకి..
ఆనందపు అంచుల్లో తానుంటే..
643. కొత్త ఆటలు నేర్చాయేమో అధరాలు..
వేడుకలూ వినోదాల్లోనూ తామే ముందుండాలంటూ...
644. మరకంటితేనేమి భావానికి..
మెచ్చే భావకులు తుడిచి చదివేరుగా..
645. మరకంటితేనేమి నైపుణ్యానికి..
తగిన సమయానికి మెరుగై మెరిసేనుగా..
646. మూసినరెప్పలకెన్ని ముద్దర్లో..
పున్నమిరాగాన్ని సాధన చేసి అలసుంటాయేమో నీ పెదవులు
647. నిద్దురను పంపేసాలే..
నీ చివురులు వేసిన కలలను నే తిలకించాలనే
648. అసమానం నీ వలపు ప్రబంధం..
నన్నలవోకగా రాసేస్తూ నీ అక్షరాల్లో..
649. పంచమస్వరం పరిచయమయ్యుంటుంది..
అల్లరికోయిల ప్రేమగీతాలు మాత్రమే ఆలపిస్తూ
650. అక్షరానికీ ఆవేదనే..
నిన్ను వెన్నలగా రాద్దామంటే కదలని కలాన్ని చూస్తూ..
..................................... ********.....................................
No comments:
Post a Comment