..................................... ********.....................................
1301. ముభావమైపోయా..
నీ పరిమళం నేటికి నన్ను తాకలేదనే.
1302. కన్నీరు కరిగి వాగయ్యింది..
ఉరకలెత్తే గోదారికి దారడుగుతూ..
1303. మనోవిహంగ వీక్షణం..
నీ మనసుకు ద్వారం కనుగొనాలని..
1304. నీలికన్నులకు ఎర్రని కన్నీరు..
విరహపు వేదన అతిశయించినందుకే..
1305.గోరంత ఆనందం చాలు..
జీవితం తిరిగి మొలకెత్తేందుకు..
1306. మల్లెలగంధం మైమరువనిదే..
తూచలేని పారవస్యాన్ని చల్లదనానికి కలిపిచ్చినందుకే..
1307. అస్తిత్వాన్ని వెతుకడం మానేసానందుకే..
ఆనందదీప్తులకి ఆనవాళ్ళు దొరకలేదనే..
1308. నవపల్లవాల రాగం వినబడుతోంది..
వినీలిత హృదయాన్నేదో తడిమినట్లుంది..!
1309. నిరంతర యాతనలే..
కంటికి నువ్వు దూరమై..గుండెకు స్పందన కరువై..
1310. ఒంటరితనమెక్కడిది మనసుకు..
నీ నామధ్యానంలో నిరతం తానుంటే..
1311. కలలకే శ్రద్ధ పెరిగిందో మరి..
నిదురలో సైతం నీతో అడుగులేసేస్తూ..
1312. విజయం వెనక్కు మళ్ళింది..
కేవలం కలల్లోనే ఉరకలెత్తేవాడని..
1313. మనసు కరిగి నీరయ్యింది..
అర్ధాంతరంగా నన్నిడిచి నువ్వెళ్ళినందుకే..
1314. వెలికి తీస్తున్నా జ్ఞాపకాలను..
మరపురాని ప్రేమను తడుముకుందామనే..
1315. నా గుండె జారి గల్లంతయ్యింది..
నీ హృదయస్పందన నాలో కనుగొనగానే..
1316. ఆగిన గుండె కొట్టుకుంటోంది..
నువ్వొచ్చి ఊపిరి అందించావనే..
1317. బొమ్మను చేయడానికి మాత్రమే మిగిలాడు బ్రహ్మ..
అరచేతి గీతనూ అలవోకగా చెరిపేస్తుంటే మానవుడు..
1318. చట్టమూ చుట్టమవుతుందిగా..
అలవోకగా బంధుత్వం కలుపుకొనే మనసుంటే..
1319. కస్తూరి గంధం ఆవిరయ్యింది..
కన్నీటిలో కలిపి జార్చేసాక..
1320. కలువలకెంత ఆనందమో..
నా కన్నులను పోలి ధన్యమయ్యాయని..
1321. భావాల గుభాళింపు..
నెచ్చెలి పరిమళపు సోయగాన్ని రాస్తున్నందుకే..
1322. సరికొత్త భావాల మొలకలు..
నీ ఊసులను తాగినందుకే..
1323. సరిహద్దు దాటనంటోంది మది..
నిన్ను ప్రపంచంగా భావించినందుకే..
1324. మనసుకి చూపొచ్చింది..
కలువల కిరణాలతో సున్నితంగా స్పృసించావని..
1325. తలపోస్తున్నాలే..
నీవు మాట్లాడకున్నా నీ ఊసులను ఆలకిస్తూ..
1326. గతానికి సాక్ష్యమే నీవు..
స్మృతుల శకలాలతో బాధిస్తూ..
1327. కిరణాల తాకిడుందిగా నీ స్మృతిగా..
ప్రతి ఉదయం నీలా మేల్కొలుపుతూ..
1328. నేటికి గోదావరి దాహం తీరిందట..
రసాత్మకమైనా నీ కవితాఝరితో సంగమించినందుకు..!
1329. నా గుండెకెందుకో గుబులు..
ఆధిక్యంతో నీ గుండె అలా మెరుపు సమాధానాలిస్తుంటే..
1330. పుష్కర స్నానం చేసిందిగా తనువు..
మనసు మకిలీ వదిలిందని భావించినందుకేమో..
1331. ఊర్మిళని ఆవహించమనే అంటా..
కలవై కన్నుల్లో నిత్యకొలువుంటానంటే..
1332. నీ మనసు పూడుకుపోయుంటుంది..
చేతులకు చైతన్యం పంచినందుకు..
1333. అవే కళ్ళు..
నేటికీ నాలోనే ప్రకృతిని తిలకిస్తూ..
1334. మరందాలు కురిపించానందుకే..
వలపనే తేనెపాకంలో స్నానించి ఆనందపడతావనే..
1335. విజయపు బావుటా ఎగిరింది..
భూమిపై కాళ్ళు నిలిచినందుకే..
1336. అలరించేందుకు ప్రయత్నిస్తూంటానలా..
నీ చాటుపద్యంలో చోటు దొరికేదాకా..
1337. అక్షరముత్యాలకై దోసిలి పట్టా..
నీ కలంలోంచీ జారతాయనే..
1338. మొలకెత్తనిదేముంది..
సరైన విత్తనమంటూ నాటితే
1339. నిస్త్రాణను గుర్తించిందేమో వేణువు..
అపశృతులను వంశీనాదంతో సరిచేస్తూ..
1340. ఎడారివీచికయ్యింది మది..
అకస్మాత్తుగా నువ్వు నాకు దూరమయ్యాక..
1341. కన్నులకెంత ఆరాటమో..
కలనైనా నువ్వొస్తే చూపులతో హత్తుకోవాలని..
1342. కలలకెప్పుడూ ఆరాటమే..
కళ్ళముందుకు నువ్వొచ్చే శుభఘడియ కోసమే..
1343. మనిషితనానికి సమయం సరిపోదెప్పటికీ..
స్పర్శదీక్షతోనే కాలయాపన చేస్తుంటే..
1344. మనసుకెప్పుడూ ఆరాటమే..
మనిషిగానే జీవితాన్ని సాధించి గెలవాలని..
1345. ఆరాటానికీ చైతన్యమొచ్చింది..
నీ ఊపిరిలో జీవమై తొణికిసలాడిందని..
1346. అస్తిత్వాన్ని గెలవాలనే ఆరాటమే మనిషికి..
కీర్తిశిఖరాగ్రాన్ని అధిరోహిస్తేనే సాధ్యమని పరుగెడుతూ..
1347. నీకేం ప్రశ్నలుంటాయిలే..
ఒక అమాయకపు నవ్వుతోనే వేలసమాధానాలిస్తూ..
1348. చుక్కలు పక్కకి తొలగితే చాలనుకున్న కలువ..
నేలచూపులు చూసే నెలరాజును కనులారా చూడొచ్చని..
1349. కోలాటమాడతానంటూ మది..
నీ తలపులు తిరణాళ్ళను తలపిస్తుంటే..
1350. ఊసరవెల్లిలా బయటపడ్తూ కొందరు..
హరివిల్లును అనుకరించాలనే ఆరాటంలో
..................................... ********.....................................
1301. ముభావమైపోయా..
నీ పరిమళం నేటికి నన్ను తాకలేదనే.
1302. కన్నీరు కరిగి వాగయ్యింది..
ఉరకలెత్తే గోదారికి దారడుగుతూ..
1303. మనోవిహంగ వీక్షణం..
నీ మనసుకు ద్వారం కనుగొనాలని..
1304. నీలికన్నులకు ఎర్రని కన్నీరు..
విరహపు వేదన అతిశయించినందుకే..
1305.గోరంత ఆనందం చాలు..
జీవితం తిరిగి మొలకెత్తేందుకు..
1306. మల్లెలగంధం మైమరువనిదే..
తూచలేని పారవస్యాన్ని చల్లదనానికి కలిపిచ్చినందుకే..
1307. అస్తిత్వాన్ని వెతుకడం మానేసానందుకే..
ఆనందదీప్తులకి ఆనవాళ్ళు దొరకలేదనే..
1308. నవపల్లవాల రాగం వినబడుతోంది..
వినీలిత హృదయాన్నేదో తడిమినట్లుంది..!
1309. నిరంతర యాతనలే..
కంటికి నువ్వు దూరమై..గుండెకు స్పందన కరువై..
1310. ఒంటరితనమెక్కడిది మనసుకు..
నీ నామధ్యానంలో నిరతం తానుంటే..
1311. కలలకే శ్రద్ధ పెరిగిందో మరి..
నిదురలో సైతం నీతో అడుగులేసేస్తూ..
1312. విజయం వెనక్కు మళ్ళింది..
కేవలం కలల్లోనే ఉరకలెత్తేవాడని..
1313. మనసు కరిగి నీరయ్యింది..
అర్ధాంతరంగా నన్నిడిచి నువ్వెళ్ళినందుకే..
1314. వెలికి తీస్తున్నా జ్ఞాపకాలను..
మరపురాని ప్రేమను తడుముకుందామనే..
1315. నా గుండె జారి గల్లంతయ్యింది..
నీ హృదయస్పందన నాలో కనుగొనగానే..
1316. ఆగిన గుండె కొట్టుకుంటోంది..
నువ్వొచ్చి ఊపిరి అందించావనే..
1317. బొమ్మను చేయడానికి మాత్రమే మిగిలాడు బ్రహ్మ..
అరచేతి గీతనూ అలవోకగా చెరిపేస్తుంటే మానవుడు..
1318. చట్టమూ చుట్టమవుతుందిగా..
అలవోకగా బంధుత్వం కలుపుకొనే మనసుంటే..
1319. కస్తూరి గంధం ఆవిరయ్యింది..
కన్నీటిలో కలిపి జార్చేసాక..
1320. కలువలకెంత ఆనందమో..
నా కన్నులను పోలి ధన్యమయ్యాయని..
1321. భావాల గుభాళింపు..
నెచ్చెలి పరిమళపు సోయగాన్ని రాస్తున్నందుకే..
1322. సరికొత్త భావాల మొలకలు..
నీ ఊసులను తాగినందుకే..
1323. సరిహద్దు దాటనంటోంది మది..
నిన్ను ప్రపంచంగా భావించినందుకే..
1324. మనసుకి చూపొచ్చింది..
కలువల కిరణాలతో సున్నితంగా స్పృసించావని..
1325. తలపోస్తున్నాలే..
నీవు మాట్లాడకున్నా నీ ఊసులను ఆలకిస్తూ..
1326. గతానికి సాక్ష్యమే నీవు..
స్మృతుల శకలాలతో బాధిస్తూ..
1327. కిరణాల తాకిడుందిగా నీ స్మృతిగా..
ప్రతి ఉదయం నీలా మేల్కొలుపుతూ..
1328. నేటికి గోదావరి దాహం తీరిందట..
రసాత్మకమైనా నీ కవితాఝరితో సంగమించినందుకు..!
1329. నా గుండెకెందుకో గుబులు..
ఆధిక్యంతో నీ గుండె అలా మెరుపు సమాధానాలిస్తుంటే..
1330. పుష్కర స్నానం చేసిందిగా తనువు..
మనసు మకిలీ వదిలిందని భావించినందుకేమో..
1331. ఊర్మిళని ఆవహించమనే అంటా..
కలవై కన్నుల్లో నిత్యకొలువుంటానంటే..
1332. నీ మనసు పూడుకుపోయుంటుంది..
చేతులకు చైతన్యం పంచినందుకు..
1333. అవే కళ్ళు..
నేటికీ నాలోనే ప్రకృతిని తిలకిస్తూ..
1334. మరందాలు కురిపించానందుకే..
వలపనే తేనెపాకంలో స్నానించి ఆనందపడతావనే..
1335. విజయపు బావుటా ఎగిరింది..
భూమిపై కాళ్ళు నిలిచినందుకే..
1336. అలరించేందుకు ప్రయత్నిస్తూంటానలా..
నీ చాటుపద్యంలో చోటు దొరికేదాకా..
1337. అక్షరముత్యాలకై దోసిలి పట్టా..
నీ కలంలోంచీ జారతాయనే..
1338. మొలకెత్తనిదేముంది..
సరైన విత్తనమంటూ నాటితే
1339. నిస్త్రాణను గుర్తించిందేమో వేణువు..
అపశృతులను వంశీనాదంతో సరిచేస్తూ..
1340. ఎడారివీచికయ్యింది మది..
అకస్మాత్తుగా నువ్వు నాకు దూరమయ్యాక..
1341. కన్నులకెంత ఆరాటమో..
కలనైనా నువ్వొస్తే చూపులతో హత్తుకోవాలని..
1342. కలలకెప్పుడూ ఆరాటమే..
కళ్ళముందుకు నువ్వొచ్చే శుభఘడియ కోసమే..
1343. మనిషితనానికి సమయం సరిపోదెప్పటికీ..
స్పర్శదీక్షతోనే కాలయాపన చేస్తుంటే..
1344. మనసుకెప్పుడూ ఆరాటమే..
మనిషిగానే జీవితాన్ని సాధించి గెలవాలని..
1345. ఆరాటానికీ చైతన్యమొచ్చింది..
నీ ఊపిరిలో జీవమై తొణికిసలాడిందని..
1346. అస్తిత్వాన్ని గెలవాలనే ఆరాటమే మనిషికి..
కీర్తిశిఖరాగ్రాన్ని అధిరోహిస్తేనే సాధ్యమని పరుగెడుతూ..
1347. నీకేం ప్రశ్నలుంటాయిలే..
ఒక అమాయకపు నవ్వుతోనే వేలసమాధానాలిస్తూ..
1348. చుక్కలు పక్కకి తొలగితే చాలనుకున్న కలువ..
నేలచూపులు చూసే నెలరాజును కనులారా చూడొచ్చని..
1349. కోలాటమాడతానంటూ మది..
నీ తలపులు తిరణాళ్ళను తలపిస్తుంటే..
1350. ఊసరవెల్లిలా బయటపడ్తూ కొందరు..
హరివిల్లును అనుకరించాలనే ఆరాటంలో
..................................... ********.....................................
No comments:
Post a Comment