Thursday, 19 November 2015

ద్విపదాలు : 1701 నుండి 1750 వరకు

..................................... ********.....................................
1701. కొన్ని ప్రశ్నలకి సమాధానముండదు..
స్నేహమూ కల్తీఅయిన నేటిరోజుల్లో..
1702. మక్కువెక్కువే నాపై చిన్నారికలలకి..
రేయంతా నన్ను సంతోషపెట్టాలని..
1702. అమ్మతనమూ అంగడిసరుకే..
వెండితెర మీద తళుకై మెరవాలంటే..
1703. సొగసైన సారంగివే..
మౌనంలోనే విలువైన సమాచారాన్ని దాచేస్తూ..
1704. మనసు గాయపడిన సంగతి తెలిసింది..
సగం పుటలు చడవడంతో సరిపెట్టానందుకే..
1705. హృదయం నవ్వుకుంది..
గ్రీష్మాన్ని తరిమేసి వసంతాన్ని కలగన్నందుకే...
1706. ఏరువాకపున్నమని మరచినట్లున్నావు..
వెల్లువైన నవ్వు నక్షత్రాన్ని ముద్దాడిందందుకే..
1707. ఏరువాకపున్నమని గుర్తొచ్చినందుకే..
వెల్లువైన నవ్వు నక్షత్రాన్ని ముద్దాడుతానంటూ..
1708. తడియారనివే ఆ స్మృతులు..
రేయనకా పగలనకా ఉప్పొంగుతూ..
1709. ఎనలేని అనుబంధమేననుకున్నా..
మరణం మనల్ని విడదీసేవరకూ వేచిచూస్తూ..
1710. విచ్ఛిన్నమవుతూనే ఉన్నాయి బంధాలు..
సంబంధాలు నానాటికీ పతనమవుతూ..
1711. నవ్వులు నావలెక్కాయి..
ఆనందమంటూ నువ్వు రమ్మని పిలిచినందుకే..
1712. చిత్తం చైత్రమవుతోంది..
ప్రబంధాలన్నీ నీ మాలికల్లోనే దర్శనమిస్తుంటే
1713. మాలికలదెంత అదృష్టమో..
రోజుకో అష్టోత్తరంతో దేవేరిని స్తుతించావని..
1714. అక్షరహొయలన్నీ గమనించినట్లున్నావ్..
తపోభంగం కాకుండానే పదాలమాలలతో వరించేస్తూ..
1715. మరో ఆముక్తమాల్యదను తలచిందందుకే..
కృష్ణదేవరాయలు నిన్ను ఆవహించినందుకే..
1716. తీయదనం కోల్పోలేదుగా పెదవులు..
మాటల్లో మధువులే పొంగినందుకు..
1718. భూలోకస్వర్గం సాక్షాత్కారమంట..
పచ్చనితోరణాలతో కళకళలాడే అవని పసిడిగడపలో..
1719. కష్టాలన్నింటినీ తీసివేసా..
సంతోషాలను కూడుకుంటూ..
1720. వెన్నెలధూపమే నీ మంత్రం..
గమ్మత్తుగా మత్తులో ముంచేస్తూ..
1721. మణిమాలికను ఆధారం చేసుకున్నా..
నీ మనసు తెలుసుకోవాలని..
1722. కలిమిలేములు కంచికే..
చెలిమొక్కటే తోడుంటే..
1723. మాయేదో తెలియకుండానే చేసావుగా..
మంత్రమేసే అవసరమే లేదంటూ..
1724. వచనమూ వినబడుతోందిలే..
ఏడు అద్భుతాలు ఒకేమారు పులకితమైనట్లు..
1725. ఆవేదనతో పనేముందిలే..
నివేదన సక్రమంగా సజావుగా సాగుతుంటే..
1726. ఎప్పటికీ దివిటీలమేగా..
స్వప్రకాశమై వెలిగే సూర్యుని ముందర..
1727. మొదలెట్టక తప్పదు పరుగు..
లక్ష్యమన్నది నిర్దేశించుకోవడం జరిగాక..
1728. ఆలశ్యంగా బయటపడ్డా..
నన్నూ అమృతమనుకొని పంచేస్తావని భయపడినందుకే..
1729. వెన్నెలనై బయటకొచ్చా..
మనస్ఫూర్తిగా ఎదను చిలకడం మొదలుపెట్టావనే..
1730. వియోగం వెనుదిరగనంటోంది..
వసంతమొచ్చి పలకరించిందని..
1731. జలకమాడిన చాలనుకున్నా..
అనుభూతుల మధువులలో ప్రవాహానికి ఉరకలెత్తక..
1732. కర్పూర వసంతమే..
నీ వలపులో హారతినై కరిగిపోతూ..
1733. అధరాలు మాత్రమే చదవగలిగే మంత్రమది..
నవ్వుల నెలవంకను ఇలలోనే కనిపెట్టినందుకు..
1734. ఏ పరికరమూ కనిపెట్టబడలేదు..
విరిగిన మనసును అతుకేసేందుకు..
1735. విరహమూ మధురమే...
కనుల ముందు లేకున్నా మనసంతా నిండిన భావముతో..
1736. చిలక్కొయ్యకు చిక్కుకుంది చిరునవ్వు..
ఆషాడాన్నింకా అరపక్షం అనుభవించాలంటూ..
1737. కంటిచివరి చుక్క వింతగా మెరుస్తోంది..
నీలోని ఆర్ద్రత నేనేనని గమనించినందుకే..
1738. నిరంతర విరహమే ఎదలో..
హేమంత శిశిరాలు వెళ్ళి వసంతానికి చోటిచ్చినా ఎందుకో..
1739. అతిశయమే కలువలకి..
రేరాజు చాటుకెళ్తూ కన్నుకొట్టి పోయాడని..
1740. ఒంటరితనం భయపెడుతోంది..
చెక్కిలిపై నీరు ఆరేందుకు గాలి సైతం సహకరించట్లేదనే..
1741. గ్రీష్మంలోనూ నాకు తోడొచ్చావందుకేనేమో..
వసంతాన్ని కాసేపు పరిహాసమాడాలని..
1742. అనురాగమనే మేఘం కమ్ముకుంది..
నీ చూపుల్లోనూ చిరునవ్వుల్లోనూ నా గారాలు చూడాలనే..
1743. ఉరకలేస్తున్నాయి ఊహలన్నీ..
గమ్యమెరుగని గుర్రాలైనందుకే..
1744. చిరునవ్వులతొలకరికే వేచున్నా..
మంచులోతడిచిన అనుభూతిని ఒక్కమారు అనుభూతించాలనే..
1745. చేమంతి కారబ్బంతయ్యింది..
రూపును మార్చుకు నిన్ను రెచ్చగొట్టాలనే..
1746. మాయ నేర్చిన మనసు..
నన్ను కాదని మరేదో ఊహిస్తూ మైమరచిన ఉషస్సు..
1747. నెలవంకలా నడుమును తిప్పకలా..
హరివిల్లే చిన్నబుచ్చుకు చెదిరిపోయేలా..
1748. మల్లెలను మించినవిగా నీ నవ్వులు..
మేఘరాగంతో పాటగట్టి పరవశాన్ని పంచినట్లు..
1749. మబ్బులకీ ముసురొస్తోందేమో..
హృదయం లయతప్పి వర్షించాలని తొందరపడుతూ..
1750. ఎన్ని ముంగురులు సాయం చేసాయో..
వెన్నెల మోమంటూ తమలో దాచుకొనేందుకు..

..................................... ********.....................................

No comments:

Post a Comment