..................................... ********.....................................
2301. నీటికీ ప్రాణం పోసేస్తావు..
జలసౌందర్యాన్ని నాలో నింపేస్తూ..
2301. అంతుచిక్కనివాడివేలే..
పాదరసమై పరుగులుపెడుతూ..
2303. నా మనసు కరగదు..
వలపు జల్లుల్లో ముంచినా..పన్నీటితో నువ్వు అభిషేకించినా..
2304. అలసిపోయానని ఒప్పుకోవుగా..
ఎదురీదైనా గెలవాలనుకుంటూ...
2305. స్వప్నావస్థలోనే ఉంటావెందుకో..
కళ్ళముందు ప్రత్యక్షమై నే వరమిచ్చినా..
2306. నీ కిరణాలెంత హాయో..
వెచ్చబడే నా హృదయాన్ని అడిగేసావుగా..అందుకేమో వెక్కిరింత..
2307. కెలికావెందుకో నా మౌనాన్ని..
రవ్వంతసవ్వడైనా నీకు పడదంటూనే..
2308. కుంభవృష్టికి సైతం సాధ్యం కాదుగా..
మాలికలకు మనల్ని దూరం చేయడం..
2309. కాంచనపుష్పంలా మెరుస్తున్నా..
నా బంగారమంటూ నువ్వు పిలిచినప్పుడల్లా..
2310. ఓ క్షణం నిలబడిపోయా..
నిన్ను నాలోకి ఆవహించుకుంటూ..
2311. నిత్యవసంతమేగా..
మనసు బాల్యంలో అలా నిలబడిపోతే..
2312. అక్షరాలన్నీ కలికితురాయిలే..
ఏ క్షేత్రంలో పండించావో పదాల్ని..
2313. మరోచరిత్రకై ఎదురుచూస్తున్నా..
నీతో మళ్ళీ ఇలానే జతకట్టాలని..
2314. రంగులు అద్దుతున్నావుగా రాతిరికి..
నీ మాటలముత్యాల వరుసలుపేర్చి..
2315. కళ్ళు తెరుచుకున్నాయి..
అపరబ్రహ్మ ఎదురై సత్యాలు చెప్తుంటే..
2316. శృతిలయలే నీ మధురవాక్కులు..
మనసున ప్రణయరాగం వినిపించేవేళ..
2317. వెలకట్టలేనివే నీ భావాలు..
సరికొత్త అనుభూతులు రంగరిస్తూ
2318. వానవిల్లు తెల్లబోతోంది..
నీ చూపుల వర్ణాలకు మూర్ఛిల్లి
2319. నీ ఊసులెంత కమ్మనివో..
సంధ్యల్లో తేనీటిని మరపించేలా..
2320. నడిరేయి జాగారమే దిక్కేమో..
అకాలంలో నువ్విలా వర్షిస్తుంటే..
2321. ఉదయం చీకట్లు ముసురుతావు మేఘాలతో..
రాత్రంతా వెలుగులు చిమ్ముతావు మెరుపులతో.
2322. కలలోనేగా వియ్యాలు..
ఇలలో వలలు వేసే వలరాజువేగా.
2323. కొండనాలుకను వాడొద్దొన్నానందుకే..
మనసులో అక్కర్లేని మాటలు పుట్టుకొస్తాయనే..
2324. నిద్దురలోనూ కలవరమే..
నువ్వు కలగా రావేమోననే చింతల్లో
2325. నా ఊహలనిండా పరిమళాలే..
నువ్వు పంచగా విచ్చాయని
2326. గొడుగువై నిలబడినప్పుడే తెలిసింది..
నాకు పడగెత్తి పట్టావని..
2327. మనసు చంచలమైపోతోంది..
అచంచలమైన నీ ప్రేమను తాకినప్పుడల్లా
2328. అతిధివంటే ఏమోననుకున్నా..
నాలోకొచ్చి నన్నే ఆరాతీస్తావని తెలియక..
2329. మనసుకే పండుగయ్యావు..
ముహూర్తం చూసుకొనే అవకాశమే లేదంటూ.
2330. సొమ్మసిల్లుతున్న అనుభూతులు..
ఎంత రాసినా కలం అలసిపోనందుకే..
2331. నీ మాటలెప్పుడూ మురిపెమే..
నీట ముంచినా నేను మాత్రం పాలలోనే తేలిపోతూ..
2332. కొత్త ఉద్వేగానికి మేల్కొల్పులేగా..
అనుభవాన్ని రేపటి ఉత్సాహంగా మార్చుకొనే చొరవుంటే..
2333. అనుభవాన్ని విస్మరించేసా..
అనుభూతిలోపం ఎదురయ్యిందనే..
2334. కాటుకపిట్టలను పోలిన చీకటది..
రెప్పలవాకిట్లో నిశ్శబ్దంగా శయనిస్తూ..
2335. మనస్వినివే నువ్వు..
అనురాగాన్ని మనసుకు ఆయాచితంగా పంచేస్తూ..
2336. మనసు ముత్యమయ్యింది..
ఆల్చిప్పవై ఆకాశంకేసి నువ్వెదురు చూసినందుకే..
2337. మనసంతా మైమరపులే..
నీ పిలుపులకి పులకించిన తనువొంపులతో..
2338. మల్లెవై గుభాళిస్తున్నావు..
ఇన్నిమాలికల నడుమ నేనేం చేసేది..
2339. విరహంలో నేను..
నాలోని ప్రేమంతా నీకు పంచిచ్చేసి...
2340. ఉల్లాసినివే..
నా కంటికెప్పుడూ మల్లికవై కనిపిస్తూ..
2341. వికర్షించిన వర్ణాల కలగొలుపు..
నీ అభినందనకు ప్రతిస్పందనగా
2342. కన్నీటితో సంకేతాలు..
నీ వేదనలో నే తోడున్నానంటూ..
2343. ఆనవాలు పట్టేసా..
మబ్బుతెర నీకన్నా ముందుగా కమ్ముకున్నప్పుడే..
2344. వచ్చేసానందుకే..
వెన్నెలవానని వేకువగా తీర్చిదిద్ది.
2345. వెన్నెలగా మారిపోయా..
మబ్బులెన్ని అడ్డమొచ్చినా పున్నమై వెలిగించాలనే..
2346. ఆనందమవుతున్న మనసు..
నీ లేతకన్నుల్లో బంధింపబడిన అదృష్టానికి..
2347. తరిమేసా చీకటిని..
కొత్త అందాలను వెన్నెల్లో నివేదించాలని..
2348. నీ మనసెంత గమ్మత్తో..
ఉన్మత్తలా నన్ను ఊగిస్తూ..
2349. నాతో చెప్పిస్తావెందుకో..
ఇంద్రుడ్నడిగి కళ్ళు అరువు తెచ్చుకోమనే అల్లరి సలహాలు..
2350. జారుతుంటే పట్టు చిక్కాననుకున్నా..
పట్టుపుట్టమంత మెత్తగా పట్టుకుంటావనెరుగక..
..................................... ********.....................................
2301. నీటికీ ప్రాణం పోసేస్తావు..
జలసౌందర్యాన్ని నాలో నింపేస్తూ..
2301. అంతుచిక్కనివాడివేలే..
పాదరసమై పరుగులుపెడుతూ..
2303. నా మనసు కరగదు..
వలపు జల్లుల్లో ముంచినా..పన్నీటితో నువ్వు అభిషేకించినా..
2304. అలసిపోయానని ఒప్పుకోవుగా..
ఎదురీదైనా గెలవాలనుకుంటూ...
2305. స్వప్నావస్థలోనే ఉంటావెందుకో..
కళ్ళముందు ప్రత్యక్షమై నే వరమిచ్చినా..
2306. నీ కిరణాలెంత హాయో..
వెచ్చబడే నా హృదయాన్ని అడిగేసావుగా..అందుకేమో వెక్కిరింత..
2307. కెలికావెందుకో నా మౌనాన్ని..
రవ్వంతసవ్వడైనా నీకు పడదంటూనే..
2308. కుంభవృష్టికి సైతం సాధ్యం కాదుగా..
మాలికలకు మనల్ని దూరం చేయడం..
2309. కాంచనపుష్పంలా మెరుస్తున్నా..
నా బంగారమంటూ నువ్వు పిలిచినప్పుడల్లా..
2310. ఓ క్షణం నిలబడిపోయా..
నిన్ను నాలోకి ఆవహించుకుంటూ..
2311. నిత్యవసంతమేగా..
మనసు బాల్యంలో అలా నిలబడిపోతే..
2312. అక్షరాలన్నీ కలికితురాయిలే..
ఏ క్షేత్రంలో పండించావో పదాల్ని..
2313. మరోచరిత్రకై ఎదురుచూస్తున్నా..
నీతో మళ్ళీ ఇలానే జతకట్టాలని..
2314. రంగులు అద్దుతున్నావుగా రాతిరికి..
నీ మాటలముత్యాల వరుసలుపేర్చి..
2315. కళ్ళు తెరుచుకున్నాయి..
అపరబ్రహ్మ ఎదురై సత్యాలు చెప్తుంటే..
2316. శృతిలయలే నీ మధురవాక్కులు..
మనసున ప్రణయరాగం వినిపించేవేళ..
2317. వెలకట్టలేనివే నీ భావాలు..
సరికొత్త అనుభూతులు రంగరిస్తూ
2318. వానవిల్లు తెల్లబోతోంది..
నీ చూపుల వర్ణాలకు మూర్ఛిల్లి
2319. నీ ఊసులెంత కమ్మనివో..
సంధ్యల్లో తేనీటిని మరపించేలా..
2320. నడిరేయి జాగారమే దిక్కేమో..
అకాలంలో నువ్విలా వర్షిస్తుంటే..
2321. ఉదయం చీకట్లు ముసురుతావు మేఘాలతో..
రాత్రంతా వెలుగులు చిమ్ముతావు మెరుపులతో.
2322. కలలోనేగా వియ్యాలు..
ఇలలో వలలు వేసే వలరాజువేగా.
2323. కొండనాలుకను వాడొద్దొన్నానందుకే..
మనసులో అక్కర్లేని మాటలు పుట్టుకొస్తాయనే..
2324. నిద్దురలోనూ కలవరమే..
నువ్వు కలగా రావేమోననే చింతల్లో
2325. నా ఊహలనిండా పరిమళాలే..
నువ్వు పంచగా విచ్చాయని
2326. గొడుగువై నిలబడినప్పుడే తెలిసింది..
నాకు పడగెత్తి పట్టావని..
2327. మనసు చంచలమైపోతోంది..
అచంచలమైన నీ ప్రేమను తాకినప్పుడల్లా
2328. అతిధివంటే ఏమోననుకున్నా..
నాలోకొచ్చి నన్నే ఆరాతీస్తావని తెలియక..
2329. మనసుకే పండుగయ్యావు..
ముహూర్తం చూసుకొనే అవకాశమే లేదంటూ.
2330. సొమ్మసిల్లుతున్న అనుభూతులు..
ఎంత రాసినా కలం అలసిపోనందుకే..
2331. నీ మాటలెప్పుడూ మురిపెమే..
నీట ముంచినా నేను మాత్రం పాలలోనే తేలిపోతూ..
2332. కొత్త ఉద్వేగానికి మేల్కొల్పులేగా..
అనుభవాన్ని రేపటి ఉత్సాహంగా మార్చుకొనే చొరవుంటే..
2333. అనుభవాన్ని విస్మరించేసా..
అనుభూతిలోపం ఎదురయ్యిందనే..
2334. కాటుకపిట్టలను పోలిన చీకటది..
రెప్పలవాకిట్లో నిశ్శబ్దంగా శయనిస్తూ..
2335. మనస్వినివే నువ్వు..
అనురాగాన్ని మనసుకు ఆయాచితంగా పంచేస్తూ..
2336. మనసు ముత్యమయ్యింది..
ఆల్చిప్పవై ఆకాశంకేసి నువ్వెదురు చూసినందుకే..
2337. మనసంతా మైమరపులే..
నీ పిలుపులకి పులకించిన తనువొంపులతో..
2338. మల్లెవై గుభాళిస్తున్నావు..
ఇన్నిమాలికల నడుమ నేనేం చేసేది..
2339. విరహంలో నేను..
నాలోని ప్రేమంతా నీకు పంచిచ్చేసి...
2340. ఉల్లాసినివే..
నా కంటికెప్పుడూ మల్లికవై కనిపిస్తూ..
2341. వికర్షించిన వర్ణాల కలగొలుపు..
నీ అభినందనకు ప్రతిస్పందనగా
2342. కన్నీటితో సంకేతాలు..
నీ వేదనలో నే తోడున్నానంటూ..
2343. ఆనవాలు పట్టేసా..
మబ్బుతెర నీకన్నా ముందుగా కమ్ముకున్నప్పుడే..
2344. వచ్చేసానందుకే..
వెన్నెలవానని వేకువగా తీర్చిదిద్ది.
2345. వెన్నెలగా మారిపోయా..
మబ్బులెన్ని అడ్డమొచ్చినా పున్నమై వెలిగించాలనే..
2346. ఆనందమవుతున్న మనసు..
నీ లేతకన్నుల్లో బంధింపబడిన అదృష్టానికి..
2347. తరిమేసా చీకటిని..
కొత్త అందాలను వెన్నెల్లో నివేదించాలని..
2348. నీ మనసెంత గమ్మత్తో..
ఉన్మత్తలా నన్ను ఊగిస్తూ..
2349. నాతో చెప్పిస్తావెందుకో..
ఇంద్రుడ్నడిగి కళ్ళు అరువు తెచ్చుకోమనే అల్లరి సలహాలు..
2350. జారుతుంటే పట్టు చిక్కాననుకున్నా..
పట్టుపుట్టమంత మెత్తగా పట్టుకుంటావనెరుగక..
..................................... ********.....................................
No comments:
Post a Comment