..................................... ********.....................................
1601. నటనలో పండిపోతారు కొందరు..
పులుసై పులిహోరలో కలిసిపోతారులే..
1602. నీ హృదయపు వెలుగు ఎక్కువైంది..
సూర్యుడి ముందు దివిటీలా మెరుస్తూ
1603. భావాలు బైటికొస్తున్నాయి..
బాంధవ్యాలు పెంచుకోవాలనే
1604. ప్రతీఎడారిలోనూ ఒకవైపు పచ్చదనముంటుందిగా..
కొన్నిఒంటెలు మాత్రమే చూడగలవేమో
1605. మనసుకి చిక్కొచ్చింది..
చిక్కనైనబంధంలో చుట్టేసావని..
1606. మరువలేకున్నాను..
నటన నిజమైతే బాగుండనే తలంపులో నేను.
1607. వయ్యారంగా ఊగింది..
ఊహలఊయలలొ తోడయ్యావని
1608. కవిత్వం కురుస్తోంది..
జీవితం చవిచూస్తున్నావనేమో..
1609. ఎన్నెన్ని జన్మలబంధమో..
ఈ జన్మలోనూ వెతుక్కుంటూ వరించింది..
1610. .చిలుకల చిగురింపు..
పచ్చనిపంక్తికి వెలుగులద్దినట్లు
1611. జీవితం వ్యర్ధం చేసుకుంటున్నారనుకుంటా
వెతుకుతున్న సంతోషం తమలోనే ఉందనే నిజాన్ని గ్రహించక
1612. దిగుళ్ళను దిగదుడిచేసా..
నువ్విచ్చిన పట్టుకోక ప్రేమగా చుట్టుకొని..
1613. కలంలో జీవితాన్ని నింపాలనుంది..
కవిత్వం ఒలికిస్తుందేమో చూడాలని
1614. కనులు సంబరపడ్డాయి
వాస్తవమైన తమ కలకు ముచ్చటపడి
1615. మనసులో దిగులుమేఘం కమ్ముకుంది
నీ హృదయరశ్మి సోకనందుకేమో.
1616. వెన్నెలే విస్తుపోయింది
మంచెనే మంచంగా మార్చిన నేర్పుకి
1617. అబద్దమూ మౌనవించింది...
పెదవిప్పితే నిజం బైటపడుతుందని తెలుసుకుని
1618. అబద్దం ఆశ పడిందేమో..
నిదానంగా నిజంలో ఇమిడిపోవాలని..
1619. నిజాయితీ నివ్వెరపోతుంది..
అబద్దానికి ఇంత వేగం ఎక్కడిదని
1620. నిజాయితీ దహించుకుపోతోంది
అబద్దపు ఆయుస్షుకు అడ్డుపడలేక కాబోలు..
1621. కురుస్తున్నాయి వెన్నెలచినుకులు..
నా మనసు మురిసి మెరిసినందుకే
1622. ఆశల దోసిలిపట్టా..
నీ ఊహల మధురిమలను ఒడిసిపట్టాలని
1623. నిషేదించా నిముషాలను..
నీవు లేనప్పుడు నెమ్మదిగా నడుస్తున్నాయని..
1624. .నిదురేలేని రాత్రులెన్నో..
నిశ్శబ్దాన్ని కౌగిలించుకుంటూ
1625. మనకే తెలిసిన నిజాలు..
మనసైన కావ్యాలకి ప్రేరణలు..
1626. మనసుకైతే మరణమే..
ప్రాణం శరీరానికి ఆసరా ఇచ్చేంతవరకూ
1627. నీ అమృతగానం సోకినందుకేమో..
నా మనసు తీయనైంది..
1628. భావాలు భంగిమలు నేర్చాయి..
నీవాలపించే రాగాలకు పులకరించేమో..
1629. భావాలకెంత భాగ్యమో..
అతిశయమే లేని నిన్ను పొగడాలంటే
1630. ఏ మత్తు జల్లావో మనసుకి..
స్పందించడం మానేసి మూడు రోజులైంది
1631. తలపులో కొచ్చానుగా..
తలుపులిప్పుడు తీసావని తల్లడిల్లుతోంది మది..
1632. పదాలకెంత వివశత్వమో..
నీ భావాలలో అనుభూతిగా ఒదుగుతున్నందుకు
1633. క్షణాలకెంత ఆరాటమో..
ప్రతీక్షణం నిన్నే తలచి తరించాలని..
1634. తుమ్మెదలకి మాయలెక్కువే..
క్షణానికో పువ్వును అలవోకగా కోరుకుంటాయి..
1635. గానానికీ రాగాలద్దావుగా..
కోయిల లేతగొంతును నీలో నింపుకొని
1636. పువ్వులదెంత అదృష్టమో..
భ్రమరానికి మధువునిచ్చి ప్రాణం నిలబెడుతున్నందుకు..
1637. కాలమెంత పొదుపరో..
మన క్షణాలకు లెక్కలు కడుతుంది..
1638. మాటలన్నీ మౌనాలయ్యాయి..
అనుబంధాన్ని అవమానిస్తుంటే..
1639. ముంగురులకు ముచ్చట్లెక్కువ..
ఎంతసేపని దాచుకుంటాయి
1640. అమృతవర్షమే కురుస్తున్న భావన నాలో..
నీ చూపులు వెన్నెలై కురుస్తుంటే..
1641. గతం విగతం అయ్యింది..
అవగతాల అవశేషాలు మిగిలి.
1642. చలిపులివై కరుస్తున్నావుగా..
చింతను చిగురు చేసి నమిలేస్తూ
1643. కలికాలం ఇది..
ఆకలి తీరేదాకే ఏ అవసరమైనా..:(
1644. కుళ్ళుకుంటోంది కనుమ
కన్నులవిందు నేనవుతున్నానని...
1645. కాగితం చెమరిస్తోంది
కన్నీటిని అక్షరబద్దం చేస్తున్నానని కనిపెట్టిందేమో
1646. ప్రేమ కురుస్తున్నట్లుంది..
కలబోసుకున్న కబుర్లు తీయగా తడుముతుంటే.
1647. జారినా హృదయంలోకేగా..
కరాలహారంలో ఒదిగేందుకేగా
1648. కల'వరమే'..
కల నిజమైతే...
1649. నీ మనోవేదనకు మందు నేనవుతా..
నా హృదయపూర్వక కానుక నీవైతే..
1650. నా మనసు ముచ్చటపడుతోంది..
గుండెలోగిలిలో నువ్వు గీసిన అల్లిబిల్లి గీతలు చూసి..
..................................... ********.....................................
1601. నటనలో పండిపోతారు కొందరు..
పులుసై పులిహోరలో కలిసిపోతారులే..
1602. నీ హృదయపు వెలుగు ఎక్కువైంది..
సూర్యుడి ముందు దివిటీలా మెరుస్తూ
1603. భావాలు బైటికొస్తున్నాయి..
బాంధవ్యాలు పెంచుకోవాలనే
1604. ప్రతీఎడారిలోనూ ఒకవైపు పచ్చదనముంటుందిగా..
కొన్నిఒంటెలు మాత్రమే చూడగలవేమో
1605. మనసుకి చిక్కొచ్చింది..
చిక్కనైనబంధంలో చుట్టేసావని..
1606. మరువలేకున్నాను..
నటన నిజమైతే బాగుండనే తలంపులో నేను.
1607. వయ్యారంగా ఊగింది..
ఊహలఊయలలొ తోడయ్యావని
1608. కవిత్వం కురుస్తోంది..
జీవితం చవిచూస్తున్నావనేమో..
1609. ఎన్నెన్ని జన్మలబంధమో..
ఈ జన్మలోనూ వెతుక్కుంటూ వరించింది..
1610. .చిలుకల చిగురింపు..
పచ్చనిపంక్తికి వెలుగులద్దినట్లు
1611. జీవితం వ్యర్ధం చేసుకుంటున్నారనుకుంటా
వెతుకుతున్న సంతోషం తమలోనే ఉందనే నిజాన్ని గ్రహించక
1612. దిగుళ్ళను దిగదుడిచేసా..
నువ్విచ్చిన పట్టుకోక ప్రేమగా చుట్టుకొని..
1613. కలంలో జీవితాన్ని నింపాలనుంది..
కవిత్వం ఒలికిస్తుందేమో చూడాలని
1614. కనులు సంబరపడ్డాయి
వాస్తవమైన తమ కలకు ముచ్చటపడి
1615. మనసులో దిగులుమేఘం కమ్ముకుంది
నీ హృదయరశ్మి సోకనందుకేమో.
1616. వెన్నెలే విస్తుపోయింది
మంచెనే మంచంగా మార్చిన నేర్పుకి
1617. అబద్దమూ మౌనవించింది...
పెదవిప్పితే నిజం బైటపడుతుందని తెలుసుకుని
1618. అబద్దం ఆశ పడిందేమో..
నిదానంగా నిజంలో ఇమిడిపోవాలని..
1619. నిజాయితీ నివ్వెరపోతుంది..
అబద్దానికి ఇంత వేగం ఎక్కడిదని
1620. నిజాయితీ దహించుకుపోతోంది
అబద్దపు ఆయుస్షుకు అడ్డుపడలేక కాబోలు..
1621. కురుస్తున్నాయి వెన్నెలచినుకులు..
నా మనసు మురిసి మెరిసినందుకే
1622. ఆశల దోసిలిపట్టా..
నీ ఊహల మధురిమలను ఒడిసిపట్టాలని
1623. నిషేదించా నిముషాలను..
నీవు లేనప్పుడు నెమ్మదిగా నడుస్తున్నాయని..
1624. .నిదురేలేని రాత్రులెన్నో..
నిశ్శబ్దాన్ని కౌగిలించుకుంటూ
1625. మనకే తెలిసిన నిజాలు..
మనసైన కావ్యాలకి ప్రేరణలు..
1626. మనసుకైతే మరణమే..
ప్రాణం శరీరానికి ఆసరా ఇచ్చేంతవరకూ
1627. నీ అమృతగానం సోకినందుకేమో..
నా మనసు తీయనైంది..
1628. భావాలు భంగిమలు నేర్చాయి..
నీవాలపించే రాగాలకు పులకరించేమో..
1629. భావాలకెంత భాగ్యమో..
అతిశయమే లేని నిన్ను పొగడాలంటే
1630. ఏ మత్తు జల్లావో మనసుకి..
స్పందించడం మానేసి మూడు రోజులైంది
1631. తలపులో కొచ్చానుగా..
తలుపులిప్పుడు తీసావని తల్లడిల్లుతోంది మది..
1632. పదాలకెంత వివశత్వమో..
నీ భావాలలో అనుభూతిగా ఒదుగుతున్నందుకు
1633. క్షణాలకెంత ఆరాటమో..
ప్రతీక్షణం నిన్నే తలచి తరించాలని..
1634. తుమ్మెదలకి మాయలెక్కువే..
క్షణానికో పువ్వును అలవోకగా కోరుకుంటాయి..
1635. గానానికీ రాగాలద్దావుగా..
కోయిల లేతగొంతును నీలో నింపుకొని
1636. పువ్వులదెంత అదృష్టమో..
భ్రమరానికి మధువునిచ్చి ప్రాణం నిలబెడుతున్నందుకు..
1637. కాలమెంత పొదుపరో..
మన క్షణాలకు లెక్కలు కడుతుంది..
1638. మాటలన్నీ మౌనాలయ్యాయి..
అనుబంధాన్ని అవమానిస్తుంటే..
1639. ముంగురులకు ముచ్చట్లెక్కువ..
ఎంతసేపని దాచుకుంటాయి
1640. అమృతవర్షమే కురుస్తున్న భావన నాలో..
నీ చూపులు వెన్నెలై కురుస్తుంటే..
1641. గతం విగతం అయ్యింది..
అవగతాల అవశేషాలు మిగిలి.
1642. చలిపులివై కరుస్తున్నావుగా..
చింతను చిగురు చేసి నమిలేస్తూ
1643. కలికాలం ఇది..
ఆకలి తీరేదాకే ఏ అవసరమైనా..:(
1644. కుళ్ళుకుంటోంది కనుమ
కన్నులవిందు నేనవుతున్నానని...
1645. కాగితం చెమరిస్తోంది
కన్నీటిని అక్షరబద్దం చేస్తున్నానని కనిపెట్టిందేమో
1646. ప్రేమ కురుస్తున్నట్లుంది..
కలబోసుకున్న కబుర్లు తీయగా తడుముతుంటే.
1647. జారినా హృదయంలోకేగా..
కరాలహారంలో ఒదిగేందుకేగా
1648. కల'వరమే'..
కల నిజమైతే...
1649. నీ మనోవేదనకు మందు నేనవుతా..
నా హృదయపూర్వక కానుక నీవైతే..
1650. నా మనసు ముచ్చటపడుతోంది..
గుండెలోగిలిలో నువ్వు గీసిన అల్లిబిల్లి గీతలు చూసి..
..................................... ********.....................................
No comments:
Post a Comment