..................................... ********.....................................
901. వినోదం సైతం మరపిస్తుంది..
నీ తలపుల్లో కూరుకుపోతుంటే..
902. నీ ఏకాంతానికి తోడయ్యా..
నీ ఒంటరితన్నాన్ని సాగనంపుతూ..
903. కనురెప్పల కానుకలే..
పెదవుల నవ్వులను కన్నుల్లో చూపిస్తూ..
904. పెదవులు మౌనవించాయి..
కన్నులే తమ పని చేసేస్తుంటే..
905. కన్నులు తెరచి ఉంచా..
నీ అల్లరేంటో చూద్దామనే..
906. అపరాజితనేగా..
నీ విజయం వెనుక నిలబడినందుకు..
907. మగతలోకి జారుకున్నా..
నీ ప్రేమ మైకమని తెలియక..
908. హృదయాన్ని చుంబించినప్పుడే తెలిసింది..
నీవో తీయని మగతవని
909. హృదయం నవ్వుతోంది..
నువ్వు రాసిన కవిత మీటినందుకే..
910. ఎప్పుడూ నీ గురించేనా..
నన్నెక్కడ దాచావో చెప్పవూ..
911. మంజులమయ్యింది నా మనసు..
మృదువుగా నువ్వల్లిన అక్షరాలకే..
912. మనసునీ విడువలేదెందుకో గ్రీష్మం..
జ్ఞాపకాలను సైతం ఎండిస్తూ..
913. తనువుకి తొందరెక్కువయ్యిందేమో
నిన్ను దాటొచ్చి నన్ను అందుకోవాలని..
914. శత్రువునే ఇష్టపడుతున్నామేమో..
స్వార్థం శత్రువని తెలిసీ చేరదీస్తూ..
915. రెప్పలసవ్వడి రహస్యం తెలుసుకోలేకపోయా..
కోలాటం జరుగుతోందని సర్దుకుపోయా..
916. వెదురు పూజనీయమయ్యింది..
మనిషిగా మారిన దేవుడు తాకాడనే..
917. మరణాన్ని ఊహించడమెందుకో వాడు..
వాస్తవంలోజీవించడం చేతకాకేమో..
918. వెంట్రుకవాసి లోపమే..
నీ చేతికి చిక్కేవరకూ ఆనందం..
919. ఏడడుగుల సంబంధమే...
అడుగడుక్కీ సమాధానం దొరకని ప్రశ్నలతో..
920. వెచ్చని పులకింత కావాలనుంది..
నీ అభిమానంలో చోటిచ్చినందుకే..
921. నీవెప్పుడూ నా కలవేగా..
కలవరమైనా మాటలతో కవ్విస్తావెందుకలా..
922. మనసును ప్రశ్నించు ఇప్పటికైనా..
నిన్ను వీడి నేనెక్కడున్నానని..
923.అడగాలనుందో ప్రశ్న..
నీకెలా తెలిసిందని.
924. ప్రశ్నలోనే ఉంది సమాధానం..
నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి..
925.అర్థం కాని ప్రశ్నలే..
నిన్నా రేపు నేటికెప్పుడూ..
926. ప్రశ్నగా మిగలడమే మేలు..
నీకు జవాబిచ్చి అలుసయ్యేకంటే..
927. అంతుచిక్కని ప్రశ్నలే..
అనుబంధాల వేటలో..
928. ప్రశ్నార్థకమవుతావెందుకలా..
అస్తిత్వానికి ఆరాటపడినందుకేనా...
929. వెనుదిరిగిన ప్రశ్నలెన్నో...
నీ సమాధానాన్ని జీర్ణం చేసుకోలేక..
930. నన్ను ప్రశ్నిస్తావేం..
పలుగాకుల లోకం నాకేం తెలుసని..
931. మధ్యతరగతి మనిషనుకుంటా..
ఆరావళిని మించిన ప్రశ్నావళా వదనంలో..
932. మరో ప్రశ్న వెతుక్కో..
రెంటికీ కలిసి సమాధానమొస్తుంది..
934. నాగరికత హెచ్చినందుకేమో..
ప్రశ్న పరిప్రశ్నయ్యింది..
935. అమ్మకెప్పుడూ నిరీక్షణేగా..
ఆలికొంగు పట్టుకుతిరిగే కొడుకు సంరక్షణలో..
936. సమాధానం అక్కడే దొరికింది..
నీ మనసు నిఘంటువులోనే..
937. అల్లుకున్నా ఆర్తినై నిలువెల్లా..
నులివెచ్చని జవాబు కావాలనే..
938. మనసుకెన్ని మలుపులో..
పయనించే దారిలో అడ్డుతగిలి దారితప్పిస్తూ..
939. గతమో విగతమైనదే..
జ్ఞాపకాలను తవ్వుకొని మరీ విలపించేలా..
940.ఊపిరెందుకు బరువెక్కదు..
ఉసురు తీసే ఆలోచనలేగా అన్నీ..
941. సూర్యకాంతి పువ్వునే..
ప్రతీ ఉదయం నీకై ఎదురుచూస్తూ..
942. నీ హృదయరశ్మికి వేడెక్కావనుకున్నాను..
నాది అనుమానమని దాటెస్తావేం..
943. ముగింపు ముచ్చటలెందుకులే..
మనసుకి సునిసిత స్పర్శని పరిచయించావుగా..
944. పచ్చని చెక్కిలే..
నీపై అలవికాని మక్కువతో ఎర్రనయ్యేవరకూ..
945. బులిపిస్తూనే ఉన్నావుగా..
మాటల మంత్రాలతో నన్ను శాంతింపచేసి..
946. నా మౌనం మాట్లాడుతోందిగా..
నీ మనసులో భావాన్ని బయటకు తీస్తావేమో చూడాలనే..
947. రెప్పలకౌగిలి సిద్ధం చేసా..
కన్నుల్లోకొచ్చి సేద తీరతావనే...
948. జన్మంతా నీతోనే..
అంచులెరుగని స్వర్గం కలిసి చూడాలని..
949. వానకోయిలనై చెంత చేరా..
నీ చింతలు తీర్చాలనే..
950. చంపేసావు..
బతికుండగానే దెయ్యాన్ని చూపించి..
..................................... ********.....................................
901. వినోదం సైతం మరపిస్తుంది..
నీ తలపుల్లో కూరుకుపోతుంటే..
902. నీ ఏకాంతానికి తోడయ్యా..
నీ ఒంటరితన్నాన్ని సాగనంపుతూ..
903. కనురెప్పల కానుకలే..
పెదవుల నవ్వులను కన్నుల్లో చూపిస్తూ..
904. పెదవులు మౌనవించాయి..
కన్నులే తమ పని చేసేస్తుంటే..
905. కన్నులు తెరచి ఉంచా..
నీ అల్లరేంటో చూద్దామనే..
906. అపరాజితనేగా..
నీ విజయం వెనుక నిలబడినందుకు..
907. మగతలోకి జారుకున్నా..
నీ ప్రేమ మైకమని తెలియక..
908. హృదయాన్ని చుంబించినప్పుడే తెలిసింది..
నీవో తీయని మగతవని
909. హృదయం నవ్వుతోంది..
నువ్వు రాసిన కవిత మీటినందుకే..
910. ఎప్పుడూ నీ గురించేనా..
నన్నెక్కడ దాచావో చెప్పవూ..
911. మంజులమయ్యింది నా మనసు..
మృదువుగా నువ్వల్లిన అక్షరాలకే..
912. మనసునీ విడువలేదెందుకో గ్రీష్మం..
జ్ఞాపకాలను సైతం ఎండిస్తూ..
913. తనువుకి తొందరెక్కువయ్యిందేమో
నిన్ను దాటొచ్చి నన్ను అందుకోవాలని..
914. శత్రువునే ఇష్టపడుతున్నామేమో..
స్వార్థం శత్రువని తెలిసీ చేరదీస్తూ..
915. రెప్పలసవ్వడి రహస్యం తెలుసుకోలేకపోయా..
కోలాటం జరుగుతోందని సర్దుకుపోయా..
916. వెదురు పూజనీయమయ్యింది..
మనిషిగా మారిన దేవుడు తాకాడనే..
917. మరణాన్ని ఊహించడమెందుకో వాడు..
వాస్తవంలోజీవించడం చేతకాకేమో..
918. వెంట్రుకవాసి లోపమే..
నీ చేతికి చిక్కేవరకూ ఆనందం..
919. ఏడడుగుల సంబంధమే...
అడుగడుక్కీ సమాధానం దొరకని ప్రశ్నలతో..
920. వెచ్చని పులకింత కావాలనుంది..
నీ అభిమానంలో చోటిచ్చినందుకే..
921. నీవెప్పుడూ నా కలవేగా..
కలవరమైనా మాటలతో కవ్విస్తావెందుకలా..
922. మనసును ప్రశ్నించు ఇప్పటికైనా..
నిన్ను వీడి నేనెక్కడున్నానని..
923.అడగాలనుందో ప్రశ్న..
నీకెలా తెలిసిందని.
924. ప్రశ్నలోనే ఉంది సమాధానం..
నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి..
925.అర్థం కాని ప్రశ్నలే..
నిన్నా రేపు నేటికెప్పుడూ..
926. ప్రశ్నగా మిగలడమే మేలు..
నీకు జవాబిచ్చి అలుసయ్యేకంటే..
927. అంతుచిక్కని ప్రశ్నలే..
అనుబంధాల వేటలో..
928. ప్రశ్నార్థకమవుతావెందుకలా..
అస్తిత్వానికి ఆరాటపడినందుకేనా...
929. వెనుదిరిగిన ప్రశ్నలెన్నో...
నీ సమాధానాన్ని జీర్ణం చేసుకోలేక..
930. నన్ను ప్రశ్నిస్తావేం..
పలుగాకుల లోకం నాకేం తెలుసని..
931. మధ్యతరగతి మనిషనుకుంటా..
ఆరావళిని మించిన ప్రశ్నావళా వదనంలో..
932. మరో ప్రశ్న వెతుక్కో..
రెంటికీ కలిసి సమాధానమొస్తుంది..
934. నాగరికత హెచ్చినందుకేమో..
ప్రశ్న పరిప్రశ్నయ్యింది..
935. అమ్మకెప్పుడూ నిరీక్షణేగా..
ఆలికొంగు పట్టుకుతిరిగే కొడుకు సంరక్షణలో..
936. సమాధానం అక్కడే దొరికింది..
నీ మనసు నిఘంటువులోనే..
937. అల్లుకున్నా ఆర్తినై నిలువెల్లా..
నులివెచ్చని జవాబు కావాలనే..
938. మనసుకెన్ని మలుపులో..
పయనించే దారిలో అడ్డుతగిలి దారితప్పిస్తూ..
939. గతమో విగతమైనదే..
జ్ఞాపకాలను తవ్వుకొని మరీ విలపించేలా..
940.ఊపిరెందుకు బరువెక్కదు..
ఉసురు తీసే ఆలోచనలేగా అన్నీ..
941. సూర్యకాంతి పువ్వునే..
ప్రతీ ఉదయం నీకై ఎదురుచూస్తూ..
942. నీ హృదయరశ్మికి వేడెక్కావనుకున్నాను..
నాది అనుమానమని దాటెస్తావేం..
943. ముగింపు ముచ్చటలెందుకులే..
మనసుకి సునిసిత స్పర్శని పరిచయించావుగా..
944. పచ్చని చెక్కిలే..
నీపై అలవికాని మక్కువతో ఎర్రనయ్యేవరకూ..
945. బులిపిస్తూనే ఉన్నావుగా..
మాటల మంత్రాలతో నన్ను శాంతింపచేసి..
946. నా మౌనం మాట్లాడుతోందిగా..
నీ మనసులో భావాన్ని బయటకు తీస్తావేమో చూడాలనే..
947. రెప్పలకౌగిలి సిద్ధం చేసా..
కన్నుల్లోకొచ్చి సేద తీరతావనే...
948. జన్మంతా నీతోనే..
అంచులెరుగని స్వర్గం కలిసి చూడాలని..
949. వానకోయిలనై చెంత చేరా..
నీ చింతలు తీర్చాలనే..
950. చంపేసావు..
బతికుండగానే దెయ్యాన్ని చూపించి..
..................................... ********.....................................
No comments:
Post a Comment